మేఘేశ్వర ఆలయం 12 వ శతాబ్దపు శివాలయం.[1] ఇది భారతదేశంలోని భువనేశ్వర్ నగరం లోని టాంకాపాని రహదారి ప్రాంతంలో ఉన్న ఒక సజీవ ఆలయం. దీన్ని సప్తరథ వాస్తు శైలిలో నిర్మించారు. దేవాలయంపై నర్తకిలు, జంతువులు, పక్షులు, పువుల బొమ్మలను చెక్కారు. టంకాపానీ రోడ్డులో ఉన్న పాండవ్ నగర్ లో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో భాస్కరేశ్వర్, బ్రహ్మేశ్వర్ అనే మరో రెండు దేవాలయాలు ఉన్నాయి. ప్రాంగంణంలో ఉన్న ఒక శిలాఫలకాన్ని బట్టి, ఈ ఆలయాన్నీ, దానికి సమీపంలో ఉన్న చెరువునూ గాంగ వంశపు రాజైన రాజరాజు బావమరిది స్వప్నేశ్వరుడు నిర్మించినట్లు తెలుస్తోంది.[2] రాజరాజు తన అవసాన దశలో తన తమ్ముడు అనియకభీముడికి పట్టాభిషేకం చేసినట్లు కూడా ఈ శాసనంలో ఉంది. అంటే ఈ ఆలయాన్ని ఆ కాలంలో (సా.శ. 1192-95) నిర్మించి ఉండవచ్చు.[3] ప్రస్తుతం ఈ శిలాఫలకాన్ని అనంత వాసుదేవాలయం గోడకు అమరచారు.[4]

పాత పట్టణం, భువనేశ్వర్ లోని మేఘేశ్వర ఆలయం

ఈ ఆలయం లోని శివలింగం 2.74 మీటర్ల ఎత్తు ఉంటుంది.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Barik, Bibhuti (29 August 2011). "Water threat to historic temple". The Telegraph. Retrieved 11 January 2016.
  2. "Megheswar Temple". Times of India Travel. Archived from the original on 2020-08-13. Retrieved 2020-08-13.
  3. 3.0 3.1 Mishra, Banshipani. "TEMPLE BHASKARESWAR AND MEGHESWAR | Pratisruti Plus". ప్రతిస్తుతి ప్లస్ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-13. Retrieved 2020-08-13.
  4. "Megheswar Temple – Leap in the Odhisan Temple Architecture – Indian History and Architecture". పురాతత్వ.ఇన్ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-13. Retrieved 2020-08-13.