మైకాలజీ
మైకాలజీ అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర విభాగం. ఇందులో శిలీంధ్రాల జన్యు, జీవ రసాయనిక లక్షణాలు, వర్గీకరణ, మానవాళికి వీటి వల్ల కలిగే ఉపయోగాలు, నష్టాలు మొదలైన వాటి గురించి పరిశోధనలు జరుగుతాయి.
కొన్ని హానికారకాలైన శిలీంధ్రాలను మినహాయిస్తే మిగతావన్నీ పాథోజెన్ల వల్ల మొక్కలకు కలిగే రోగాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు ట్రైకోడెర్మా జాతికి చెందిన శిలీంధ్రాలు పంటలకు వచ్చే వ్యాధులను నియంత్రించడంలో రసాయనిక మందుల కంటే ప్రభావవంతంగా పనిచేస్తాయి.[1]
మూలాలు
మార్చు- ↑ Ruano-Rosa, David; Prieto, Pilar; Rincón, Ana María; Gómez-Rodríguez, María Victoria; Valderrama, Raquel; Barroso, Juan Bautista; Mercado-Blanco, Jesús (2015-11-07). "Fate of Trichoderma harzianum in the olive rhizosphere: time course of the root colonization process and interaction with the fungal pathogen Verticillium dahliae". BioControl. 61 (3): 269–282. doi:10.1007/s10526-015-9706-z. ISSN 1386-6141.