యామినీ రెడ్డి

భారతీయ కూచిపూడి నర్తకి

యామిని రెడ్డి (జననం 1982 సెప్టెంబరు 1) కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు, కొరియోగ్రాఫర్. కూచిపూడి బోధనకు అంకితమైన పాఠశాల న్యూఢిల్లీలోని నాట్య తరంగిణికి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తోంది.[1] ఆమె భారతదేశంలోనే కాక విదేశాలలో విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చింది.

యామినీ రెడ్డి
ఢిల్లీలోని సంగీత నాటక అకాడమీలో యామినీ రెడ్డి ప్రదర్శన
జననం (1982-09-01) 1982 సెప్టెంబరు 1 (వయసు 41)
న్యూఢిల్లీ
భార్య / భర్తశ్రీనివాస్
జాతీయతఇండియన్
రంగంభారతీయ శాస్త్రీయ నృత్యం
ఉద్యమంకూచిపూడి
వెబ్‌సైటుhttp://www.yaminireddy.com

జీవితం తొలి దశలో మార్చు

కూచిపూడి విద్వాంసులు డాక్టర్ రాజా, రాధా రెడ్డిలకు జన్మించిన ఆమె చిన్న వయస్సులోనే నృత్యంలోకి ప్రవేశించింది. మూడు సంవత్సరాల వయస్సు నుంచే ఆమె తల్లిదండ్రుల వద్ద కూచిపూడి కళారూపంలో శిక్షణ పొందడమే కాక తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ ప్రదర్శనల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూనే ఆమె న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ నుండి కామర్స్ (ఆనర్స్)లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. ఆ తరువాత ఫోర్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాపుచ్చుకుంది.

కెరీర్ మార్చు

యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, యుఎఇ, ఆగ్నేయాసియాలో యామినీ రెడ్డి విస్తృతంగా పర్యటించింది. 2011లో లండన్‌లోని ప్రతిష్టాత్మక విగ్‌మోర్ హాల్‌లో ఆమె ప్రదర్శన ఇచ్చింది. రష్యా, తూర్పు యూరప్‌లలో కూడా పర్యటించింది. అక్కడ 2009లో జరిగిన బ్రిక్ అండ్ స్కో సమ్మిట్‌(BRIC and SCO summit)లో వివిధ దేశాధినేతల సమక్షంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఆమెకు లభించింది. ఇందులో పాల్గొన్న భారత మాజీ రాష్ట్రపతి డా.ఎ.పి.జె అబ్దుల్ కలాం యామినీ రెడ్డిని ప్రశంసించాడు.

న్యూయార్క్‌కు చెందిన ఆధునిక నర్తకి లియా కర్టిస్‌తో కలిసి ఆమె నిర్మించిన 'హార్మొనీ' మంచి ఆదరణ పొందింది. కేరళలోని నిశాగంధి ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చింది. ఆమె భారతదేశంలోని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోసం 'ఆడియన్స్ డెవలప్‌మెంట్' అనే పేరుతో పరిశోధన థీసిస్‌ను రచించింది.

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమెకు శ్రీనివాస్‌తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది.

గుర్తింపు మార్చు

యామినీ రెడ్డి ప్రపంచ స్థాయిలో కూచిపూడి కళారూపం రంగంలో గుర్తింపు పొందడమేకాక అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.

  • డిస్ట్రిక్ట్ రోటరాక్ట్ క్లబ్ అవార్డు (2000)
  • FICCI యంగ్ అచీవర్స్ అవార్డు (2006), న్యూఢిల్లీ
  • దేవదాసి నేషనల్ అవార్డు (2007)
  • సంగీత నాటక అకాడమీ, నేషనల్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్  (2008)
  • FICCI యంగ్ అచీవర్స్ అవార్డు, హైదరాబాద్ (2012)
  • డబ్లిన్ మేయర్ (ఐర్లాండ్) & Ft లాడర్‌డేల్ (ఫ్లోరిడా, USA) ద్వారా నగరానికి గోల్డెన్ కీ
  • SBJ లెజెండ్స్ ఆఫ్ టుమారో టైటిల్ (2015)
  • యంగిస్తాన్' అవార్డు, న్యూస్ 24 ఛానల్ (2017)
  • ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు (2019)

మూలాలు మార్చు

  1. "Kuchipudi dancer Yamini Reddy carries forward an illustrious legacy - The Hindu". web.archive.org. 2022-09-21. Archived from the original on 2022-09-21. Retrieved 2022-09-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)