మెరిసే మెరిసే 2021లో రూపొందిన తెలుగు సినిమా.[1] కొత్తూరి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించిన ఈ సినిమాకు పవన్ కుమార్ కె. దర్శకత్వం వహించాడు. దినేష్ తేజ్, శ్వేతా అవస్తి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 6 ఆగస్టు 2021న విడుదలైంది.[2]

మెరిసే మెరిసే
దర్శకత్వంపవన్ కుమార్ కె.
నిర్మాతవెంకటేష్ కొత్తూరి
తారాగణందినేష్ తేజ్, శ్వేతా అవస్తి
నిర్మాణ
సంస్థలు
కొత్తూరి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఎల్‌ఎల్‌పి
పంపిణీదార్లుపీవీఆర్ పిక్చర్స్
విడుదల తేదీ
6 ఆగస్టు 2021 (2021-08-06)
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

మెరిసే మెరిసే సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ 18 సెప్టెంబర్ 2020న విడుదల చేశాడు.[3] మెరిసే మెరిసే టీజర్‌ను 6 ఫిబ్రవరి 2021న దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశాడు.[4]ఈ సినిమాలోని కనులతో రచించు లిరికల్ సాంగ్ ను హీరో శ్రీవిష్ణు 20 నవంబర్ 2020న,[5] నిన్నే నేనిలా లిరికల్ సాంగ్ ను 24 డిసెంబర్ 2020న విడుదల చేశారు.

నటీనటులు

మార్చు
  • దినేష్ తేజ్
  • శ్వేతా అవస్తి
  • సంజయ్ స్వరూప్
  • గురురాజ్
  • సంధ్య జనక్
  • బిందు
  • మని
  • శశాంక్
  • నానాజీ

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: కొత్తూరి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఎల్‌ఎల్‌పి
  • నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పవన్ కుమార్ కె.
  • సంగీతం: కార్తీక్‌ కొడగండ్ల
  • సినిమాటోగ్రఫీ: నగేష్‌ బన్నెల్

మూలాలు

మార్చు
  1. Andrajyothy (4 November 2020). "'మెరిసే మెరిసే'". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  2. Sakshi (18 July 2021). "థియేటర్లలో మెరిసే మెరిసే, అప్పుడే రిలీజ్‌!". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  3. Sakshi (20 September 2020). "ప్రేమ మెరిసే". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  4. Telangana Today (6 February 2021). "'Merise Merise' looks visually good: Siva Nirvana". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
  5. EENADU (21 November 2020). "ప్రేమ మెరిసే." Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.