మోహన్ కిషోర్ నామదాస్

స్వాతంత్ర సమరయోధుడు

మోహన్ కిషోర్ నామదాస్ భారతీయ విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.[1] [2] [3]

అతను కోల్‌కతకు చెందిన అనుశీలన్ సమితిలో చురుకైన సభ్యుడు. నెట్రోకోనా సోరికాండ రాజకీయ కార్యాచరణ కేసులో సభ్యత్వం కారణంగా అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించి అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు తరిలించారు. మోహిత్ మొయిత్రా (ఆయుధాల చట్టం కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు), మహావీర్ సింగ్ (రెండవ లాహోర్ కుట్ర కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు) మరో 30 మందితో పాటు ఖైదీలపట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు నిరసనగా అతను 1933 నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. క్రూరమైన బలప్రయోగ ప్రక్రియ కారణంగా అతను 26 మే 1933 న మరణించాడు. మోహిత్ మొయిత్రా, మహావీర్ సింగ్ కూడా నిరాహార దీక్ష సమయంలో మరణించారు.[1] [2] [3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Murthy, R. V. R. (2011). Andaman and Nicobar Islands: A Saga of Freedom Struggle. Kalpaz Publications. ISBN 978-8178359038.Murthy, R. V. R. (2011). Andaman and Nicobar Islands: A Saga of Freedom Struggle. Kalpaz Publications. ISBN 978-8178359038. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 Sinha, Srirajyam (1993). Bejoy Kumar Sinha: A Revolutionary’s Quest for Sacrifice. Bharatiya Vidya Bhavan.Sinha, Srirajyam (1993). Bejoy Kumar Sinha: A Revolutionary’s Quest for Sacrifice. Bharatiya Vidya Bhavan. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 Sengupta, Subodh; Basu, Anjali (2002). Sansad Bangali Charitavidhan (Bengali). Kolkata: Sahitya Sansad. p. 586. ISBN 81-85626-65-0.Sengupta, Subodh; Basu, Anjali (2002). Sansad Bangali Charitavidhan (Bengali). Kolkata: Sahitya Sansad. p. 586. ISBN 81-85626-65-0. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు