మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్

ఒక పట్టణములోని లేదా ఒక నగరంలోని కంప్యూటర్లను అనుసంధానించటానికి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్కులను వాడుతారు. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ను సంక్షిప్తంగా మాన్ (MAN) అంటారు. మాన్ ద్వారా కేవలము డేటాను మాత్రమే కాక మాటలను కూడా పంపవచ్చును. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వీడియో సిగ్నల్సును కూడా ఒక కంప్యూటరు నుంచి వేరొక కంప్యూటరుకు పంపవచ్చును. స్థానిక కేబుల్ టి.వి. ప్రసారములు పంపుట కూడా సాధ్యమే. మాన్ కు మంచి ఉదాహరణ IEEE 802.6 డిక్యూడిబి.


మూలాలుసవరించు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ