యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది 1917లో పరమహంస యోగానందచే స్థాపించబడిన లాభాపేక్షలేని, మతరహిత ఆధ్యాత్మిక సంస్థ,[1] దీనిని రాంచీ, 1917లోక్రియాయోగం యొక్క విశ్వవ్యాప్త బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రారంభించారు.[2] క్రియా యోగా యొక్క అన్ని పురాతన శాస్త్రీయ బోధనలు, ధ్యాన పద్ధతులను అందుబాటులో ఉంచడం ఈ సంస్థ లక్ష్యం. భారతదేశంలో 200 కంటే ఎక్కువ కేంద్రాలను YSS కలిగి ఉంది. దీనికి అదనంగా, ప్రాథమిక తరగతుల నుండి కళాశాల స్థాయి వరకు ఇరవై మూడు విద్యా సంస్థలు ఉన్నాయి.హైదరాబాద్ ధ్యాన కేంద్రం చికోటీ గార్డెన్‌లో ఉంది. ఏ మతమునకు సంబంధం లేనటువంటి బోధనలు సర్వతోముఖ విజయం ఇంకా శ్రేయస్సును సాధించడానికి పూర్తి తత్వశాస్త్రం, జీవన విధానాన్ని, అలాగే జీవిత అంతిమ లక్ష్యాన్ని చేరుకోటానికి పరమాత్మతో జీవాత్మ యొక్క ఐక్యత సాధించడానికి ధ్యానం వంటి వివిధ పద్ధతులను ఇక్కడ బోధిస్తారు, పరమహంస యోగానంద సన్నిహిత శిష్యులలో ఒకరైన దయా మాతగారు, 1955 నుండి 2010 లో మరణించే వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌కు ఆధ్యాత్మిక అధిపతి, అధ్యక్షురాలుగా పనిచేశారు, ఆ ఆతరువాత పరమహంస యోగానంద సన్నిహిత శిష్యులు,మృణాళినీమాత, 2011 నుండి 2017లో మరణించే వరకు ఈ స్థానాల్లో పనిచేశారు. ఇప్పడు చిదానంద గిరి ప్రస్తుత ఆధ్యాత్మిక అధిపతి, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు.[3] యోగానంద స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2017 మార్చి 7న భారత ప్రధాని నరేంద్ర మోదీ స్మారక తపాలా స్టాంపును విడుదల చేశారు[4].
మూలాలు
మార్చు- ↑ Desk, HT Telugu. "పరమహంస యోగానంద మహాసమాధి వేళ భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు". Hindustantimes Telugu. Retrieved 2023-01-05.
- ↑ Pioneer, The. "Yogada Satsang Society completes 104 years". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2023-01-05.
- ↑ "యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి". Yogoda Satsanga Society of India. Retrieved 2023-01-05.
- ↑ https://www.narendramodi.in/pm-modi-releases-special-commemorative-postage-stamp-on-100-years-of-yogoda-satsanga-math-534638