మేఘా ధాదే
మేఘా ధాడే మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి. 2018లో బిగ్ బాస్ మరాఠీ 1 మొదటి సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది.[2] తర్వాత బిగ్ బాస్ 12 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది.[3]
మేఘా ధాదే | |
---|---|
జననం | మే 22[1] |
ఇతర పేర్లు | పరి, బాలి, మేఘుడి |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2004-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆదిత్య పావస్కర్ |
పిల్లలు | 2 |
జననం
మార్చుమేఘా ధాడే జూన్ 22న మహారాష్ట్ర, జల్గావ్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.
నటనారంగం
మార్చుకిస్ ధేష్ మై హై మేరా దిల్, కస్తూరి వంటి సీరియళ్ళతోపాటు ఇతర హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది.[4] 2012లో మరాఠీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. డిడి నేషనల్‌లో ప్రసారమైన పెహచాన్ సీరియల్ లో కూడా నటించింది.[5] 2018 ప్రారంభంలో బిగ్ బాస్ మరాఠీ రియాలిటీ షోలో విజేతగా నిలిచింది.[6] 2018 అక్టోబరు చివరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరొక రియాలిటీ షో బిగ్ బాస్ 12 లో చేరింది. డిసెంబరు 6న ఆ షో నుండి తొలగించబడింది.[7]
వ్యక్తిగత జీవితం
మార్చుమేఘా ధాడేకు ఆదిత్య పావస్కర్‌తో వివాహం జరిగింది.[8] తన భర్త మొదటి వివాహం నుండి ఇద్దరు పిల్లలు, కుమార్తె, సాక్షి, సవతి కుమారుడు వేదాంత్ ఉన్నారు.[9]
నటించినవి
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | భాష | పాత్ర | మూలాలు |
---|---|---|---|---|
2009 | మాన్ సన్మాన్ | మరాఠీ | ||
2011 | సూపర్ స్టార్ | మరాఠీ | ||
2012 | విషయం | మరాఠీ | [10] | |
2016 | ఏక్ హోతీ రాణి | మరాఠీ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | కార్యక్రమం | భాష | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2004 | కసౌతి జిందగీ కే | హిందీ | ||
2008 | పెహచాన్ | హిందీ | సునైనా | |
2009 | కస్తూరి | హిందీ | సాచి | |
2014 | జుంజ్ మారత్మోలి | మరాఠీ | పోటీదారు | |
2018 | బిగ్ బాస్ మరాఠీ 1 | మరాఠీ | విజేత పోటీదారు | |
అస్సల్ పహునే ఇర్సల్ నమునే | మరాఠీ | అతిథి పాత్ర | ||
బిగ్ బాస్ 12 | హిందీ | (వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 36వ రోజున ప్రవేశించి, 83వ రోజు తొలగించబడింది) | ||
ఏక్దమ్ కడక్ | మరాఠీ | బిగ్ బాస్ మాజీ విజేతగా | ||
2019 | బిగ్ బాస్ మరాఠీ 2 | మరాఠీ | స్పెషల్ టాస్క్ కోసం | |
2020 | ఆజ్ కే స్పెషల్ | మరాఠీ | శివ్ ఠాకరేతో పాటు | |
2021 | బిగ్ బాస్ మరాఠీ 3 | మరాఠీ | [11] |
మూలాలు
మార్చు- ↑ "Actress Sai Lokur wishes Megha Dhade a very happy birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
- ↑ "Bigg Boss Marathi winner Megha Dhade: Sai was my biggest competitor". Times of India. 23 July 2018.
- ↑ "Bigg Boss 12: Bigg Boss Marathi winner Megha Dhade enters the show as wild card contestant".
- ↑ "Meet Bigg Boss 12 wild card contestant Megha Dhade". The Indian Express. 23 October 2018.
- ↑ "Pehchaan". indiantelevision.com. Archived from the original on 19 February 2015. Retrieved 2022-12-17.
- ↑ "Bigg Boss Marathi: Megha Dhade wins the trophy". Times of India. 23 July 2018.
- ↑ "Bigg Boss 12 evicted contestant Megha Dhade: Deepak Thakur is a disgusting guy".
- ↑ "Bigg Boss Marathi Exclusive: Megha Dhade's husband Aditya talks about the actress and her game". Times of India. 22 July 2018.
- ↑ "Bigg Boss Marathi: From Getting Pregnant Before Marriage To Sleeping On A Railway Platform, A Quick Look At Megha Dhade's Journey". Times of India. 24 April 2018.
- ↑ "Review: 'Matter' (Marathi)". Daily News and Analysis. Retrieved 2022-12-17.
- ↑ "Bigg Boss Marathi 3: BB Marathi 1 winner Megha Dhade and former contestant Resham Tipnis to appear on the show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
బయటి లింకులు
మార్చుఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మేఘా ధాదే పేజీ