లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అమెరికాలో అతి ప్రాచీన ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ శాసనసభ (కాంగ్రెస్) కు పరిశోధనా విభాగముగా కూడా పని చేస్తోంది. 13 కోట్ల వస్తువులతో, 530 మైళ్ళు పొడవున ఉండే పుస్తకాల అరలతో, ఈ సంస్థ ప్రపంచములో అతి పెద్ద గ్రంథాలయం కూడా. ఈ వస్తు సముదాయములలో 2.9 కోట్ల పుస్తకాలు, ఇతర అచ్చు ప్రతులు, 27 లక్షల శబ్ద గ్రహణాలు (రికార్డింగులు), 1.2 కోట్ల ఫొటోలు, 48 లక్షల మ్యాపులు, 5.8 కోట్ల చేతివ్రాత ప్రతులూ ఉన్నాయి.


ఇది ప్రపంచంలోని అతి పెద్ద గ్రంథాలయం. ఇది వాషింగ్టన్, డి.సి. (యునైటెడ్ స్టేట్స్) లోని కాపిటల్ హిల్ పైన స్థాపించారు. ఇది 1800వ సంవత్సరం ఏప్రిల్ 24న స్థాపితమైంది. 26 మిలియన్ గ్రంధాలు కరపత్రాలతో సహా 90 మిలియన్ అంశాలు దీనిలో ఉన్నాయి. ఈ గ్రంథాలయ సిబ్బంది 3,597 మంది. గ్రంథాలయ డైరెక్టర్ జేంస్ బిల్లింగ్టన్.
ఈ లైబ్రరీ బృహత్కార్యములు
మార్చు- వనరులను కాంగ్రెసుకూ, ప్రజలకూ ఉపయోగపడేలా ఆందుబాటులో ఉంచటం
- సార్వత్రిక సముదాయమైన జ్ఞానమును సృజనాత్మకతను భావి తరములకు ఆందించుట
సభ్యత్వము
మార్చుఈ లైబ్రరీ సామాన్య ప్రజలకు విద్యా విషయక పరిశోధనలకు, సందర్శకుల పర్యాటనలకు రోజూ తెరచి ఊండును. 18 సంవత్సరములు నిండిన వారు ఎవరైనా 'రీడరు గుర్తింపు కార్డు' పొంది రీడింగు రూములు, సముదాయము లను వీక్షించవచ్చును. కాని శాసనసభ సభ్యులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వారి స్టాఫ్, కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఉద్యోగులు మాత్రమే పుస్తకాలను బయటకి తీసుకు వెళ్ళగలరు.
ఆమెరికాలో మిగతా గ్రంథాలయాలు ఇక్కడ నుండి 'ఆంతర గ్రంథాలయ ఋణము' (Inter-library loan) తీసుకొనవచ్చును.
ప్రముఖుల కంఠస్వరం
మార్చుఅమెరికా నేషనల్ లైబ్రరీవారు ప్రపంచంలో ప్రముఖుల కంఠస్వరాన్ని భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా -భారతదేశం నుండి ఎంపికైన ముగ్గురిలో ప్రముఖ ప్రథములు సి.నా.రె. విశ్వంభర -రుతుచక్రం -కర్పూర వసంతరాయలు ప్రపంచ పదులు -తెలుగు గజల్స్ ఆలపించారు. ఆ రికార్డు టేపులు వాషింగ్టన్‌లో వున్న లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్"లో భద్రపరిచారు.
అమెరికా నేషనల్ లైబ్రరీవారు ప్రపంచం లోని ప్రముఖుల కంఠస్వరాన్ని భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా సి.నా.రె. తెలుగు గజల్స్ ఆలపించిన టేపులను భద్రపరిచారు.