మోమిన్‌పేట్ మండలం

తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం
(మోమిన్‌పేట్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)

మోమిన్‌పేట్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని మండలం.[1] మోమిన్‌పేట్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు

మోమిన్‌పేట్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°31′11″N 77°53′49″E / 17.519654°N 77.896957°E / 17.519654; 77.896957
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం మొమిన్‌పేట్
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 43,261
 - పురుషులు 21,651
 - స్త్రీలు 21,610
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.13%
 - పురుషులు 64.42%
 - స్త్రీలు 37.52%
పిన్‌కోడ్ 501202

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 43,261 - పురుషులు 21,651 - స్త్రీలు 21,610. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 185 చ.కి.మీ. కాగా, జనాభా 43,261. జనాభాలో పురుషులు 21,651 కాగా, స్త్రీల సంఖ్య 21,610. మండలంలో 9,598 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

మార్చు

ఈ మండలానికి నవాబ్ పేట మండలం దక్షిణాన, సదాశివపేట మండలం ఉత్తరాన, మర్పల్లి మండలం పడమరన, శంకర్‌పల్లి మండలం తూర్పు వైపున ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు