మొదటి నాగభట
మొదటి నాగభట (r. C.క్రీ.పూ 730-760) ఒక భారతీయ రాజు. ఆయన ప్రస్తుత మధ్యప్రదేశులోని అవంతి (లేదా మాళ్వా) ప్రాంతాన్ని తన రాజధాని ఉజ్జయిని నుండి పరిపాలించాడు. ప్రస్తుత గుజరాతు రాజస్థాను ప్రాంతాలున్న గుర్జారా దేశం మీద ఆయన తన నియంత్రణను విస్తరించాడు. అరబ్బు సైనికాధికారులు నేతృత్వంలో సింధు నుండి అరబ్బు దండయాత్రను ఆయన తిప్పికొట్టాడు. బహుశా జునైదు ఇబ్ను అబ్దులు-రహమాను అల్-ముర్రి లేదా అల్ హకం ఇబ్ను అవానా చేసిన దంశయాత్ర కావచ్చు. కానీ నాగభటను రాష్ట్రకూట రాజు దంతిదుర్గ ఓడించినట్లు తెలుస్తోంది.
మొదటి నాగభట | |
---|---|
Founder of Gurjara-Pratihara dynasty | |
పరిపాలన | సుమారు 730 – 760 |
ఉత్తరాధికారి | Kakustha |
రాజవంశం | Gurjara-Pratihara |
ఆరంభకాల జీవితం
మార్చునాగభటను ప్రతిహరా రాజవంశం స్థాపకుడుగా ఆయన వారసుడు మిహిరా భోజా గ్వాలియరు శాసనంలో పేర్కొన్నాడు.[1] నాగభట్ట పట్టాభిషేకం చేసిన తేదీ కచ్చితంగా తెలియదు.[2] ఆయన మనుమడు మేనల్లుడు వత్సరాజు సా.శ. 783-784లో అవంతిని రాజధానిగా చేసుకుని పాలించినట్లు తెలుస్తుంది. ప్రతి తరానికి 25 సంవత్సరాల వ్యవధిని ఊహిస్తే, నాగభట క్రీ.పూ. 730 లో సింహాసనాన్ని అధిరోహించినట్లు భావించవచ్చు. [1]
గ్వాలియరు శాసనం రాజవంశం మూలాన్ని పురాణ హీరో లక్ష్మణుడుగా గుర్తించింది.[3] నాగభట చారిత్రక పూర్వీకులు పూర్తిగా తెలియదు. కాని ఆయన అవంతి ప్రాంతంలోని ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. జైన పురాణాలు హరివంశ (సా.శ. 783-784) తన మనవడు మేనల్లుడు వత్సరాజ అవంతి భూ (అవంతి-భబ్రితి) పతి కుమారుడు అని పేర్కొన్నాయి.[4] రాష్ట్రాకూట పాలకుడు అమోఘవర్ష సా.శ. 871 సంజను రాగి ఫలకం శాసనం కూడా ఉజ్జయినితో గుర్జారా-ప్రతిహారాల అనుబంధాన్ని సూచిస్తుంది. [5] దీని ఆధారంగా ఆర్. సి. మజుందారు, బైజు నాథు పూరి వంటి అనేకమంది చరిత్రకారులు నాగభట రాజవంశం అసలు నివాసం అవంతి రాజధాని ఉజ్జయిని అని అభిప్రాయపడ్డారు. [6][5]
మరోవైపు దశరథ శర్మ నాగభట ప్రస్తుత రాజస్థానుకు చెందినవాడని సిద్ధాంతీకరించాడు. ఆయన సిద్ధాంతం నాహాదాను నాగభటగా గుర్తించడం మీద ఆధారపడింది. మధ్యయుగ జైన ప్రబంధ (పురాణ చరిత్ర) లో "అదృష్టవంతుడైన సైనికుడు" ఆయన కుటుంబానికి మొదటి పాలకుడు. నహాదా జబాలిపురాను (జలోరుగా గుర్తించారు) తన రాజధానిగా చేసుకున్నాడు. ఆయన ఓడించిన ముస్లిం పాలకుడితో కలహించాడని వచనం పేర్కొంది.[7] గుర్జారా-ప్రతిహారాలు అసలు నివాసం జలోరు అనే అభిప్రాయాన్ని శర్మ ముందుకు తెచ్చాడు. అక్కడ నుండి వారు వలస వచ్చి ఉండవచ్చు.[6]
సైనికవృత్తి
మార్చుఅరబు దండయాత్ర
మార్చుఆయన వారసుడు మిహిరా భోజుని గ్వాలియరు శాసనం ఆధారంగా నాగభట ఒక మ్లేచ్చ దండయాత్రను తిప్పికొట్టాడు. అరబ్బు ముస్లిం ఆక్రమణదారులను ఈ మ్లేచ్చులుగా గుర్తించారు. 9 వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు అల్-బలధూరి ఉజైను (ఉజ్జయిని) మీద అరబ్బు దండయాత్రలను సూచిస్తుంది; ఇది నాగభటతో వారి సంఘర్షణకు సూచనగా కనిపిస్తుంది.[8] ఈ దండయాత్రకు జునాయదు ఇబ్ను అబ్దులు-రహమాను అల్-ముర్రి లేదా ఉమయ్యద్ ఖలీఫు హిషాం ఇబ్ను అబ్దులు-మాలికు ఆధ్వర్యంలో సింధు సైనికాధికారి, రాజప్రధాని అల్ హకం ఇబ్ను అవానా నాయకత్వం వహించారు.[9][2] అల్-బలధూరి ఈ ఆక్రమణలో అనేక ఇతర ప్రదేశాలను జయించినట్లు ప్రస్తావించాడు. కాని ఉజ్జయిని గురించి నగరం ఆక్రమించబడిందని మాత్రమే పేర్కొన్నాడు. దాడి విజయవంతం కాలేదని భావించడానికి ఇది ఒక నిశ్శబ్ద అంగీకారం.[2]
పాక్షిక పురాణంలో గుహిలా పాలకుడు బప్పా రావలు కూడా అరబ్బు దండయాత్రను తిప్పికొట్టాడని పేర్కొన్నాయి. చరిత్రకారుడు ఆర్. వి. సోమానీ ఆయన నాగభటచే ఏర్పడిన అరబ్బు వ్యతిరేక సమాఖ్యలో ఒక భాగమని సిద్ధాంతీకరించాడు.[10]
రాష్ట్రకూటులదాడి
మార్చునాగభటను రాష్ట్రకూట పాలకుడు దంతిదుర్గ ఓడించినట్లు తెలుస్తోంది. రాష్ట్రకూట రికార్డుల ప్రకారం, దంతిదుర్గ చేతిలో ఓడిపోయిన రాజులలో మాళ్వా పాలకుడు కూడా ఉన్నాడు. దంతిదుర్గ వారసుడు అమోఘవర్ష సంజను శాసనం ఆధారంగా దంతిదుర్గ ఉజ్జయిని (నాగభట రాజధాని ఉజ్జయిని) వద్ద ఒక మతపరమైన వేడుకను నిర్వహించినట్లు పేర్కొంది. ఈ వేడుకలో గుర్జారా ప్రభువు (గుర్జరేష) దంతిదుర్గ ప్రతిహారా (ద్వారపాలకుడు) గా వ్యవహరించాడు.[11][12] ప్రతిహర అనే పదాన్ని వాడటం ఒక పద నాటకం అనిపిస్తుంది. ఆ సమయంలో అవంతిని పాలించే గుర్జారా-ప్రతిహర రాజును రాష్ట్రకూట రాజు లొంగదీసుకున్నాడు.[5]
నాగవలోక గుర్తింపు
మార్చుసా.శ. 756 హన్సోటు శాహమనా పాలకుడు భారత్వాధా శాసనం తన అధిపతి నాగవలోక పాలనలో ఒక గ్రామం మంజూరు చేసినట్లు నమోదు చేసింది. డి. ఆర్. భండార్కరు ఇతర చరిత్రకారులు నాగవోల్కాను నాగభటగా గుర్తించారు. ఈ ఊహ నిజమైతే రాష్ట్రకూటలు వెళ్ళిన తరువాత నాగభట తన శక్తిని తిరిగి పొంది భ్రిగుకాచా (భరూచు) చుట్టూ ఉన్న ప్రాంతాన్ని జయించాడు. అక్కడ ఒక చాహమన శాఖ నాగభట సామంతరాజ్యంగా పాలించింది. చరిత్రకారుడు బి. ఎన్. పూరి అభిప్రాయం ఆధారంగా నాగభట ఈ ప్రాంతాన్ని చాళుక్య భూస్వామ్య అవనిజనశ్రాయ పులకేశి నుండి జయించి ఉండవచ్చు.[8][11] అందువలన మాళ్వాతో నాగభట రాజ్యం ప్రస్తుత గుజరాతు, రాజస్థాను భాగాలు ఉండి ఉండవచ్చు.[13]
ఇతరాలు
మార్చుశైల రాజవంశం పాలకుడు జయవర్ధన రాఘోలి రాగి ఫలకం శాసనం తన పూర్వీకుడు పృథువర్ధన గుర్జారా పాలకుడిని ఓడించాడని పేర్కొంది. ఓడిపోయిన పాలకుడు నాగభట అయి ఉండవచ్చని ఆర్. సి. మజుందారు విశ్వసించాడు. ఏదేమైనా బి. ఎన్. పూరి ఈ సిద్ధాంతంతో విభేదిస్తున్నాడు. నాగభట ఆరోహణకు చాలా సంవత్సరాల ముందు పృథువర్ధన సా.శ. 694 లో పరిపాలించారని విశ్వసిస్తున్నారు.[14]
795 వ సంవత్సరంలో వత్సరాజు అధీనంలో ఉన్న గల్లక శాసనం మొదటి నాగభటను "అజేయమైన గుజరాల" మీద విజయం సాధించి కీర్తిని పొందిన వ్యక్తిగా భావిస్తుంది. అందువలన రాజవంశం గుర్జారా-ప్రతిహారలు అని పిలువబడుతున్నప్పటికీ రాజులు స్వయంగా గుర్జారా తెగకు చెందినవారే అనేది కచ్చితంగా తెలియదు.[15]
వారసులు
మార్చుసా.శ. 756 హన్సోటు శాసనంలో పేర్కొన్న నాగవలోక, నాగభట సుమారు సా.శ. 760 వరకు పరిపాలించినట్లు తెలుస్తుంది.[16] గ్వాలియరు శాసనం ఆయన తరువాత కాకుత్స, దేవరాజా, ఆయన పేరులేని సోదరుడి కుమారులు అని సూచిస్తుంది.[17]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Baij Nath Puri 1957, p. 36.
- ↑ 2.0 2.1 2.2 Vibhuti Bhushan Mishra 1966, p. 17.
- ↑ Vibhuti Bhushan Mishra 1966, p. 16.
- ↑ Baij Nath Puri 1957, p. 54.
- ↑ 5.0 5.1 5.2 Rama Shankar Tripathi 1959, p. 226-227.
- ↑ 6.0 6.1 Cynthia Packert Atherton 1997, p. 12.
- ↑ Sanjay Sharma 2006, p. 204.
- ↑ 8.0 8.1 Baij Nath Puri 1957, p. 37.
- ↑ Rama Shankar Tripathi (1959). History of Kanauj: To the Moslem Conquest. Motilal Banarsidass. ISBN 978-81-208-0478-4 మూస:Pn
- ↑ Ram Vallabh Somani 1976, p. 45.
- ↑ 11.0 11.1 Vibhuti Bhushan Mishra 1966, p. 18.
- ↑ Baij Nath Puri 1957, pp. 10–11.
- ↑ Sailendra Nath Sen 1999, p. 266.
- ↑ Baij Nath Puri 1957, p. 38.
- ↑ Shanta Rani Sharma 2012, p. 8.
- ↑ Baij Nath Puri 1957, pp. 55–58.
- ↑ Vibhuti Bhushan Mishra 1966, pp. 16–18.
- వనరులు
- Baij Nath Puri (1957). The History of the Gurjara-Pratiharas. Delhi: Munshiram Manoharlal. OCLC 2491084.
- Cynthia Packert Atherton (1997). The Sculpture of Early Medieval Rajasthan. BRILL. ISBN 9004107894.
- Dasharatha Sharma (1959). Early Chauhān Dynasties. S. Chand / Motilal Banarsidass. ISBN 978-0-8426-0618-9.
- Rama Shankar Tripathi (1959). History of Kanauj: To the Moslem Conquest. Motilal Banarsidass. ISBN 978-81-208-0478-4.
- Ram Vallabh Somani (1976). History of Mewar, from Earliest Times to 1751 A.D. Mateshwari. OCLC 2929852.
- Sailendra Nath Sen (1999). Ancient Indian History and Civilization. New Age International. ISBN 9788122411980.
- Sanjay Sharma (2006). "Negotiating Identity and Status Legitimation and Patronage under the Gurjara-Pratīhāras of Kanauj". Studies in History. 22 (22): 181–220. doi:10.1177/025764300602200202. S2CID 144128358.
- Shanta Rani Sharma (2012). "Exploding the Myth of the Gūjara Identity of the Imperial Pratihāras". Indian Historical Review. 39 (1): 1–10. doi:10.1177/0376983612449525. S2CID 145175448.
- Vibhuti Bhushan Mishra (1966). The Gurjara-Pratīhāras and Their Times. S. Chand. OCLC 3948567.