యాషిక ఆనంద్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి.ఆమె ఢిల్లీలో పుట్టి, చెన్నైలో స్థిరపడింది. యాషిక ఆనంద్ ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి 2016లో 'ధురువంగల్ పత్తినారు' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 2018లో ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో మంచి గుర్తింపునందుకొని 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో నటించి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

యాషిక ఆనంద్‌
జననం
యాషిక ఆనంద్

(1999-08-04) 1999 ఆగస్టు 4 (వయసు 24)
న్యూఢిల్లీ, భారతదేశం
వృత్తి
 • నటి
 • మోడల్
 • టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

నటించిన సినిమాలు సవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2016 కావలై వెండం స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ తమిళ్
ధురువంగల్ పత్తినారు శృతి
2017 పాదం హిందీ టీచర్
2018 ఇరుట్టు అరైయిల్ మురట్టు కావ్య
మణియార్ కుదుమ్బమ్ "అది పప్పాలి పజమే " పాటలో
నోటా శిల్ప తమిళ్ & తెలుగు
2019 కఝుగు 2 తమిళ్ "సకలకల వల్లి" పాటలో
జోంబీ ఐశ్వర్య
2020 మూకుతి అమ్మన్ "భగవతి బాబా " పాటలో
2021 ఆర్23 క్రిమినల్స్ డైరీ వర్ష
2022 ఇవాన్ థన్ ఉత్తమం నిర్మాణంలో ఉంది[1][2]
రాజా భీమా నిర్మాణంలో ఉంది[3]
కదమైయై సెయ్' నిర్మాణంలో ఉంది[4]
పంబట్టం నిర్మాణంలో ఉంది[5]
సల్ఫర్ నిర్మాణంలో ఉంది[6]
భగీర అతిధి పాత్ర
శిరుతై శివ నిర్మాణంలో ఉంది
బెస్టీ నిర్మాణంలో ఉంది

యాక్సిడెంట్‌ సంఘటన సవరించు

యాషిక ఆనంద్‌ వీకెండ్‌ కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి 2021 జులై 24న మహాబలిపురం లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత వీళ్ళు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వాళ్ళతోపాటు ప్రయాణిస్తున్న భవానీ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యాషిక, ఆమె మరో ఇద్దరు స్నేహితులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.[7] ఆమె మూడు నెలలు ఆసుపత్రిలోనే చికిత్స అందుకొని నవంబర్ లో కోలుకుంది.[8]

మూలాలు సవరించు

 1. "Mahat-Yashika film titled Ivan Than Uthaman". The New Indian Express. Archived from the original on 26 February 2021. Retrieved 8 March 2021.
 2. "Yashika Aannand flaunts her flat belly to her fans". The Times of India. Archived from the original on 10 January 2021. Retrieved 8 March 2021.
 3. Subramanian, Anupama (27 December 2019). "Yashika Anand plays a journo in Raja Bheema". Deccan Chronicle. Archived from the original on 28 December 2019. Retrieved 8 March 2021.
 4. "SJ Suryah's Kadamaiyai Sei goes on floors". The New Indian Express. Archived from the original on 1 February 2021. Retrieved 8 March 2021.
 5. "Pambattam Movie Launch | Jeevan, Rithika Sen, Mallika Sherawat, Yashika Anand, V.C.Vadivudaiyan 96tv". Archived from the original on 5 January 2021. Retrieved 8 March 2021 – via YouTube.
 6. "Popular music director turns Yashika Aanand's villain! - Tamil News". IndiaGlitz.com. 8 March 2021. Archived from the original on 7 June 2021. Retrieved 8 March 2021.
 7. NTV (25 July 2021). "ప్రముఖ నటికి కారు ప్రమాదం… స్నేహితురాలు మృతి". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
 8. TV5 News (1 November 2021). "కోలుకుంటున్న నోటా హీరోయిన్ యాషికా ఆనంద్‌... గత మూడు నెలలుగా ఆసుపత్రిలోనే..!". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.