యలమర్తి అనూరాధ తెలుగు కథా రచయిత్రి,కవయిత్రి[1][2]. ఆమె పెద్దల కథలతో పాటు బాలసాహిత్యంలో కూడా కృషి చేస్తున్నారు. బాలల కోసం ‘పసిమొగ్గలు’ (బాలల కథలు) ప్రచురించింది[3]. ఆమె 250కి పైగా కథలు, 500కు పైగా కవితలు , 500కు పైగా వ్యాసాలు రాసింది. నాలుగు నవలలు రచించింది. [4] ఆంధ్రభూమి దినపత్రికలో ఆమె నవల 'విలువల లోగిలి' ప్రచురితమైంది. ఇంతకుముందు పచ్చబొట్టు' సీరియల్ అందులోనే వచ్చింది.

పుస్తకాలు[4]

మార్చు
  • ప్రేమ వసంతం- నవల,
  • గుప్పెడు మనసు - కథలు[5]
  • ప్రేమ వసంతం[6]
  • సంసారంలో సరిగమలు (వ్యాసాలు),
  • వెజిటేరియన్ వంటకాలు,
  • చిట్కాల పుస్తకం,
  • విక్టరీ వారి పెద్ద బాలశిక్ష లో మహిళా పేజీలు 100.

పురస్కారాలు

మార్చు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సాహితీ వేత్త అవార్డు స్వీకరించారు. గుర్రం జాషువా, కొనకళ్ళ, వాకాటి పాండురంగారావు, పోతుకూచి సాంబశివరావు, సోమేశ్వర సాహితీ అవార్డుల లాంటివి 50కి పైగా అవార్డులు అందుకున్నారు.

మూలాలు

మార్చు
  1. పత్రిక, విహంగ మహిళా. "ఆశా దీపం(కవిత)-యలమర్తి అనూరాధ |" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2024-05-28. Retrieved 2024-10-31.
  2. "యలమర్తి అనూరాధ - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-31.
  3. SARMA, SM CHANDRAA SEKAR (2023-12-18). "Children literature: బాలసాహిత్య గ్రంథాలకు పెద్దపీట". Telugu Prabha Telugu Daily (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-10-31.
  4. 4.0 4.1 "యలమర్తి అనూరాధ | సంచిక - తెలుగు సాహిత్య వేదిక". sanchika.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-31.
  5. "గుప్పెడు స్నేహం - అచ్చంగా తెలుగు". www.acchamgatelugu.com. Retrieved 2024-10-31.
  6. "Prema Vasantham". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-31.