మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ
మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. తెలివిగా సరియైన పదం ఎంపిక తొలిగా చూపుతుంది. [1]
చరిత్ర
మార్చుఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.[2] ఇది మైక్రోసాఫ్ట్ జాలసేవలలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో బుక్ మార్క్ లెట్ ద్వారా వాడుకొనే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతికం పనిచేయడం ఆగిపోయింది. [3]
ఇటీవలి విడుదల
మార్చుజూన్ 17, 2019 న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి భాగమైంది. [4] ఇది పాత విండోస్ వాడుకరులకు కూడా ఇండిక్ ఇన్పుట్ 3 పేరుతో లభిస్తుంది. [5]
ఇవీ చూడండి
మార్చువనరులు
మార్చు- ↑ "Microsoft Indic Language Input Tool". Archived from the original on 2018-11-05.
- ↑ "Microsoft Indic Language Input Tool (old)". Archived from the original on 2016-11-22. Retrieved 2012-09-16.
- ↑ Brian Donohue. "Bookmarklets are Dead…". Retrieved 2019-09-04.
- ↑ "Microsoft adds smart Phonetic Indic keyboards in 10 Indian languages for Windows 10". Archived from the original on 2019-09-04. Retrieved 2019-09-04.
- ↑ "Microsoft Indic Input 3 – Type in Indic Languages". Archived from the original on 2019-09-04. Retrieved 2019-09-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)