యనమదల మురళీకృష్ణ

యనమదల మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వైద్యుడు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు[1] ఎయిడ్స్ నివారణ, చికిత్సలో ప్రముఖ వ్యక్తి.[2] ఆయన భారతీయ సమాజంలో ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి కృషి చేశారు. ఆయన అసోసియేషన్ ఆఫ్ పీపుల్ ఎగెనెస్ట్ ఎయిడ్స్ (APAA) వ్యవస్థాపక అధ్యక్షుడు.

వృత్తి మార్చు

మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రామచంద్రపురంలో జన్మించాడు. రంగరాయ మెడికల్ కాలేజి నుండి MBBS వైద్యశాస్త్రంలో 1994 లో పట్టభద్రులు అయ్యారు. తన ఎం.డి. పరిశోధనా సిద్ధాంతానికి గాను హెచ్ఐవి సోకిన వారిలో క్షయవ్యాధిని గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.[3] ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్స్ నుండి 2000 మేలో ఎం.డి. మైక్రోబయాలజీ పూర్తిచేసాడు. 2005 జూలై 4 ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో ఎయిడ్స్ ప్రచార కార్యక్రమం “ఆశ” ప్రారంభంలో పాల్గొన్నారు . వందలాది ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 2000 సంవత్సరంలో డర్బన్, దక్షిణ ఆఫ్రికాలో జరిగిన 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుండి తొలి ఏకైక పరిశోధనా సారాంశం సమర్పించారు. హెచ్ఐవి క్షయ వ్యాధిగ్రస్తులలో వ్యాధి తీవ్రత అంచనాకు చౌకైన విధానం ప్రతిపాదించారు. ఎయిడ్స్ చికిత్సలో ప్రామాణికంగా ఉన్న మూడు ఔషధాల కాంబినేషన్ స్థానంలో రెండు ఔషధాలనే తొలినుండి డాక్టర్ మురళీకృష్ణ ఉపయోగిస్తున్నారు. 2004 సంవత్సరంలో టులోన్, ఫ్రాన్స్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు 'రెండు ఔషధాల కాంబినేషన్ చికిత్స' పరిశోధన సారాంశాన్ని సమర్పించారు. హెచ్ఐవి రోగులలో క్షయ వ్యాధి బారిన పడిన వారికి వ్యాధి తీవ్రత అంచనాకు ఖరీదైన పరీక్షల స్థానంలో చౌకగా దొరికే 'మాంటూ' (ట్యుబర్‌ క్యులిన్‌) పరీక్షను ఉపయోగించొచ్చునని డాక్టర్‌ మురళీకృష్ణ ప్రతిపాదించారు.[3] తేలికపాటి కోవిడ్‌కు మూడు ఔషధాలతో ఇంటి వైద్యం (హోమ్‌కేర్‌) విధానంపై ప్రచారం చేశారు. ఏస్పిరిన్‌ - ప్రెడ్నిసొలోన్‌ - ఎజిత్రోమైసిన్‌ లతో హోమ్‌ కేర్‌ కిట్టు తయారుచేశారు.[4] బ్రాండ్స్‌ ఇంపాక్ట్‌ సంస్థ హెల్త్‌ కేర్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల లలో భాగంగా ఆరోగ్యరంగ ప్రతిభా పురస్కారం-2023ను అందుకున్నారు.[1]

రచనలు మార్చు

డాక్టర్‌ యనమదల మురళీకష్ణ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చికిత్సలో ప్రముఖ పరిశోధకుడు, 2000లో మొదటిసారి ఆయన ప్రచురించిన 'ఎయిడ్స్‌' పుస్తకం గొప్ప జనాదరణ పొందింది. కోవిడ్ –ఎయిడ్స్ –నేను అనే సెమి ఆటో భయాగ్రాఫిక్ పుస్త్కకం రాసారు.[5][6] హెచ్‌ఐవిపై వివిధ పత్రికల్లో 40 వరకు పరిశోధనాత్మక వ్యాసాల, సామాజిక మాధ్యమాల ద్వారా మురళీకృష్ణ ప్రజల్లో అవగాహన కల్పనకు కృషిచేశారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "డాక్టర్‌ యనమదలకు జీవన సాఫల్య పురస్కారం". Sakshi. 2023-09-25. Retrieved 2023-11-21.
  2. "రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్‌ఐవీ ఫిజీషియన్‌ ఆయన!". Sakshi. 2023-10-21. Retrieved 2023-11-21.
  3. 3.0 3.1 "గడ్డు రోగాలకు చవకైన వైద్యం". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-11-21. Retrieved 2023-11-21.
  4. R, M. S. (2022-01-24). "ధైర్యం చెప్పేవాళ్లే కాదు... మంచి వైద్యసలహాలు కావాలిప్పుడు... ఇది అదే..." Muchata.com Latest Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-21.
  5. gdurgaprasad (2022-05-10). "అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –కోవిడ్ –ఎయిడ్స్ –నేను ". సరసభారతి ఉయ్యూరు (in ఇంగ్లీష్). Retrieved 2023-11-21.
  6. Comments, రచన: చలపాక ప్రకాష్ ఇతర రచనలు on: No (2022-12-04). "విపులమైన సమాచారంతో 'కోవిడ్-ఎయిడ్స్-నేను'". సంచిక - తెలుగు సాహిత్య వేదిక (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-21.