రక్త జలపాతం
రక్త జలపాతం (బ్లడ్ ఫాల్స్) అనేది తూర్పు అంటార్కిటికా లోని విక్టోరియా ల్యాండ్‌లోని మెక్‌ముర్డో డ్రై వ్యాలీస్‌లో ఉన్న ఉప్పునీటి జలపాతం. అందులో ఉండే నీరు ఎరుపు రంగులో ఉన్న కారణంగా ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. ఈ జలపాతం టేలర్ గ్లేసియర్ పాదాల వద్ద నుండి బోనీ సరస్సులోకి ప్రవహిస్తుంది. ఈ జలపాతాన్ని1911లో ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నాడు.[1]
జియోకెమిస్ట్రీ
మార్చుఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ థామస్ గ్రిఫిత్ టేలర్ 1911లో ఎర్రటి జలపాతాన్నికనుగొన్న తరువాత, ఆ జలపాతానికి ఇతని పేరును పెట్టారు. అంటార్కిటికా సైంటిస్ట్ లు మొదట నీరు ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఎర్ర ఆల్గే కారణం అని అనుకున్నారు, అయితే తర్వాత అది నీటిలో అధిక ఐరన్ ఆక్సైడ్ ఉండడం వలన నీరు ఎర్ర రంగులోకి మారుతుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.[2] రసాయనాలు, సూక్ష్మజీవులతో సహా నీటి నమూనాలను విశ్లేషించి, శాస్త్రవేత్తలు ఇది హిమానీనదం ఉపరితలం క్రింద అరుదైన ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా పర్యావరణ వ్యవస్థ అని నిర్ధారించారు. బ్లడ్ ఫాల్స్ ఇనుముతో కూడిన ఎర్ర రంగులో ఉండే హిమానీనదం. ఈ ఎర్ర రంగు ప్రవాహం మంచు క్రింద నుండి దాదాపు 400 మీ (1,300 అడుగులు) లోతు నుండి ప్రవహిస్తుంది. అయితే దాని పరిమాణం తెలియదు కాని అది బయటకు వచ్చే ప్రదేశం, కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బోనీ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు ఉంటుంది. 1 మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణం మారడంతో, సముద్రం వెనక్కి వెళ్లడంతో, ఉప్పునీరు లోయను ఆక్రమించింది.[3] సరస్సు అడుగున నిక్షిప్తమైన సముద్రపు నీరులో ఉండే ఉప్పు ఇనుమును కలిగి ఉంటుంది. సరస్సులోని నీటి ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్, నీరు చాలా ఉప్పగా ఉంటుంది. లవణీయత సాధారణ సముద్రపు నీటిలో 2 నుండి 3 రెట్లు ఉంటుంది. సరస్సులోని నీటి లవణీయత సముద్రంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ, కాబట్టి నీరు -10 ° C వద్ద కూడా గడ్డకట్టదు. వాతావరణ మార్పుల వలన పైన ఉన్న నీరు గడ్డకట్టింది కానీ లవణీయత ఎక్కువ ఉండడం వలన లోపలి నీరు గడ్డకట్టలేదు. మంచు కరగడం మొదలయ్యాక రంధ్రాలు ఏర్పడి ఎర్ర రంగు నీళ్లు బయటికి రాసాగాయి. ఆక్సీకరణ కారణంగా ఈ నది నీరు రక్తం రంగులో ఎర్రగా కనిపిస్తుంది. లోయలో ఐరన్ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు అధికంగా ఉండడం దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు. ఈ సరస్సులో కాంతి, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుందని, ఐరన్ కంటెంట్ ఉన్న ద్రవం గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో తాకినప్పుడు అది తుప్పు పట్టి, నీరు రక్తం రంగులో ఎర్రగా మారుతుంది. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదంతస్తుల భవనంతో సమానం. టెన్నెస్సీ విశ్వవిద్యాలయంలోని జియోమైక్రోబయాలజిస్ట్ జిల్ మికుకీ ప్రకారం, బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధకుల బృందం పరిశోధన తర్వాత కనుగొంది. అయితే ఇందులో 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సూక్ష్మజీవులు ఫెర్రిక్ అయాన్‌లతో శ్వాసక్రియకు సల్ఫేట్‌ను ఉపయోగిస్తాయని, సల్ఫేట్ ను తగ్గించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు చాలా క్లిష్టమైన వాతావరణంలో నివసిస్తాయి. ఇటువంటి జీవక్రియ ప్రక్రియ ఇంతకు ముందు ప్రకృతిలో ఎప్పుడు గమనించబడలేదు.[4]
ప్రయాణం
మార్చుయుఎస్, న్యూజిలాండ్ నుండి హెలికాప్టర్ లేదా రాస్ సముద్రంలో క్రూయిజ్ షిప్ ద్వారా మాత్రమే డ్రై వ్యాలీకి వెళ్ళవచ్చు.[5]
మూలాలు
మార్చు- ↑ Magazine, Smithsonian; Daley, Jason. "Antarctica's Blood Falls Helps Unravel the Inner Workings of Glaciers". Smithsonian Magazine. Retrieved 2023-05-18.
- ↑ "Researchers solve the century-old mystery of Blood Falls". uaf.edu. Retrieved 2023-05-18.
- ↑ Telugu, TV9 (2023-03-25). "Blood Falls: 'రక్తం'ప్రవహించే నది.. 1.5 మిలియన్ ఏళ్ల పురాతన రహస్యాన్ని ఛేదించిన సైంటిస్ట్‌లు". TV9 Telugu. Retrieved 2023-05-18.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Nace, Trevor. "Mystery Of Antarctica's Blood Falls Is Finally Solved". Forbes. Retrieved 2023-05-18.
- ↑ "Blood Falls". Atlas Obscura. Retrieved 2023-05-18.