మోగుబాయి కుర్దికర్
గాన తపస్విని మోగుబాయి కుర్దికర్ (జులై 15, 1904 – 2001 ఫిబ్రవరి 10) ప్రముఖ హిందుస్థానీ సంప్రదాయ సంగీత కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలోని జైపూర్-అత్రౌలీ ఘరానా సంప్రదాయానికి చెందిన గాయకురాలు ఆమె.[1]
మోగుబాయి కుర్దికర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | మోగుబాయి కుర్దికర్ |
జననం | జులై 15, 1904 |
మూలం | కుర్దీ, గోవా |
మరణం | ఫిబ్రవరి 10, 2001 |
సంగీత శైలి | హిందుస్థానీ సంగీతము - ఖయల్ |
వృత్తి | హిందుస్థానీ సంప్రదాయ సంగీత కళాకారిణి |
తొలినాళ్ళ జీవితం, నేపధ్యం
మార్చుపోర్చ్యుగీస్ పాలనలోని గోవాలో కుర్దీ గ్రామంలో గోవన్ మరాఠా కుటుంబంలో జన్మించింది మోగుబాయి.[2] 1913లో, ఆమెకు తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు, ఆమె తల్లి జయశ్రీబాయి జంబౌలింలోని ఒక గుడిలో ఉండే పూజారి దగ్గర సంగీతం నేర్చుకునేందుకు చేర్చింది. ఆ తరువాత మోగుబాయిని చంద్రేశ్వర్ భూతనాథ్ సంగీత మండలీ అనే ట్రావెలింగ్ నాటక కంపెనీలో చేర్చింది ఆమె తల్లి. ఆ కంపెనీలో మోగుబాయి నటిగా పనిచేసింది.
ఆమె ఆ నాటక మండలిలో పనిచేసేటప్పుడు, 1914లో మోగు తల్లి మరణించింది.[3] కొందరి ప్రకారం[1] ఆమె తల్లి మరణశయ్యపై ఉన్నప్పుడు, మోగు ప్రముఖ గాయకురాలు కావాలని కోరిందనీ, అదే ఆమె తల్లి చివరి కోరిక. ఆ తరువాత కొన్నాళ్ళకే ఆ నాటక సమాజం దివాళా తీయడంతో, దానికి ప్రత్యర్థి అయిన సతర్కర్ స్ట్రీ సంగీత మండలి మోగును నటిగా తీసుకుంది.