యాస్కుడు
యాస్కుడు లేదా యాస్కాచార్యడు ప్రాచీన భాషావేత్తలలో ఒకరు. ఇతను వ్రాసిన నిరుక్తము ప్రసిద్ధమైనది.
జననం | క్రీ.శ. 5-7 శతాబ్దానికి మధ్యలో |
---|---|
శకం | వేద కాలం |
ప్రధాన అభిరుచులు | సంస్కృత వ్యాకరణము |
Notable ideas | వేద పదజాల నిఘంటు రచన |
Major works | నిరుక్తము |
జీవిత విశేషములు
మార్చుపండితుల మధ్య యాస్కుడు కాల నిర్ణయ విషయంలో అనేక విభేదాలు ఉన్నాయి. ఆధునిక పాశ్చాత్య పండితుల ప్రకారం, యాస్కుడు సుమారు క్రీ. శ. 7వ శతాబ్దానికి చెందినవాడని అంటారు. పాణిని కంటే యాస్కుడు పెద్దవాడని చరిత్రకారులు భావిస్తున్నారు. యాస్కుడు వ్రాసిన నిరుక్తశాస్త్రము చివరలో పారస్కర అనే పేరు ఉంది. అతను పారాస్కర దేశీయుడని చెందినవాడని ఇది తెలుపుచున్నది. అలాగే, అతని వంశం పేరు యాస్క, అతని వ్యక్తిగత పేరు ఏమిటో ఇప్పటివరకు తెలియదు. తన యొక్క వ్యక్తిగత పేరు తెలియనందు వలన ఈ నిరుక్తశాస్త్ర గ్రంథకారుడు తన యొక్క గోత్రనామంతో పిలవబడుచిన్నాడు.
యాస్కుడు చేసిన రెండు రచనలు ఉన్నాయి. అవి నిఘంటువు, నిరుక్తశాస్త్రము. ఈయన వ్రాసిన నిఘంటువులో వేద పదాల సమాహారం ఉంది. యాస్కుడుకి ముందు కూడా ఒక నిఘంటు వచనం ఉండేది. కానీ యాస్కుడు ద్వారా అది దోష నివృత్తి చేయబడింది. తాను స్వయంగా స్వపరిచిన నిఘంటుకు వ్యాఖ్యానమే మాత్రమే నిరుక్తము.
యాస్కుడు పాణిని కంటే పెద్దవాడుగా పరిగణించబడుతున్నది. ఎందుకంటే పాణిని వ్రాసిన అష్టాధ్యాయిలో వివరించిన దానికంటే యాస్కుడు నిరుక్తంలో వివరించిన సంస్కృత భాష యొక్క వివరణ పురాతనమైనది కనుక.