ప్రాజెక్ట్ - 15బి లో స్వదేశంలో తయారుచేసిన విశాఖపట్నం తరగతి స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసకర యుద్ధనౌక ' ఐఎన్ఎస్ మోర్ముగావ్ ' ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 2022 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన నూక దళంలో ప్రవేశపెట్టారు.[1] ప్రాజెక్ట్ - 15బిలో భాగంగా రూపొందించిన రెండవ నౌక మోర్ముగావ్.[2]

మోర్ముగావ్ యుద్ధనౌక ప్రత్యేకతలు :

మార్చు

. గోవాలోని చారిత్రాత్మక వాడరేవు నగరమైన మోర్ము గావ్ పేరిట నామకరణం చేశారు.

. ఈ యుద్ధనౌక ఒక పొడవు 163 మీటర్లు కాగా, వెడల్పు 17 మీటర్లు. బరువు 7400 టన్నులు. నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే మోర్ము గావ్ గంటకు 30 నాటికల్ ( గంటకు 55.56 కిలోమీటర్లు) పైగా వేగాన్ని అందుకోగలదు.[3]

. భారత నౌకాదళం ' వార్ షిప్ డిజైన్ బ్యూరో ' దీనిని డిజైన్ చేయగా ముజుగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. ఆత్మ నిర్భార్ భారత్ లో భాగంగా చేపట్టిన ఈ నౌక నిర్మాణంలో 75% దేశీయ ఉత్పత్తులనే వాడారు. ఈ నౌకను స్వదేశీ ఉక్కు డి ఎం ఆర్ 249ఏ ఉపయోగించి తయారు చేశారు.[4]

. ఐఎన్ఎస్ మోర్ము గావ్ లో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. అత్యాధునిక నిఘా రాడార్ వ్యవస్థ ఆయుధ వ్యవస్థలకు లక్ష్యాల డేటాను అందించగలదు. ఎలాంటి సమయంలోనైనా దీన్ని ఆపరేట్ చేసేలా నిర్మించారు.[5]

. దీనిలో బ్రహ్మోస్ క్షిపణిలు, దేశీయ టర్పోటో ట్యూబ్ లాంచర్లు, యాంటీ ఎయిర్, యాంటీ సబ్ మెరైన్ రాకెట్ లాంచర్లు ఉన్నాయి.

. అణు, జీవ, రసాయన, యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు.

  1. ABN (2022-12-18). "Indian Navy: భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మోర్ముగావ్". Andhrajyothy Telugu News. Retrieved 2023-09-06.
  2. Shanker (2022-12-18). "నౌకాదళం లోకి ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ ప్రవేశం". Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. "నేవీ అమ్ములపొదిలో ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-06.
  4. "భారత అమ్ములపొదిలో కొత్త అస్త్రం.. సముద్రంలో డ్రాగన్​కు ఇక చెక్!". ETV Bharat News. Retrieved 2023-09-06. {{cite web}}: zero width space character in |title= at position 52 (help)
  5. "INS Mormugao నౌకదళంలోకి మరో శక్తివంతమైన ఆయుధం.. నౌక ప్రత్యేకలివే". Samayam Telugu. Retrieved 2023-09-06.