యాదా కృష్ణ తెలుగు సినీ నటుడు. ఈయన ఎక్కువగా బీ గ్రేడ్ సినిమాలలో నటించాడు.

యాదా కృష్ణ

సినీ జీవితం

మార్చు

జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) లో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన యాదా కృష్ణ, లో బడ్జెట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత తన సినిమాలకు తానే నిర్మాతగా మారాడు. అలా నిర్మించిన సినిమాలలో తానే కథానాయకుడిగా నటించాడు. అయితే ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో ఆర్థికపరమైన ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నాడు. అలాగే పలు టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. [1] యాదాకృష్ణకు భార్య రమాదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలంగాణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యాదా కృష్ణ ఆరోగ్య సమస్యలతో నిజాంపేట్‌లోని ఓ ఆసుపత్రిలో మే 2020 నెలలో మరణించాడు. [2]

సినిమాలు

మార్చు
  • గుప్త శాస్త్రం
  • వయసు కోరిక
  • పిక్నిక్
  • ఇరుకింట్లో ఇద్దరు పెళ్లాలు
  • సంక్రాంతి అల్లుడు
  • గూఢచారి 786

మూలాలు

మార్చు
  1. "జీ న్యూస్ వెబ్ సైటులో యాదా కృష్ణ సమాచారం".
  2. "ఈనాడు పత్రికలో నటుడి సమాచారం".