శాస్త్రీయ పరిశోధన

మార్చు

సాధారణంగా ఒక పరికల్పన (hypothesis)ను ఒక ప్రయోగం (experiment) యొక్క ఫలితాన్ని పరిశీలించడం ద్వారా నిరూపిస్తారు. ఫలితం పరికల్పనకు సానుకూలంగా లేనట్లయితే, అప్పుడు ఆ పరికల్పనను నిరాకరిస్తారు. అయితే, ఫలితం పరికల్పనకు సానుకూలంగా ఉన్నట్లయితే, ప్రయోగం పరికల్పనకు మద్దతు ఇస్తుందని పేర్కొంటారు. ఒక ఉపయోగకర పరికల్పన భావి కథనాలను అనుమతిస్తుంది, సమయ పరిశీలన యొక్క కచ్చితత్వంలో, భావి కథనం ధ్రువీకరించబడుతుంది. పరిశీలన యొక్క కచ్చితత్వం కాలానుగుణంగా మెరుగుపడుతున్నప్పుడు, పరికల్పన ఒక కచ్చితమైన భావి కథనాన్ని అందించలేకపోవచ్చు. ఈ సందర్భంలో, పాత పరికల్పనను సవాలు చేస్తూ ఒక కొత్త పరికల్పన ఉద్భవిస్తుంది, కొంతవరకు కొత్త పరికల్పన, పాత పరికల్పన కంటే మరింత కచ్చితమైన భావి కథనాలను అందిస్తుంది, నూతన పరికల్పన పాత దానిని భర్తీ చేస్తుంది.

సాధారణంగా, పరిశోధన అనేది ఒక నిర్దిష్ట వ్యవస్థీకృత విధానాన్ని అనుసరిస్తుందని చెప్పవచ్చు. దశల క్రమం మారినప్పటికీ, కింది దశలు పరిశోధనలో భాగంగా ఉంటాయి:

  1. అంశం యొక్క పరిశీలనలు, నిర్మాణం
  2. పరికల్పన
  3. సంభావిత వివరణలు
  4. కార్యాచరణ వివరణ
  5. సమాచారాన్ని సేకరించడం
  6. సమాచార విశ్లేషణ
  7. పరీక్ష, పరికల్పన సవరణ (యత్న దోష పద్ధతి)
  8. నిర్ధారణ, అవసరమైతే పునరుక్తి

ట్రయల్ అండ్ ఎరర్

మార్చు

ట్రయల్ అండ్ ఎరర్ అనేది ఒక సమస్యా పరిష్కార పద్ధతి. ఒక సమస్యని పదే పదే పరిపరి విధాలుగా పరిష్కరించి ఫలితం ఆశాజనకంగా ఉందో లేదో చూడడమే ఈ పద్ధతిలోని మూల రహశ్యం. దీనిని నేతి నేతి పద్ధతి; నేతి నేతి మార్గం; ప్రయత్న వైఫల్య పద్ధతి; అవక్షేప పద్ధతి, యత్న-దోష పద్ధతి అని రకరకాల పేర్లతో తెలుగులో పిలుస్తున్నారు. "నేతి" అంటే "ఇది కాదు" అని అర్థం కనుక "నేతి నేతి పద్ధతి" అంటే "ఇది కాదు, ఇది కాదు" అనుకుంటూ తిరిగి తిరిగి మరొక ప్రయత్నం చెయ్యడం. కంప్యూటర్ రంగంలో వాడుకలో ఉన్న generate and test పద్ధతి ఈ కోవకి చెందినదే!

పైపైకి ఇది ఏదో ఆషామాషీ పద్ధతిగా కనిపించినా సమస్యా పరిష్కార పద్దతులలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పరిశోధన చేసేటప్పుడు ఎదురైన సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో తోచనప్పుడు, ఏదో ఒక బాట వెంబడి వెళ్ళాలి కదా. అలా వెళ్ళినప్పుడు సమస్యకి పరిష్కారం దొరక్కపోయినా ఎంపిక చేసుకున్న మార్గానికి భిన్నంగా మరొక మార్గం మనస్సుకి తట్టవచ్చు కదా. అదీ ఈ పద్ధతిలో కీలకమైన అంశంk.

ఉదాహరణ

మార్చు

5x + 2 = 17 అనే సమీకరణాన్ని పరిష్కరించడానికి యత్న దోష పద్ధతి ఉపయోగిద్దాం. మొదటి ప్రయత్నంగా x = 1 నప్పుతుందేమో చూద్దాం. ఇప్పుడు 5x + 2 = 7 అయింది. అనగా దోషం విలువ 17 - 7 = 10. ఇప్పుడు x విలువ మరికొంచెం పెంచి x = 2 అనుకుని లెక్క తిరిగి చేస్తే 5x + 2 = 12 వచ్చింది. అనగా, దోషం విలువ 17 - 12 = 5. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే x విలువ పెరిగినప్పుడు దోషం విలువ తరిగింది. ఇప్పుడు x విలువ మరికొంచెం పెంచి x = 3 అనుకుని లెక్క తిరిగి చేస్తే 5x + 2 = 17 వచ్చింది. సరిపోయింది కదా. కనుక ఈ సమీకరణాన్ని పరిష్కరించగా వచ్చిన సమాధానం x = 3.

ముఖ్య లక్షణాలు

మార్చు

ఈ పద్ధతికి ఉన్న లక్షణాలు:

  • ఈ పద్ధతి ప్రకారం ఒక సమస్యకి పరిష్కారం దొరికితే దొరకొచ్చు గాక. కాని మనం ఏమి చెయ్యడం వల్ల మనకి పరిష్కారం దొరికిందో అవగాహనకలోకి రాదు.
  • ఈ పద్ధతి ప్రకారం ఒక సమస్యకి పరిష్కారం దొరికింది కదా అని ఇదే మార్గంలో పయనించినా ఇదే జాతి ఇతర సమస్యలకి పరిష్కారం దొరకాలని లేదు.
  • ఈ పద్ధతి ప్రకారం ఒక సమస్యకి పరిష్కారం దొరికినా ఈ మార్గం అత్యుత్తమమైన (optimal) మార్గం అని చెప్పడానికి వీలు లేదు.
  • ఈ పద్ధతి ఉపయీగించడానికి ప్రాదేశిక జ్ఞానం (domain knowledge) అవసరం లేదు.


మూలాలు

మార్చు

[1] [2] [3]

  1. Harland, D.P. & Jackson, R.R. (2000). ""Eight-legged cats" and how they see - a review of recent research on jumping spiders (Araneae: Salticidae)" (PDF). Cimbebasia. 16: 231–240. Archived from the original (PDF) on 28 September 2006. Retrieved 5 May 2011.
  2. Jackson, Robert R.; Fiona R. Cross; Chris M. Carter (2006). "Geographic Variation in a Spider's Ability to Solve a Confinement Problem by Trial and Error". International Journal of Comparative Psychology. 19 (3): 282–296. doi:10.46867/IJCP.2006.19.03.06. Retrieved 8 June 2011.
  3. Jackson, Robert R.; Chris M. Carter; Michael S. Tarsitano (2001). "Trial-and-error solving of a confinement problem by a jumping spider, Portia fimbriata". Behaviour. 138 (10). Leiden: Koninklijke Brill: 1215–1234. doi:10.1163/15685390152822184. ISSN 0005-7959. JSTOR 4535886.