యమేశ్వరాలయం
యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.
యమేశ్వరాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఒడిషా |
ప్రదేశం: | భువనేశ్వర్ |
అక్షాంశ రేఖాంశాలు: | 20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E |
ఇతిహాసం | |
సృష్టికర్త: | తూర్పు గాంగులు |
నిర్మాణం
మార్చుఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తూర్పు గంగ రాజవంశీకుల చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది.[1] ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.[1] ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.[1] గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబ[1]
పర్వదినాలు
మార్చుఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, సంక్రమణపు రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.
ఇవికూడా చూడండి
మార్చుచిత్రావళి
మార్చు-
యమేశ్వరాలయం
-
నంది
-
గణపతి విగ్రహం
-
నాట్యమండపం
-
లింగం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-12. Retrieved 2017-10-12.