మొహమ్మద్ షరీఫ్
మొహమ్మద్ షరీఫ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సైకిల్ మెకానిక్, సామజిక సేవకుడు. ఆయన 2020 నాటికి 27 ఏళ్లలో 25 వేల అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించాడు. మొహమ్మద్ షరీఫ్ నిస్వార్థ సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[1] మొహమ్మద్ షరీఫ్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 2021 నవంబరు 8న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]
మొహమ్మద్ షరీఫ్ | |
---|---|
జననం | అయోధ్య , ఉత్తరప్రదేశ్, భారతదేశం |
ఇతర పేర్లు | షరీఫ్ చాచా |
వృత్తి | సైకిల్ మెకానిక్, సామజిక సేవకుడు |
పురస్కారాలు | పద్మశ్రీ (2020) |
జీవితాన్ని మార్చిన సంఘటన
మార్చుమొహమ్మద్ షరీఫ్ 1992లో పెద్ద కుమారుడు మహమ్మద్ రైస్ ఖాన్ సుల్తాన్‌పూర్‌కు వెళుతుండగా హత్యకు గురయ్యాడు. షరీఫ్ కుమారుడి శరీరం రోడ్డుపై పడి ఉండటంతో, దానిని విచ్చలవిడి జంతువులు మ్రింగివేసాయి. అయితే నెల రోజుల తరువాత తన కొడుకు మరణం గురించి తెలుసుకొని అప్పటి నుండి, షరీఫ్ అనాథ శవాలను దహనం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అయన ఫైజాబాద్ పరిసరాల్లో 25 వేలకు పైగా అనాథ శవాలకు దహన సంస్కారాలను మతం ఆధారంగా ఎలాంటి వ్యత్యాసాలు చూపించకుండా మరణించిన వ్యక్తి యొక్క మతపరమైన పద్ధతులను పాటిస్తూ దహన సంస్కారాలను నిర్వహిస్తాడు.[3]
మూలాలు
మార్చు- ↑ 10TV (25 January 2020). "రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన కేంద్రం" (in telugu). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ DNA India (9 November 2021). "Meet Padma Shri Mohammad Sharif, who performed last rites for 25000 unclaimed dead bodies" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
- ↑ TV9 Telugu (27 January 2020). "ఆ సైకిల్ మెకానిక్‌కు పద్మశ్రీ.. ఎందుకంటే..?". Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)