మేన మామ

మేనమామ 1988 లో విడుదల అయిన తెలుగు సినిమా.

మేనమామ 1988లో విడుదల అయిన తెలుగు సినిమా. శివ కృష్ణ మూవీస్ బ్యానర్ పై గోగినేని సాంబశివరావు నిర్మించిన ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి, రజని నటించారు. ఇది తమిళ "కన్నీ రాశి" సినిమాకి రీమేక్.

మేన మామ
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజశేఖర్ రెడ్డి
తారాగణం నందమూరి కళ్యాణ చక్రవర్తి
రజని
కె.ఆర్ విజయ
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ శివ కృష్ణ మూవీస్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

వేణు ఊరిలో అల్లరిగా తిరుగుతుంటాడు. ఈ విషయం తెలుసుకొని అతని అక్క అతన్ని హైదరాబాదు రమ్మని ఉత్తరం రాస్తుంది. అతను వచ్చాక అతని బావ, వేణుకి వాచ్మెన్ ఉద్యోగం ఇప్పిస్తాడు. వేణు తన అక్క కూతురితో ప్రేమలో పడతాడు. వేణు అక్క జాతకాలు కలవలేదని, తన కూతురు వేణుని చేసుకుంటే వేణు చనిపోతాడని తెలిసి పెళ్లి చేయకూడదని నిర్ణయించుకుంటుంది. వేణు, తన అక్క కూతురు ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది మిగతా కథ.

పాటలు

మార్చు
  • పల్లెటూర్లు లేకుంటే పట్టణాలు గోవిందా
  • ఆశ రేపే మల్లివే
  • మల్లెకన్నా తెల్లని నవ్వు

మూలాలు

మార్చు
  1. "Menamama". TVGuide.com. Retrieved 2022-05-13.
"https://te.wikipedia.org/w/index.php?title=మేన_మామ&oldid=4212334" నుండి వెలికితీశారు