మై మస్రీ (జననం ఏప్రిల్ 2, 1959) యునైటెడ్ స్టేట్స్ లో చదువుకున్న పాలస్తీనా చిత్ర దర్శకురాలు. తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించింది.[1]

మై మస్రీ
Mai Masri photo.jpg
జననంమై మస్రీ
(1959-04-02) 1959 ఏప్రిల్ 2 (వయస్సు: 61  సంవత్సరాలు)
జోర్డాన్
జీవిత భాగస్వామిజీన్ చామౌన్

జననం - విద్యాభ్యాసంసవరించు

మై మస్రీ 1959, ఏప్రిల్ 2న జోర్డాన్ లో జన్మించింది.[2] ఈవిడ తండ్రి మునిబ్ మస్రీ నబ్లూస్ కు చెందినవాడు, తల్లి టెక్సాస్ కి చెందిన అమెరికన్. తన జీవితంలో ఎక్కువ కాలం బీరూట్ లోనే జీవించింది.

మై మస్రీ 1981లో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి పట్టభద్రురాలయింది. ఆ వెంటనే బీరూట్ కు వచ్చి చిత్రాలను తీయడం ప్రారంభించింది.[3]

వ్యక్తిగత జీవితంసవరించు

1982లో లెబనీస్ చిత్ర నిర్మాతైన జీన్ చామౌన్ ను మస్రీ కలుసుకుంది. వారిద్దరు కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. 1986 లో మస్రీ, జీన్ చామౌన్ ల వివాహం జరిగింది. వీరికి నూర్, హనా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నూర్, పర్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తిచేయగా... హనా న్యూయార్క్ లో నటి, దర్శకురాలిగా పనిచేస్తుంది.

చిత్రాల జాబితాసవరించు

మస్రీ తీసిన చిత్రాలలో పాలస్తీనా నేపథ్యం ఎక్కువగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా చిత్రోత్సవాలలో అవార్డులు కూడా గెలుచుకున్నాయి.

 1. అండర్ ది రూబుల్ (1983)
 2. వైల్డ్ ఫ్లవర్స్: ఉమెన్స్ అఫ్ సౌత్ లెబనాన్ (1986)
 3. వార్ జనరేషన్ (1989)
 4. చిల్డ్రన్స్ ఆఫ్ ఫైర్ (1990)
 5. సస్పెండెడ్ డ్రీమ్స్ (1992)
 6. హనన్ అశ్వ్రావి: ఎ వుమన్ అఫ్ హర్ టైం (1995)
 7. చిల్డ్రన్స్ ఆఫ్ షటిల (1998)
 8. ఫ్రాంటియర్స్ అఫ్ డ్రీమ్స్ అండ్ ఫియర్స్ (2001)
 9. బీరూట్ డైరీస్ (2006)
 10. 33 డేస్ (2007)
 11. 3000 నైట్స్ (2015)

మూలాలుసవరించు

 1. "Mai Masri". IMDb.
 2. Hillauer, Rebecca (2005). "Masri, Mai (1959–)". Encyclopedia of Arab Women Filmmakers. Cairo: American Univ. in Cairo Press. pp. 223–235. ISBN 977-424-943-7.
 3. http://www.facets.org/asticat?function=web&catname=facets&web=features&path=/directors/masrimai/interviewwithmasr. Retrieved 20 June 2017. Missing or empty |title= (help)[dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=మై_మస్రీ&oldid=2143627" నుండి వెలికితీశారు