యాంత్రిక శాస్త్రం
యాంత్రిక శాస్త్రం అనేది ఏదైనా భౌతిక పదార్థాల మీద బలం ప్రయోగించినపుడు లేదా వాటికి స్థాన చలనం కలిగించినపుడు వాటి లక్షణాలను వివరించే శాస్త్రం. అలాంటి చలనానికి లోనైన వస్తువులు వాటి పరిసరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఈ శాస్త్రం యొక్క మూలాలు ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైన అరిస్టాటిల్, ఆర్కిమెడిస్ రచనల్లో ఉన్నాయి.[1][2][3] ఆధునిక యుగం ప్రారంభంలో ఒమర్ ఖయ్యాం, గెలీలియో, కెప్లర్, న్యూటన్ లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఇప్పుడు సాంప్రదాయ యాంత్రికశాస్త్రంగా పిలువబడుతున్న శాస్త్రానికి పునాది వేశారు. ఇది సాంప్రదాయ భౌతికశాస్త్రంలో ఒక భాగం. ఇందులో స్థిరంగా ఉండే అణువులు, లేదా కాంతి వేగం కన్నా బాగా తక్కువ వేగంతో కదులుతూ ఉన్న అణువుల గురించి వివరణ ఉంటుంది.
సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం, క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం
మార్చుయాంత్రిక శాస్త్రాన్నే సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం, క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం అని రెండు భాగాలుగా విభజించవచ్చు. సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం ప్రాచీనమైనది. దీనికి ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ రాసిన ప్రిన్సిపియా మేథమేటికా అనే పుస్తకంలో ప్రస్తావించిన మూడు సూత్రాలు పునాది. క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం ఇరవయ్యో శతాబ్దం మొదటి భాగంలో అభివృద్ధి చేయబడింది. ఈ రెండు శాస్త్రాలు కలిసికట్టుగా ప్రస్తుత భౌతిక ప్రపంచాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తున్నాయి.
మూలాలు
మార్చు- ↑ Dugas, Rene. A History of Classical Mechanics. New York, NY: Dover Publications Inc, 1988, pg 19.
- ↑ Rana, N.C., and Joag, P.S. Classical Mechanics. West Petal Nagar, New Delhi. Tata McGraw-Hill, 1991, pg 6.
- ↑ Renn, J., Damerow, P., and McLaughlin, P. Aristotle, Archimedes, Euclid, and the Origin of Mechanics: The Perspective of Historical Epistemology. Berlin: Max Planck Institute for the History of Science, 2010, pg 1-2.