మొగిలీశ్వరాలాయం

శివాలయాలు భారత దేశమంతటా విస్తరించి వున్నాయి. వివిధ నామాలతో ఆయా క్షేత్రలు వెలసి వున్నాయి. అలాంటి వాటిలో మొగిలీశ్వరాలయం ఒకటి. ఇది చిత్తూరు నుంచి 30 కి.మీటర్ల దూరంలో వున్నది.

క్షేత్రనామము

మార్చు

పూర్వం ఒక బోయ కుటుంబం మొగిలి వారి పల్లె లో నివాసముండేది. ఆ ప్రాంతంలో మొగిలి పొదలు ఎక్కువగా వుండడం తో ఆ పల్లెకు మొగిలివారి పల్లె అనే పేరు వచ్చింది. ఒక నాడు గర్బిణిగ వున్న ఆ బోయవనిత పనిమీద సమీపంలోని అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా ఆవిడకు పురుటి నెప్పులు రావడంతో అక్కడవున్న మొగిలి పొదల సమీపంలో ఆవిడ ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది. మొగలి పొదల సమీపాన పుట్టడంతో ఆ బాలునికి మొగిలప్ప అనే నామ కరణం చేసి పోషించ సాగారు. పెద్దవాడయిన మొగలప్ప ఒక రైతు వద్ద పశువుల కాపరిగా చేరాడు. అడవిలో పశువులను కాస్తూ వంట చెరకు కొరకు కట్టెలను కొట్టుకునేవాడు. అలా ఒక నాడు గొడ్డలితో ఒక చెట్టును నరుకుతుండగా రాయి తగిలిన శబ్దం రావడంతోఆశ్చర్య పడిన మొగిలప్ప గ్రామస్తుల సాయంతో పరిశీలించగా అక్కడ ఒక శివలింగం కనబడింది. అప్పటినుంచి ఆ శివలింగానికి మొగిలప్ప పూజలు చేయడం ప్రారంబించాడు. అలా అతిని పేరున ఆ క్షేత్రం మొగిలీశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది.

ప్రత్యేకతలు

మార్చు

మొగిలీశ్వరాలయానికి పడమర దిశలో మూడు కిలో మీటర్ల దూరంలో విబూతి కొండ వున్నది. తరతరాలుగా స్వామివారిని ఆవిభూతోనే అభిషేకించడం విశేషం. పూర్వం లోక కళ్యాణం కొరకు జమదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని నిర్వహించాడట ఆ యాగ సమిదల బస్మాన్ని ఒక రాసిగా పోయడం వల్ల ఆ కొండ ఏర్పడిందని స్థానికుల నమ్మకం. మరొక ప్రత్యేకత ఏమంటే? ఆలయ పైకప్పు మీద వున్న బంగారు బల్లి. ఇలాంటిది కంచి, శ్రీ కాళహస్తి లో మాత్రమే కనిపిస్తుంది. దాంతో బాటు చంద్రున్ని మింగటానికి వస్తున్న రాహువుని కూడ చూడవచ్చు. వీటిని తాకితే సర్ప దోషాలు పోతాయని భక్తుల విశ్వాసము.

ఎలా వెళ్లాలి

మార్చు

చిత్తూరు పట్టణానికి 30 కిలో మీటర్ల దూరంలో వున్నది. కాణిపాకం నుండి 28 కిలో మీటర్ల దూరంలో వున్నది. తిరుపతి - బెంగళూరు రహదారిలోవున్నది. ఈ క్షేత్రానికి రవాణా వాహనాలు కలవు.

మూలాలు

మార్చు

ఈనాడు ఆదివారం 2/ డిసెంబరు,2018