యేసు శిష్యులు
యేసుకు 12 మండి శిష్యులు. పండ్రెండుమంది శిష్యులు/అపొస్తలుల పేర్లు మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంధ్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలోమయి, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరు గల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.[1][2]
“శిష్యుడు” అనే పదము నేర్చుకొనువాడు లేక అనుసరించువాడు అని సూచించును. “అపొస్తలుడు” అనే పదమునకు అర్థము “బయటకు పంపబడినవాడు.” యేసు భూమిమీద ఉన్నప్పుడు, అతని పండ్రెండు మంది అనుచరులు శిష్యులుగా పిలువ బడిరి. ఆ పండ్రెండు మంది శిష్యులు యేసుక్రీస్తును అనుసరించి, ఆయన నుండి నేర్చుకొని, ఆయనచే తర్ఫీదు పొందిరి. ఆయన పునరుత్థానము, ఆరోహణ తర్వాత, యేసు ఆయన శిష్యులను ఆయన సాక్షులుగా ఉండుటకు బయటకు పంపెను[3] . అప్పుడు వారు పండ్రెండు అపొస్తలులుగా సూచించబడ్డారు. అయితే, యేసు ఇంకను భూమిపై ఉంటుండగా, “శిష్యులు”, “అపొస్తలులు” అనే పదములు కొంతమేరకు మార్చుకోదగినట్లు వాడబడెను.
ఆ పండ్రెండు మంది శిష్యులు/అపొస్తలులు దేవుడు అసాధారణ విధానములో వాడుకొన్న సాధారణ పురుషులు. ఆ పండ్రెండు మందిలో, చేపలను పట్టే జాలరులు, ఒక పన్ను వసూలుదారుడు,, ఒక విప్లవాత్మకుడు ఉండెను. యేసు యొక్క పునరుత్థానమును, పరలోకమునకు ఆరోహణను సాక్ష్యమిచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ శిష్యులు/అపొస్తలులను ప్రపంచమును తలక్రిందులు చేసే శక్తివంతమైన దేవుని వ్యక్తులుగా రూపాంతరము చెందిరి.[4]
మూలాలు
మార్చు- ↑ (మత్తయి10:2-4)
- ↑ "Who were the 12 disciples? | Bibleinfo.com". www.bibleinfo.com. Archived from the original on 2019-08-24. Retrieved 2020-04-20.
- ↑ మత్తయి 28:18-20; అపొ. 1:8
- ↑ "యేసుక్రీస్తు యొక్క (12) మంది శిష్యులు/అపొస్తలులు ఎవరు?". www.gotquestions.org. Archived from the original on 2016-08-21. Retrieved 2020-04-20.