యార్లగడ్డ బాలగంగాధరరావు

నామ విజ్ఞాన శాస్త్రం అనే విద్యను పరిశోధన పరిధి దాటించి పాఠ్య ప్రణాళికను రూపొందించి, బోధించి, దేశ విదేశ భాషా శాస్త్రజ్ఞుల ప్రశంసలను పొందిన ఆచార్యుడు యార్లగడ్డ బాలగంగాధరరావు.

యార్లగడ్డ బాలగంగాధరరావు రాసిన బుక్

జీవిత విశేషాలు మార్చు

బాలగంగాధరరావు 1940 జూలై 1 న కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, ఈడుపుగల్లులో జన్మించాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడుగా పనిచేసాడు. బాలగంగాధరరావు 2016 నవంబరు 23 న మరణించాడు.

సాహితీ వ్యాసంగం మార్చు

బాలగంగాధరరావు అరకులోయ ప్రాంతంలో గల వాడుక భాషకి నిఘంటువు రూపొందించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు వ్యుత్పత్తి పదకోశ నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ‘అనంతపురం జిల్లా గ్రామనామాలపై’ సిద్ధాంత గ్రంథం వెలువరించాడు. మహా భారతాన్ని వచనంలో రాశాడు. ఆకాశవాణిలో శ్రీనాథుని హరవిలాసం కావ్య పఠనం చేశాడు.[1] వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను సంకలనం చేసి, అక్షర యజ్ఞం పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించాడు. [2]

ఒక ఊరి కథ మార్చు

మానవ వికాసాన్ని గానీ, భాషా శాస్త్రాన్ని గానీ అధ్యయనం చేసేవారికి అత్యంత అవసరమైనది ఊళ్ళ పేర్లు. విజ్ఞాన సర్వస్వ అభివృద్ధిలో కూడా దీని ఉపయోగం చాలా ఉంది. అటువంటి అంశాన్నికూలంకుషంగా చర్చించిన విలువైన గ్రంథమిది. ఒక ఊరి కథ అని పేరు మాత్రానికి పెట్టినా అన్ని ఊళ్ళ కథగా రూపొందింది. గ్రామాల నామాల వెనుకనున్న ఫోక్ ఎటిమాలజీ, వాటికి ప్రామాణికత, భాషా శాస్త్ర విశేషాలు, వంటివి ఇందులో ప్రస్తావించాడు.

రచనల జాబితా మార్చు

బాలగంగాధరరావు రచించిన కొన్ని పుస్తకాల జాబితా ఇది. [3]

  • ఆంధ్రనాయక శతకం.
  • భావపరిమళము, 2008
  • ఇంటిపేర్లు
  • మాటతీరు
  • నామ విజ్ఞానము
  • ఒక ఊరికథ
  • పల్నాటి వీరచరిత్ర
  • రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు
  • వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామము: వచనము, పద్యము, విశేషాలు
  • నవ్యాంధ్ర రాజధాని ప్రాంత గ్రామాల చరిత్ర

బాలగంగాధరరావు గురించి మార్చు

ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన ఒక పుస్తక సమీక్షలో ఇలా రాసారు: ".. స్థల నామాలు, గృహ నామాలు, జంతు నామాలు - మరింత విస్తృతంగా వ్యక్తి నామాలపై కూడా విశే్లషణ జరగవలసిన అవసరాన్ని తెలుగునాట మొదటగా గుర్తించి, ఆ దిశగా పరిశోధనలు ప్రారంభించి, దానికి విశ్వవిద్యాలయ స్థాయిలో శాస్త్ర ప్రతిపత్తిని కలిగించిన ఘనత నిస్సందేహంగా ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారిదే." [4]

పురస్కారాలు మార్చు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2000 సంవత్సరానికి ఇచ్చిన ఎండోమెంట్స్ పురస్కారాల్లో పరిశోధనకు గాను, బాలగంగాధరరావుకు పురస్కారం ఇచ్చారు. [5]

మూలాలు మార్చు

  1. ద్వాదశి, నాగేశ్వర శాస్త్రి (2016-11-24). "నామ విజ్ఞాని యార్లగడ్డ". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2022-06-16. Retrieved 2022-06-16.
  2. Yerlagada Balagangadharrao (2001). AksharaGyanam (in Turkmen).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  3. "ISNI 0000000040700168 Balagangadhar Rao, Yarlagadda". isni.oclc.org. Archived from the original on 2022-06-16. Retrieved 2022-06-16.
  4. "ఊరి పేర్లు ప్రాంతీయ చరిత్రకు ప్రతిబింబాలు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2022-06-16. Retrieved 2022-06-16.
  5. Jul 25, THE TIMES OF INDIA NEWS SERVICE /; 2001; Ist, 23:51. "25 selected for Endowments Awards | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-16. Retrieved 2022-06-16. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

ఇతర ఆకరాలు మార్చు