రక్షణ శక్తి

(రక్షణ శక్తి (immunity ) నుండి దారిమార్పు చెందింది)


అంటు వ్యాధుల నుండి వ్యాధి నిరోధక శక్తి (immunity) అంటు వ్యాధులనుండి మనలను శక్తి రెండు విధములు. ఆ రక్షణ శక్తులను మన శరీరములో ఏవిధముగా ప్రవేశ పెట్టవచ్చును. ఈ విషయమును విపులంగా చర్చించునదే ఈ వ్యాసము.

రక్షణ శక్తి (immunity ) మార్చు

ఒకానొక అంటు వ్యాధి రాదగిన అవకాశములన్నియు నున్నను, ఆ వ్యాధిని మన కంటకుండ జేయు శక్తికి రక్షణ శక్తి యని పేరు. ఇట్టి రక్షణ శక్తి మనకు గలదను విషయము చిరకాలము నుండి ప్రజలకు కొంత వరకు తెలిసి యున్నదని చెప్పవచ్చును. ఒక్క సారి మశూచకము వచ్చిన వానికి తిరిగి మశూచకము రాదని మనవారల కందరకు తెలియదా? ఇట్లొక సారి మశూచకము వచ్చిన వానికి తిరిగి మశూచకము రాకుండుటకే వానికి రక్షణ శక్తి కలదని చెప్పుదుము. ఇట్టి రక్షణ శక్తి మశూచకమునకే గాక యింకను కొన్ని ఇతర వ్యాధులకును గలదు. ఒక సారి వ్యాధి వచ్చి పోవుట చేతనే గాక ఇతర కారణముల చేత కూడా మన రక్షణ శక్తి కలుగ వచ్చును.

మన చుట్టు ప్రక్కలను, మన శరీరము మీదను, మన పేగులలోను, నోటి యందును, ముక్కులందును, ఊపిరి పీల్చు గాలి యందును సూక్ష్మ జీవులు కోట్లు కోట్లుగా నున్నవని చెప్పవచ్చును. మన శరీరములో ప్రాణమున్నంత కాలము మన కేమియు అపకారము చేయలేని సూక్ష్మ జీవులు ప్రాణము పోయిన వెంటనే శరీరమును నాశనము చేయుటకు ప్రారంభించి కొద్ది దినములలో తాము నివసించు గృహమును నామము నకైన లేకుండా క్రుళ్ళ పెట్టును. ప్రాణమున్నప్పుడీ దేహమునకు సూక్ష్మ జీవువు లపకారము చేయ కుండ మనలను రక్షించు శక్తి యొకటుండ వలెను. అది సహజముగ ప్రతి జంతువు యొక్క శరీరమునకును ఉంది. అట్టి రక్షణ శక్తికి సహజ రక్షణ శక్తి యని పేరు. పైన చెప్పిన ప్రకారము ఒక వ్యాధి వచ్చి కుదిరి పోవుటచే గాని, టీకాలు మొదలగు నితర ప్రయత్నములచే మనము కల్పించుకునట్టి గాని రక్షణ శక్తికి కల్పిత రక్షణ శక్తి యని పేరు.

సహజ రక్షణ శక్తి యందును, కల్పిత రక్షణ శక్తి యందును కూడ అనేక భేదములు కలవు. మార్చు

సహజ రక్షణ శక్తి పైన ఒకచో వివరించిన ప్రకారము (1) మన నెత్తురు నందుండు తెల్ల కణములు సూక్ష్మ జీవులను మ్రింగి వేయుట చేత గాని, (2) ఆ తెల్ల కణములనుండి ఉద్భవించు విరుగుడు పదార్థములు సూక్ష్మ జీవులను చంపి వేసి వాని విషములను విరిచి వేయుట చేగాని కలుగ వచ్చును.

ఇవిగాక మనకు సూక్ష్మ జీవు లంటుటలో కూడా రెండు భేదములు కలవని చెప్పి యుంటిమి. (1) కొన్ని సూక్ష్మ జీవులు శరీరములో ప్రవేశించిన తోడనే కోట్లు కోట్లుగా పెరిగి దొమ్మ మొదలగు వ్యాధులలో వలె రక్తము ద్వారా సకల అవయవములకు వ్యాపింప వచ్చును. (2). మరికొన్ని సూక్ష్మ జీవులు ధనుర్వాయువులో వలె ప్రవేశించిన చోటనే పెరుగుచు తమ విషములను మాత్రము శరీర మంతట వ్యాపింప జేయుచు ఆ విషములచే మన కపకారము చేయును. ఇందు మొదటి రకము అంటు వ్యాధులలో సూక్ష్మ జీవులే మనకపకారము చేయును. రెండవ రకము అంటు వ్యాధులలో సూక్ష్మ జీవుల నుండి పుట్టిన విషములు మన కపకారము చేయును. దొమ్మ (Antrax ) క్షయ (Tubercle ) కుష్టువ్యాధి (Leprosy ) మొదలగునవి మొదటి రకములోని అంటు వ్యాధులు. ధనుర్వాయువు, ( Titanus), కలరా (kholera) డిప్తీరియా (Diphtheria) అను నొక క్రూరమైన గొంతు వ్యాధి, ఇవి రెండవ రకము అంటు వ్వాధులు. ఈ రెండు రకములు గాక కొంత వరకు సూక్ష్మ జీవుల మూలమునను కొంత వరకు వాని విషముల మూలమునను మన కపకారము చేయు అంటు వ్యాధులు కొన్ని గలవు. టైఫాయిడు జ్వరము, ప్లేగు, (మహామారి), ఇన్ ప్లూయంజా జ్వరము, రణ జ్వరము (spetic Fevere) ఇవి యీ మూడవ జాతి అంటు వ్యాధులు.

ఇందు మొదటి రకము వ్వాధులలో రక్షణ శక్తి కలిగింప వలెననిన, సూక్ష్మ జీవులను జంపుటకు ప్రయత్నింప వలెను. అట్లు చంపు పదార్థములకు సూక్ష్మ జీవ నాశకములని పేరు. ఈ సూక్ష్మ జీవనాశకములగు పదార్థములను మన మేలాగునైన రోగి శరీరములో పుట్టించిన యెడల ఆ పదార్థము సూక్ష్మ జీవులను చంపును. మశూచకము మొదలగు వ్యాధులు రాకుండ టీకాలు వేయుట ఈ పదార్థములను మన శరీరములో బుట్టించుటకే. ఇట్టి టీకాలలో అనేక విధములు గలవు. వానిని క్రింద వివరించెదము.

టీకాలు మార్చు

ఇందు మొదటి రకము అంటు వ్యాధులలో సూక్ష్మ జీవులే మనకపకారము చేయును. రెండవ రకము అంటు వ్యాధులలో సూక్ష్మ జీవుల నుండి పుట్టిన విషములు మన కపకారము చేయును. దొమ్మ (Antrax ) క్షయ (Tubercle ) కుష్టవ్యాధి (Leprosy ) మొదలగునవి మొదటి రకములోని అంటు వ్యాధులు. ధనుర్వాయువు, ( Titanus), కలరా (kholera) డిప్తిరియా (Diphtheria) అను నొక క్రూరమైన గొంతు వ్యాధి, ఇవి రెండవ రకము అంటు వ్ యాధులు. ఈ రెండు రకములు గాక కొంత వరకు సూక్ష్మ జీవుల మూలమునను కొంత వరకు వాని విషముల మూలమునను మన కపకారము చేయు అంటు వ్యాధులు కొన్ని గలవు. టైఫాయిడు జ్వరము, ప్లేగు, (మహామారి), ఇన్ ప్లూయంజా జ్వరము, రణ జ్వరము (spetic Fevere) ఇవి యీ మూడవ జాతి అంటు వ్యాధులు. ఇందు మొదటి రకము వ్యాధులలో రక్షణ శక్తి కలిగింప వలెననిన, సూక్ష్మ జీవులను జంపుటకు ప్రయత్నింప వలెను. అట్లు చంపు పదార్థములకు సూక్ష్మ జీవ నాశకములని పేరు. ఈ సూక్ష్మ జీవనాశకములగు పదార్థములను మన మేలాగునైన రోగి శరీరములో పుట్టించిన యెడల ఆ పదార్థము సూక్ష్మ జీవులను చంపును. మశూచకము మొదలగు వ్యాధులు రాకుండ టీకాలు వేయుట ఈ పదార్థములను మన శరీరములో బుట్టించుటకే. ఇట్టి టీకాలలో అనేక విధములు గలవు. వానిని క్రింద వివరించెదము.

గుర్రమును చంపుటకు శక్తి గల మోతాదులో 20 వ వంతు మోతాదుగల కొలతగా ధనుర్వాయు వచ్చు సూక్ష్మ జీవులను ఎక్కింతురు. ఈ గుర్రమునకప్పుడు కొంచెము జ్వరము వచ్చి యది బాధ పడినను మోతాదు చాలదు గనుక చావదు. ఈ గుణము లన్నియు నయమైన తరువాతి కొన్ని దినములకు తిరిగి మొదటి మోతాదు కంటే కొంచెము ఎక్కువ ధనుర్వాయు సూక్ష్మ జీవులను ఆ గుర్రము యొక్క రక్తములోనికి ఎక్కింతురు. దీనిని కూడా గుర్రము జయించును. ఇట్లు అనేక సారులు చేసిన పిమ్మట ఎంత హెచ్చు మోతాదు ధనుర్వాయువు సూక్ష్మ జీవులను ఆ గుర్రము నెత్తురులోని కెక్కించినను అది లెక్క చేయదు. ఈ ప్రకారము చేయుట వలన ఆ గుర్రము యొక్క రక్తమునకు ఒక విధమైన రక్షణ శక్తి కలిగినది. దాని రక్తములో ధనుర్వాయువు కలిగించు సూక్ష్మ జీవుల విషమెంత వేసినను విరిగి పోవును. ఇట్లు చేయు శక్తి దాని నెత్తురు లోని ద్రవ పాదార్థములో అనగా రసములో నున్నది గాన కణములలో లేదు. ఈ రసమును ఆ గుర్రమునుండి వేరు పరచి ఎంత పరిమాణము గల రసము ఎంత విషమును విరిచి వేయ గలదో శోధనలు చేసి నిర్ధారణ చేయుదురు. ఇట్లు శోధించి ఒక తులము రసము ఇన్ని లక్షల సూక్ష్మ జీవుల విషమును విరిచి వేయునని ఏర్పరతురు. వ్యాధి యొక్క ఉద్రేకమును బట్టి వైద్యుడు ఈ రసమును తగిన మోతాదులతో ఉప యోగించు కొనవలెను. ఈ గుర్రపు రసములో ధునుర్వాయు విషనాశక మగు పదార్థము ఎద్దియో కలదనుట స్పష్టము. ఈ విషయమై ఇంకను క్రింది తెలిసి కొనగలరు. ఈ టీకా రస వైద్యము (Serum Therasphy) దినదినాభి వృద్ధి యగుచున్నది. ఇట్లె వివిధ జాతుల సూక్ష్మ జీవుల విషములను విరిచి వేయుటకు వేరు వేరు విధముల టీకా రసములు తగివవి ఇప్పుడు విక్రయమునకు దొరకును.

రక్షణ శక్తి మార్చు

సహజ రక్షణ శక్తి, కల్పిత రక్షణ శక్తి యని రెండు విధములనియు, అంటు వ్వాధులలో సూక్ష్మ జీవులచే కలుగునని, వాని విషములచే కలుగునవి, అని రెండు విధములనియు ఈ వ్వాధుల నుండి రక్షణ శక్తి కలిగింప వలెననిన మొదటి రకము వ్వాధులకు సూక్ష్మ జీవ నాశకమగు పదార్థములను, రెండవ రకము వ్వాధులకు సూక్ష్మ జీవ విష నాశకములగు పదార్థములను మనము ఉపయోగ పరచ వలెననియు వ్రాసి యుంటిమి. ఇప్పుడు ఒక్కొక్క రక్షణ శక్తి గురించి తెలుసు కొనెదము.


సహజ రక్షణ శక్తి. మార్చు

సూక్ష్మ జీవులు మన కపకారము చేయ కుండ నెల్లప్పుడును మనలను కాయుచుండు ప్రాకరము లనేకములు గలవని చెప్పవచ్చును. అందు మన చర్మము మొదటి ప్రాకారము. గాయము లేనంత కాలము సూక్ష్మ జీవులు చర్మము గుండ మన రక్తములోనికి వెలుపలి నుండి ప్రవేశింప నేరవు. కాని కొన్ని సూక్ష్మ జీవులను చర్మము మీద పెట్టి గట్టిగా రుద్దిన యెడల నా సూక్ష్మ జీవులు చర్మము గుండ లోనికి పోగలవు. లోపల ప్రవేశింప గానె ఈ సూక్ష్మ జీవులు మన గజ్జలు, చంకలు మొదలగు స్థలములలో నుండు గ్రంథులచే నాపి వేయబడును. ఇవి రెండవ వరుస ప్రాకారము లోని కోట బురుజులని చెప్పవచ్చును. ఈ గ్రంథులు సూక్ష్మ జీవులను ఖయిదీలుగా పట్టి యించు స్థలములు. ఇక్కడ మన సైన్యములగు తెల్ల కణములు ఈ సూక్ష్మ జీవుల నెదిర్చి పోరాడును. వీనిని గెల్చిన పిమ్మట గాని సూక్ష్మ జీవులు మన రక్తములోనికి పోజాలవు. ఒక్కొక్కచో నిక్కడనే యురు గతెగల వారికి ఘోర యుద్ధమై చీము ఏర్పడి గడ్డగా తేలును. సుఖ వ్యాధులలో నీ గ్రంథులు పెద్ద వైనప్పుడు వానిని అడ్డగర్రలనియు బిళ్ళలనియు చెప్పుదురు. సూక్ష్మ జీవుల శక్తి కంటే తెల్ల కణముల శక్తి హెచ్చి నప్పుడు బిళ్ళలు కరిగి పోవును. తెల్ల కణముల శక్తి సూక్ష్మ జీవుల క్రౌర్యమునకు లోబడి నపుడు చీము ఏర్పడి కురుపుగా తేలును. అనేక మందికి మెడ యందును, ఇతర స్థలములందును బిళ్ళలు వరుసలు వరుసలుగా పుట్టును. ఇవన్ని ఏవో సూక్ష్మ జీవులు శరీరములో ప్రవేశింప వలెననినప్పుడు వానితో పోరాడుటకై చేరియుండు తెల్ల కణముల సమూహములచే నుబ్బి యున్నవని గ్రహింప వలెను. క్షయ యందును, సవాయ మేహము (Syphillis ) నందును ఈ బిళ్ళలు ఉబ్బును. తేలు కుట్టి నప్పుడు గజ్జలలో బిళ్ళలు నొప్పి యత్తునది విషమిక్కడ నిలిచి పోవుట చేతనే కలుగు చున్నది.

మన నోటి గుండ సూక్ష్మ జీవులు ప్రవేశింప వలెననిన వాని కెందరు విరోధులున్నారో యాలోచింతము. మన నోటిలో ఊరు ఉమ్మి యనేక జాతుల సూక్ష్మ జీవులను తొలుతనే చంపి వేయును. అక్కడ నుండి పోయి తర్వాత మన ఆహార కోశము (Stomach) లో పారు చుండు జఠర రసము (Gastric juice) మొక్క పులుపు అనేక రకముల సూక్ష్మ జీవులను నశింప జేయును. ఇవి దాటి సూక్ష్మ జీవులు పేగులలోనికి పోయినను అన్ని యెడలను సూక్ష్మ జీవులు మన కపకారము చేయ లేవు. మన పేగుల యందు సర్వత్ర ఆవరించి యొక దళమై నట్టియు మృధువైనట్టియు పొర (Mucous Membrance) గలదు. ఈ పొరలో గాయములు లేకున్నంత కాలమును, వ్వాధి గానీ బలహీనత గాని లేకున్నంత కాలమును సూక్ష్మ జీవుల నిది మన రక్తములోనికి చొరనియ్యదు. దొమ్మ సూక్ష్మ జీవులను చుంచులకు ఆహారములో కలిపి యెన్ని పెట్టినను వానికి వ్యాధి రాదు. గాయము గుండ చర్మములోని కెక్కించినను, మెత్తని పొడి చేసి పీల్పించినను వెంటనే వ్యాధి అంటును. ఇవి గాక స్త్రీల యొక్క సంయోగావయవములలో నుండి యూరు ద్రవములలో నొక విధమైన ఆమ్ల పదార్థముంది. అది సామాన్యముగా సూక్ష్మ జీవుల నన్నిటిని చంపును. ఆ భాగము నందేదేని గాయము గాని, వ్వాధి గాని యున్నప్పుడే సుఖ వ్వాధు లంటును గాని, మిక్కిలి యారోగ్య దశలో నీ అవయము లున్న యెడల సుఖ వ్వాధులు తరుచుగ నంటవు. మనము విసర్జించు మూత్రములో కూడా సామాన్యముగా కొన్ని సూక్ష్మ జీవులను చంపు గుణము ఉంది. పైని వివరింప బడిన కాపుదలలే గాక నమ శరీరమునందు సూక్ష్మ జీవులు సులభముగ చేర కుండ మనలను రక్షించుటకు మిక్కిలి క్లిష్టములగు వ్యూహము లెన్నియో గలవు. అవి యన్నియు మనకింత వరకు తెలియవు. తెలిసిన వరకు మిక్కిలి ముఖ్యములగు విషయములు దిన దినమున నుపకరించునవి కొన్ని గలవు. మన శరీరములో సూక్ష్మ జీవులకు తగిన ఆహారముండగా నవి ఎందు చేత మన శరీరములో ప్రవేశించి నప్పుడు పెరుగవు? ఏవో వీనికి హాని కరములగు పదార్థము వీనికెదురు పడి పోరాడు చున్నందున వీని దండ యాత్రలు నిలుచు చున్నవి కాని వేరు కాదు. ఇట్లు పోరాడు మన సిబ్బందిలో రెంటిని గూర్చి మన మిదివర్లో విని యున్నాము. ఇవి మన నెత్తురులో నుండు తిండి పోతు తెల్ల కణములు విరుగుడు పదార్థములే.

నెత్తురు యొక్క స్వరూపము: మార్చు

1884 సంవత్సర ప్రాంతమున మెచ్నికాఫ్ అను నతడు నెత్తురులోని కొన్ని తెల్ల కణములు సూక్ష్మ జీవులను పట్టి తినునని కని పెట్టెను. ఈ తెల్ల కణములలో రెండు విధములు ఉన్నాయి. కొన్ని జంగమ తెల్ల కణములు; కొన్ని స్థావర తెల్ల కణములు. వీని భేదములను చక్కగా గుర్తెరుగుటకై యెక నెత్తురు బొట్టు నెత్తి దానిని సూక్ష్మ దర్శినిలో నుంచి పరీక్షింప వలెను. నెత్తురు చుక్క యొక్క పటమును చూచిన యెడల పెక్కులుగ గుండ్రని నాణెముల దొంతరల వలెనున్న కణములునూక్కడక్కడ వివిధాకారములులు గల కొంచెము పెద్ద కణములు చూడ నగును. ఈ తెల్ల కణములు నెత్తురులో నున్నప్పుడు కొంచెము నీలపు రంగు కలిగిన ఉండల వలె కనుపించును. ఈ ఎర్ర కణములును తెల్ల కణములును గాక రక్తములో వీని కాధారమగు ద్రపదార్థము గలదు. ఈ ద్రపదార్థమునకు రసము (Serum ) అని పేరు. ఈ రసములో తేలుచు నెత్తురు కాలువలో ఈ కణములు కొట్టుకొని పోవు చుండును. ఇందు రమా రమి 500 ఎర్ర కణములకు ఒక తెల్ల కణము చొప్పున వుండును. ఎర్ర కణములు ఊపిరి తిత్తుల లోనికి పోయి ప్రాణ వాయువును తెచ్చి శరీరమున కిచ్చుచు. అక్కడ నుండి అంగారామ్ల వాయువుని (Carbonic Acid Gas ) తీసికొని పోయి ఊపిరి గాలి గుండ బయటికి విడిచి వేయును.

తెల్ల కణములు. మార్చు

తెల్ల కణములలో 5 భేదములు ఉన్నాయి. సాధారణంగా అన్ని కణములలో వలె ఈ కణముల నన్నిటి యందు మూల పదార్థమును జీవ స్థానమును నుండును. వీని యందలి భేదము చేతనే తెల్ల కణములో ఈ అయుదు భేదము లేర్పడినవి.

1.బహురూప జీవ స్థానము గల తెల్ల కణములు (Polymoepho-nuclear Leucocyte) . ఇచి నెత్తురు లోని తెల్ల కణములలో నూటికి 70 వంతున నుండును. వీనియందు అర్థ చంద్రాకారముగను లావత్తు వలెను తెలుగు లెక్కలలోని హళ్ళి (' ) వలెను అనేక రూపములు గల జీవ స్థానములుండును. మూల పదార్థములో సన్నని నలుసులుండును.

2.ఆమ్లాకర్షణములు. (Eosinophill Leucocyte) ఇందు గుండ్రమైనట్టి కాని, వలువలు గల యట్టి కాని జీవ స్థానములుండును. మూల పదార్థములో మోటుగ నుండు నలుసు లుండును. ఈ నలుసులు ఇయోసిన్ మొదలగు ఆమ్లవర్ణముల నాకర్షించును. (Oxyphill) ఇవి నూటికి 2 మొదలు 4 వరకు నుండును.

3. జీవ స్థానము ఏకముగ నున్న పెద్ద తెల్ల కణములు. (Large Mononuclear Leucocyte) ఇందు పెద్ద జీవ స్థానమును, దాని చుట్టు కొంచెము మూల పదార్థము నుండును. ఇందు నలుసులు అంతగా కాన రావు. ఇవి నూటికి 2 మొదలు 4 వరకుండును.

4. చిన్న తెల్ల కణములు (Lymphocyte) ఇందు గుండ్రని చిన్న జీవ స్థానమును, కొద్ది పాటి మూల పదార్థమును యుండును. ఇందును నలుసులు కాన రావు. ఇవి నూటికి 20 మొదలు 25 వరకు వుండును.

5. ఇవిగాక జీవ స్థానము ఏకముగ గల పెద్ద తెల్ల కణములకును, బహురూప జీవ స్థానము గల తెల్ల కణములకును మద్యమున కొన్ని తెల్ల కణములు ఉన్నాయి. వీనికి మధ్యమ తెల్ల కణములు (Transitional Leucocytes) అని పేరు. ఇందు జీవ స్థానము బొబ్బర (అలసంద) గింజల వలె మధ్య వల్లమును రెండు అంచులు లావుగ నుండును. ఇవి క్రమముగ బహురూప జీవ స్థానము గల తెల్ల కణములుగా మారును.

జంగమ కణములు మార్చు

పైని చెప్పిన కణములలో ముఖ్యముగ సూక్ష్మ జీవులను పట్టి తినునవి బహురూప జీవ స్థానములు గల తెల్ల కణములు. జీవ స్థానము ఏకముగ గల పెద్ద కణములకును, నెత్తురులో గాక కండము, నరములు మొదలగు సంహతుల నడుమ నుండు కొన్ని కణములకు కూడా సూక్ష్మ జీవులను పట్టి తిను శక్తి గలదు. ఇందు కొన్ని యొక చోట నుండక ఎల్లప్పుడు తిరుగు చుండును. కావున వానికి జంగమ కణములని పేరు కలిగెను.

స్థావర కణములు: మార్చు

పైని వివరించినవి కాక తాము నివసించు చోట్లనే కదలక యుండి దొరినినప్పుడెల్ల సూక్ష్మ జీవులను పట్టి తిను శక్తి గల కణములు కొన్ని ఉన్నాయి. మన పేగుల యందలి ఆమ్లపు పొర యందును గ్రంథుల యందును లోపల వైపున పరచి యుండు అంతశ్చర్మ కణములును, ప్లీహము (Spleen) నందును ఎముకలలోని మూలుగు (Bone Marrow) లో నుండు కణములును ఒకానొకప్పుడు నరములలోని కణములను, కండల లోని కణములును కూడా సూక్ష్మ జీవులను పట్టి చంపును. ఇవి యన్నియు స్థావరకణములు.

కణవాదము. మార్చు

తిండి పోతు తెల్ల కణములు. మార్చు

సూక్ష్మ జీవులను చంపు నీ జంగమ కణములకును స్థావర కణములకును కూడా తిండి పోతు కణములని పేరు. మెచ్నికాఫ్ అను నతడు మొదట నొక ఈగ యొక్క రక్తము లోని తెల్ల కణ మొకటి సూక్ష్మ జీవుల గ్రుడ్డు నొక దానిని పట్టి తినుట కనిపెట్టెను. పిమ్మట ఇతడు కొన్ని కప్పలకు దొమ్మ వ్యాధి నెక్కించి ఆ దొమ్మ వ్వాధి సూక్ష్మ జీవులను కప్పల లోని తిండి పోతు కణములు తినుట చూచెను. అటు తరువాత నెక్కడ సూక్ష్మ జీవులు ప్రవేశించినను, అక్కడ కెల్ల నీ తిండి పోతు తెల్ల కణములు పరుగు లెత్తుకొని వచ్చు చుండుట నితడు కనిపెట్టెను. చచ్చిన సూక్ష్మ జీవుల శవములును, వాని నుండి పుట్టిన ఏవో కొన్ని మాంస కృత్తు పదార్థములును తెల్ల ఖణములను సూక్ష్మ జీవుల వద్ద కాకర్షించు ననియు మిక్కిలి యుదృతమైన క్రౌర్యముగల సూక్ష్మ జీవుల విషముల యందు తిండి పోతు కణములను దూరముగ తోలు శక్తి గలదనియు కొందరు శోధకులు కని పెట్టి యున్నారు. సూక్ష్మ జీవులేగాక సూక్ష్మ జీవుల గ్రుడ్లను కూడా తిండి పోతు తెల్ల కణములు మ్రింగును. కాని అవి సాధారణంగా జీర్ణము కావు. తెల్ల కణము లీ గ్రుడ్లను మోసికొని పోయి మరి యొక చోట విడిచి నప్పుడు మిక్కిలి తీవ్రముగ పెరుగ నారంబించి వేన వేలయి తిరిగి యక్కడ హాని జేయుటకు ప్రారంబించునని మెచ్ని కాఫు అను వైద్యుడు కని పెట్టి యున్నాడు. నెత్తురు లోని తిండి పోతు కణముల సంఖ్యను బట్టి యొకానొక వ్యాధి యందు సూక్ష్మ జీవులు గెలుచునా మన శరీరము గెలుచునా యను విషయము ఎల్లప్పుడును తెలిసి కొన వచ్చుననియు, నీ తిండి పోతు కణములే మనలను సూక్ష్మ జీవుల నుండి కాపాడుట కాధారమనియు మెచ్ని కాఫు యొక్క వాదము. ఈతని వాదమునకు కణవాదమని పేరు.

పైని జెప్పిన ప్రకారము తిండి పోతు తెల్ల కణములు మనకు చేయు నుపకార మొచ్చు కొన తగినదే కాని, ఈతని కణ వాదము సంపూర్ణముగా నంగీకరింప తగినది కాదని యిటీవలి వారు నిర్ధారణము చేసి యున్నారు. నెత్తురు నుండి తెల్ల కణములను ఎర్ర కణములను అన్నిటిని వడ పోసి తీసి వేయగా మిగిలిన రసమునందు కూడా సూక్ష్మ జీవులను మనము వేసి నప్పుడు అవి చచ్చుననియు., కావున రక్తము లోని రసమునకు కూడా సూక్ష్మ జీవులను చంపు గుణము గలదనియు నిటీ వలి వారు కని పెట్టి యున్నారు.

ఇట్లు సూక్ష్మ జీవులను చంపు గుణము రక్తమును 55 డిగ్రీల వరకు అనగా మనము చెయ్యి పెట్టలేనంత వేడి వచ్చు నంత వరకు కాచిన యెడల నశించి పోవును. ఇతర మాంస కృత్తుల (Proteids) తో పాటు ఈ పదార్థములను కూడా వడ పోసి తీయ వచ్చును. ఆర బెట్టి పొడి చేయవచ్చును. తిరిగి నీళ్ళలో కలపవచ్చును. ఇట్లు చేసినను వాని శక్తి పోదు. కాని ఈ పదార్థమును విడిగా తీయ వలెనన్న శక్యము కాలేదు. కొద్ది పాటి వేడి గాని వెలుగురు గాని ప్రాణ వాయువు గాని తగిలిన తోడనే దీని శక్తి నశించి పోవును.

కావున నీ పదార్థములను విడదీయుటకు గానీ ప్రత్యేకముగ నిలువ చేయుటకు గాని సాధ్యము కాక యున్నది. పైని చెప్పిన తిండి పోతు కణములును రసములోని యేవో పదార్థములును రెండును, సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించి నప్పుడే గాక మన శరీరముతో సంబంధము లేని ఇతర పదార్థమేదయిన మన శరీరములో ప్రవేశించినప్పుడు కూడా పుట్టుచున్నవి. ఒక పిల్లి చర్మము యొక్క లోతట్టున నుండు భాగము లోనికి కోడి గ్రుడ్డు సొనలోని తెల్లని పదార్థమును గానీ, గోదుమ లోని జిగురు పదార్థమును గాని సూదితో నెక్కిందిన యెడల (Hypodermic Injection) కొద్ది దినములలో నా ప్రదేశములో తెల్ల కణములును ద్రవ పదార్థములును అధికమై మనము చొప్పించిన కొత్త ప్రదార్థ మంతను నీరు వలె కరిగి జీర్ణమై పోవును. శస్త్ర వైద్యము చేయునపుడు శరీరము లోని లోపలి భాగము లందు ఉపయోగించప బడు నారి (Catgut) మొదలగు కుట్టు త్రాళ్ళను కరిగించి జీర్ణము చేయు శక్తి గలవి ఇవియే. మన శరీరములో ప్రవేశించిన ఏ పదార్థము నైనను ద్రవ రూపముగ జేయు గుణము తెల్ల కణముల నుండి యేపుట్టుచున్నదని ఇట్లే తెల్ల కణముల నుండి పుట్టిన పదార్థమలేవో రసమునకు సూక్ష్మ జీవులను చంపు శక్తి గూడ కలిగించు చున్నవనియు నిప్పుడనేక శాస్త్రజ్ఞల యభి ప్రాయము. మన శరీరములో ప్రవేశించిన ఏ పదార్థము తోనైన నెదిరించి, పోరాడు నట్టియు, హరించి వేయు నట్టియు ఈ తెల్ల కణములకు పరి భుక్కణములు (Phagocytes) అనియు, నీ తెల్ల కణముల నుండి పుట్టి రసములో జేరియుండు సూక్ష్మ జీవులను నాశనము చేయు శక్తి గల యితర పదార్థములకు పరభుక్దాతువులు (Alexins) అనియు పేరు. ఈ పరభుక్కణములును పరభుక్దాతువులును సూక్ష్మ జీవులనే గాక సూక్ష్మ జీవుల నుండి పుట్టు విషములను, తేలు, పాము మొదలగు మన విరోధుల వలన కలిగిన సమస్థ విషములను కూడా విరచి వేసి మనలను కాపాడు చుండును. ఇవియే మనకు గల సహజ రక్షణ శక్తికి మూలాధారములు.

శరీర జనిత రక్షణ శక్తి. మార్చు

ఒక్కొక్క వ్వాధి ఒక్కొక్క సారి వచ్చి పోయిన అతరువాత తిరిగి ఈ వ్యాధి మనల నంటదని మశూచకము, ఆటలమ్మ, మొదలగు కొన్ని వ్వాధులను చూచి మన తెలిసి కొని యున్నాము. ఇట్టి రక్షణ శక్తి పుట్టుకలో మనకు సహజముగ వచ్చినది కాదు. కావున నిది కల్పిత రక్షణ శక్తియే యగును. ఇది గాక టీకాలు మొదలగు సాధనముల వలన మనమిప్పుడు కొన్ని వ్వాధులు మన కంటు కొన కుండ జేసికొను చున్నాము. ఇట్టి రక్షణ శక్తియు కల్పిత రక్షన శక్తియే. కొన్ని వ్యాధులు తగిలి కుదిరిన తరువాత నవి తిరిగి యంటవను విధి లేదు. పచ్చ సెగ, న్యూమోనియా యను జ్వరము, సర్పి, చలి జ్వరము మొదలగు నవి ఈ జాతిలోనివే.

కల్పిత రక్షణ శక్తి మార్చు

కల్పిత రక్షణ శక్తి యందు తిరిగి రెండు విధములు ఉన్నాయి. కొన్ని వ్యాధులలో రక్షణ శక్తి కలిగించు పదార్థములను మన శరీరమునందే పుట్టించి వాని మూలమున మనకు రక్షణ శక్తి కలిగింప వచ్చును. దీనికి శరీర జనిత రక్షన శక్తి (Isopathic or Active) యని పేరు. మరికొన్ని వ్యాధులలోని ఈపదార్థములను మనము వెలుపలనే తయారు చేసి వానిని రోగి యొక్క శరీరములో ప్రవేశ పెట్టుట వలన వ్యాధి నుండి రక్షణ శక్తి కలుగు చున్నది. ఇట్టి రక్షణ శక్తి బహిర్జనిత రక్షణ శక్తి (Antitoxic or passive) అని పేరు.

శారీర జనిత రక్షణ శక్తిని మనము కలిగించు నపుడు రోగి యొక్క శరీరములో నొక విధమైన మార్పు గలిగి సాధారణంగా జ్వరము వచ్చును. ఈ సమయమునందు సూక్ష్మ జీవులకు విరోధ కరములగు విరుగుడు పదార్థములు శరీరములో పుట్టును. ఇవి పుట్టి వీని వలన శరీరమునకు రక్షణ శక్తి కలుగుటకు కొన్ని దినములు పట్టును. ఇట్లు కలిగిన రక్షణ శక్తి కొన్ని నెలల వరకు మన శరీరములో నుండును. ఇట్టి రక్షణ శక్తి కలిగించు పదార్థములు మన శరీరములో నుండు కండ, నరము మొదలగు సంహతులను గట్టిగ నంటి పట్టుకొని యుండి శరీరమును కోసి చాల రక్తమును తీసి వేసినను కూడా విడువక అవి శరీరము నంటి రక్షణ శక్తి చూపు చున్నవి. ఇట్లుండ బహిర్జనిత రక్షణ శక్తి కలిగించు నప్పుడు సూక్ష్మ జీవులకు హాని కరములగు విరుగు పదారథములు గుర్రము యొక్క గాని, ఇతర జంతువుల యొక్క గాని శరీరములో పుట్టించి దాని నెత్తురు లోని రసము నెత్తి దానిని రోగి యొక్క నెత్తురు లోనికి బోలు సూది గుండ చర్మము క్రింద టీకా వేయవలెను. ఈ రసముతో కూడా విరుగుడు పదార్థములు రోగి శరీరములో ప్రవేశించి సూక్ష్మ జీవులచే నది వరకే పుట్టి యున్న విషములను విరచి వేయును. ఇది రక్తమునందు కానీ శరీరమునందు గాని, అధిక మగు మార్పును కలుగ జేయదు. దీని వలన రక్షణ శక్తి సామాన్యముగ 15 దినముల కంటే హెఛ్ఛుగ నుండదు. అంటు వ్యాధులలో కొన్ని సూక్ష్మ జీవులుల మూలమునను కొన్ని వాని విషముల మూలమునను రోగిని వధించునని చెప్పియుంటిమి. రక్షణ శక్తి కూడా సూక్ష్మ జీవుల వలన గలుగు అపాయము నుండి రక్షించు శక్తియు, వాని విషములను విరిచి వేయు తగిన రక్షణ శక్తియు అని రెండు విధములగు రక్షణ శక్తి కలిగింప వచ్చుననియు చెప్పియుంటిమి. ధనుర్వాయువు నందు, రోగి శరీరమునందు పుట్టు విషములకు విరుగుడు పదార్థములు, గుర్రము యొక్క నెత్తురు లోని రసములో పుట్టించి ఆ రసమును రోగి యొక్క శరీరములోని కెక్కించి వానివలన సూక్ష్మ జీవుల విషములను విరిచి వేసి రోగము కుదుర్చు చున్నారు. కలరా, టయిఫాయిడు జ్వరములలో నిట్లు గాక వ్వాధి సూక్ష్మ జీవుల చేతనే కలుగుచున్నందున నితర జంతువుల శరీరము లోనికి ఆయా సూక్ష్మ జీవుల నెక్కించి వాని రక్తములో నుండి సూక్ష్మ జీవనాశకమగు రసము తీసి దాని రోగి యొక్క శరీరము లోనికి బోలు సూది గుండ ఏక్కించుదురు. దీని వలన రోగి శరీరము లోని సూక్ష్మ జీవులు చచ్చి రోగికి ఆరోగ్యము కలుగ వచ్చును. ఇందుచే రోగి శరీరములో చచ్చిన సూక్ష్మ జీవులనుండి పుట్టు విష పదార్థములు ఆట్లే యుండి యొకానొప్పడు రోగి కపాయము గలిగింప వచ్చును.

శరీర జనిత రక్షణ శక్తిని గలిగించుటకు నాలుగు విధములగు పద్దతులు గలవు. మార్చు

1.తీవ్రమైనట్టి సూక్ష్మ జీవులు కలిగిన టీగా రసమును శరీరములోనికి గ్రుచ్చి యెక్కించుట చేతను.,

2. జీవముతో నున్నను తీవ్రము తగ్గియున్న సూక్ష్మ జీవులు గల టీకా రసమును శరీరము లోనికి గ్రుచ్చి యెక్కించుట చేతను,

3. జీవము లేని సూక్ష్మ జీవులను అనగా వాని శవములు గల టీకారసమును శరీరము లోనికి గ్రుచ్చి యొక్కించుట చేతను,

4.సూక్ష్మ జీవుల నుండి పుట్టిన విషములు గల టీకారసములను శరీరములోనికి గ్రుచ్చి యొక్కించుట చేతను.

వివిధములగు అంటు వ్వాధులలో వివిధ సాధనముల సాయముచే శరీర జనిత రక్షణ శక్తి కలిగింప వచ్చును.

1. తీవ్రమైనట్టి సూక్ష్మ జీవులు గల టీకా రసమును శరీరములోనికి గ్రుచ్చి యొక్కించుట. మార్చు

ఆనాది నుండియు., మచూచకపు రోగి యొక్క కండల లోనుండు చీము నెత్తి ఇతరుల కంటించి వారి కావ్యాధి కలిగించెడి వారు. అందుచే వారికి కూడా మశూచకము వచ్చును. గాని సామాన్యముగా నిట్టి వారలకు వచ్చు మశూచకము ఇతరులకువచ్చు దాని కంటే తక్కువ తీవ్రముగ నుండెడిది. కాని క్రింద నుదాహరించిన ప్రకార మీ పద్ధతి యొట్లు అనుయుక్తమును అపాయకరము నగునో తెలిసి కొనగలరు. తీవ్రముగ నున్న కలరా మొదలగు సూక్ష్మ జీవులు గల టీకా రసమును చర్మము క్రిందికి బోలుగ నుండు సూదితో నెక్కించి యాయా వ్యాధులకు చికిత్స చేయ వలెనని అనేకులు ప్రయత్నించునున్నారు. కాని ఈ పద్ధతి అంతగా జయ ప్రథము కాలేదు.

2. జీవించి యున్నను తీవ్రము తగ్గి యున్న సూక్ష్మ జీవుల మూలమున శరీర జనిత రక్షణ శక్తి కలిగించు పద్ధతి వెర్రి కుక్క కాటు నందును మశూచకము నందును మిక్కిలి యుపయుక్తముగ నున్నది.

1.సూక్ష్మ జీవుల యొక్క తీవ్రత తగ్గించుటకు అనేక పద్ధతులను అప్పటప్పట శాస్త్రజ్ఞలుపయోగించు చున్నారు. అందు వేడిచే సూక్ష్మ జీవుల తీవ్రము తగ్గించు పద్ధతిని పశువుల దొమ్మ వ్యాధిని నివారించుట కుపయోగింతురు. దొమ్మ సూక్ష్మ జీవులు 55+డిగ్రీలు అనగా మన చేతికి పట్టణంత వేడికి వచ్చు వరకు కాచు నెడల వాని తీవ్రత తగ్గును. ఇట్లీ సూక్ష్మ జీవులు గల టీకా రసమును తగిన మోతాదులుగ నేర్పరచి పశువులకు బోలు సూదితో గ్రుచ్చి చర్మము క్రింది కెక్కించిన యెడల నాపశువులకు సంవత్సరము వరకు దొమ్మ వ్వాధి రాదు. దొమ్మ వ్యాధి తీవ్రముగల ప్రదేశములలో మందలోని పశువుల కన్నిటికి నిట్టి రక్షణ శక్తి కలిగించుట యుక్తము. హంగేరీ దేశములో దొమ్మ వ్యాధి తీవ్రముగ నున్నప్పుడు 16,082 గుర్రములకును, 2,10,750 పశువులకును 11,18,443 గొర్రెలకును ఇట్టి టీకాలు వేయగా అంతకు పూర్వము వేయింటికి 25 చచ్చు మందలో వేయింటికి 5 పశువుల కంటే ఎక్కువ చావలేదు. కాబట్టి దీని యుపయోగము రైతులందరు గుర్తెరిగి లాభమును పొందదగియున్నది.

2. ఏ జంతువు యొక్క రక్తములో నొక జాతి సూక్ష్మ జీవులు చక్కగ పెరుగవో ఆ జంతువున కా జాతి సూక్ష్మ జీవుల నటించి వాని తీవ్రతను తగ్గించుట: ప్రస్తుతము మశూచకము రాకుండ టీకాలు వేయు పద్ధతి దీని నుండి పుట్టినదే. మనుష్యులకు తీవ్రముగ వచ్చు మశూచికము ఆవునకంటు నప్పుడు మిక్కిలి తేలికయ యైనదై పొగుదు మీద కొన్ని పొక్కులుగా కనబడి దాని కేమియును కీడు గలుగ జేయకుండ విడిచి వేయును. ఈ మర్మమును కనిపెట్టినది మొదలు మశూచకమున కిప్పటి పద్ధతిని టీకాలు వేయు నాచార మేర్పడినది.

ఇప్పుడు టీకాలువేయు వాడుక ఎల్లయెడల వ్యాపించి యున్నపుడు దీని విలువ మనకంతగా తెలియక పోవచ్చును. పూర్వ కాలమునందు ప్రప్రథమమున మశూచకమొక దేసమునందు వ్యాపించి నపుడు ఈ పెద్దమ్మవారు ప్రజలకు కలిగించు నాశమును, వికార రూపమును వర్ణింప నలవి కాదు. అమెరికా దేసములో 18 వ శతాద్బ ప్రారంభమున ప్రవేశించి ఒక కోటి ఇరువది లక్షల మంది ఇండియనులలో (Indians) ఆరువది లక్షల మందిని అనగా సగము మందిని తన పొట్టన పెట్టుకొనెను. ఈ వ్వాధి ప్రపంచము లోని మారెమ్మ లోన్నిటిలో భయు భయంకర మైనదై యొక దేశమున నైన విడువక మూల మూలలను వెదకుకొని ప్రవేశము గనెను. టీకాలు వేయుట కని పెట్టక పూర్వము మచూచకము వలని ఉపద్రవము ఎంత హెచ్చుక నుండెనో మనపిప్పు డూహింప జాలము ఆని పూర్వ మొకప్పుడు మశూచకము పడని వానికి తన జీవిత కాలము ప్రతి నిముషమును సందేహాస్పదముగనే యుండెను. 29, 30 వ పటములను జూడుము. చక్కని పిల్ల యని వివాహమాడిన వరునకు పది దినములలో గాడాంధు రాలగు కురూపి తటస్తమగు చుండెను. యువ్వన పతులగు పడుచులను తల్లులు విడిచి పారి పోవలసి వచ్చుచుండెను. పదుగురు అన్నదమ్ములలో చెప్పుకొనుటకు ఒక్కడైనను లేకుండా వంశము నిర్మూల మగు చుండెను. ఇట్టి వ్యాధికి మన యదృష్ట వశమున జెన్నరు (Edvard Jenner) అను నొక ఆంగ్లేయ వైద్యునిచే కని పెట్టబడిన ఈ టీకాల యొక్క విలువ మనకిప్పుడు తెలియక పోవుట ఆశ్చర్యము కాదు.

ఆనాది నుండి చీనా (Chaina) దేశములో మశూచకపు రోగి యొక్క చీమును తీసి మరియొకనికి అంటించి క్రొత్త వారలకు నీ వ్యాధి నంటించుట వాడుకలో నుండెనట. మశూచకపు పొక్కులపై నేర్పడు పొక్కుల నెండ బెట్టి వాని నరగదీసిన గంధముతో టీకాలు వేయు వారలు మొన్న మొన్నటి వరకు నైజాము రాజ్యములో నుండిరని తెలియు చున్నది. ఈ తూర్పు దేశముల నుండియే యితర దేశములకు మశూచకము చీమునుండి టీకా రసమును తీయు పద్ధతి వ్యాపించి యుండ వచ్చును. ఈ వ్యాధిని కలిగించు సూక్ష్మ జీవులు గాలిలో నుండి నెత్తురు లోనికి బహుశః మన ఊపిరి తిత్తుల గుండ ప్రవేశించి వ్యాధి కలుగ జేయును. ఇట్లు గాక శరీరములోని గాయము గుండ నొకనికీ సూక్ష్మ జీవులను అనగా మశుచకపు చీమును ప్రవేశ పెట్టినట్టుడు వానికి మశూచకము వచ్చును గాని తీవ్రము తగ్గి వచ్చును. ఇట్లు చేయుట వలన కొంత మందికి ఉపకారము కలుగుచు వచ్చెను గాని మొత్తము మీద వ్యాధి యొక్క ఉధృతి మాత్రము దేశమునందు తగ్గి యుండ లేదు. దీనికి రెండు కారణము లూహించి యున్నారు.

1. మన మంటించిన వ్యాధి యోకానొకప్పుడు బలమై అది నిరపరాధుడగు వానిని నిష్కారణముగ చంప వచ్చును. మన మంటించు వ్యాధి స్వల్పముగ వచ్చి తేలి పోవునో ఉపద్రవముగ విజృంబించి మ్ర్రింగి వేయునో చెప్పుట కెవ్వరికిని వీలు లేకుండెను. ఎంత చీమును ఎట్టి దశలో అంటించిన రోగికి క్షేమ కరమో తెలిసి కొనుటకు ఆధార మెద్దియు లేక యుండెను.

2. రెండవ యుపద్రవ మేమనగా మశూచక మెన్నడెరుగని ఊరిలోనికి నొకరినెవ్వరి నైనను కాపాడవలెనని మశూచకపు చీమును పంపితిమా అది వానికి ప్రయోజన కారి గాకుండుట యటుండగా ఆ యూరిలో నుండు ఇతరుల నందరకును కొని తెచ్చుకొన్నట్లు ఈ వ్యాధి సంప్రాప్త మగుచుండెను. ఈ రెండు కారణముల చేత ఒకానొక చోట ఇట్టి పద్ధతి వలన కొంరకు ఉపకారము కలుగుచుండినను అది సర్వ జనోపయోగముగ నుండ లేదు. ఇట్టి దినములలో లండనులో నుండు హంటరు (John Hunter) అను ఒక వైద్యుని యొద్ద 1769 వ సంవత్సరములో ఎడ్వర్డు జెన్నరు (Edward Jenner) అను నతడొకడు శిష్యుడుగా ప్రవేశించెను. ఆ కాలములో మశూచకము ఆ దేశమునందు మిక్కిలి ప్రబలి యుండెను. అట్టి సమయమునందు గొల్ల వారలకు ఎందు చేతనో గాని మశూచకము వచ్చు చుండుట లేదు. ఇటు నటు నుండు ఇండ్లలో లెక్క లేకుండా పీనుగలు పడు చిండినను మధ్యనుండు గొల్ల వాని యింటిలో ఎందుచేత నీ అమ్మవారు ప్రవేశింపదో ఎవ్వరికిని తెలియని మాయగ నుండెను. ఒక నాడొక గొల్ల పిల్ల వచ్చి జెన్నరుతో నిట్లనియె. అయ్యా..... నాచేతి మీద పాల పొక్కులు (Cow pox) పొక్కినవి. నాకింక పెద్దమ్మ రాదు. అనెను. ఇది వినిన తోడనే జెన్నరు తన గురువు వద్దకు పోయి అయ్యా ఈ గొల్ల పిల్ల యిట్లని చెప్పెను. దీనికి ఏమి కారణము " అని అడిగెను. అప్పుడు గురువు జెన్నరుతో వూరకే వట్టియూహలు చేయకుము. సత్యమును ఓపికయు విడువకుము. శోధింపుము అనెను. అప్పటి నుండియు ఈ అంశములను మనస్సులో బెట్టుకొని ఎల్లప్పుడును ఆలోచించుచు తన చేతనైనంత వరకు శోధించుచు వచ్చెను గాని రమారమి ముప్పది సంవత్సరముల వరకు దాని నిజము చక్కగా నతనికి చిక్కలేదు. ఈ లోపుగ 1880.వ సంవత్సరములో నొక నాడు అతని స్నేహితునొకనితో ఒంటరిగా ప్రయాణము చేయుచు అతనితో నిట్లనెను. గొల్లవార్లకు పెద్దమ్మవారు రాదని చెప్పిన మాట నిజమైన యెడల వీరలకుండు పొక్కులను ప్రజలకందరకు అంటించి వారికి కూడ పెద్దమ్మ వారు రాకుండ చేయుట సాధ్యము కాకూడాదా? అని చెప్పుచు అతనికి తానిట్లు చెప్పినట్ట్లు ఎవ్వరికిని తెలియనీయ వలదని బ్రతిమాలుకొనెను. ఒక వేళ అందరును ఈ మాటను వినిన యెడల తన్ను వెక్కిరింతురనని జెన్నరుకు భయముగ నుండెను. అయినను అనేక సంవత్సరములు గడిచినను తనకు ఏమియు అంతు చిక్క పోయినను విడువక ఈ విషయమునే తన మనస్సునందుంచు కొని ఊరక ఆలోచించుచుండెను. తుదకు పదియునారు సంవత్సరములు గడచిన పిమ్మట ఒక నాడు జెన్నరు ఒక గొల్లపిల్ల చేతి మీది పొక్కులలోని చీమును కొంచమెత్తి ఒక పిల్లవాని కంటించెను. ఇప్పుడు మనకు టీకాలు వేసి నప్పుడు పొక్కులు పొక్కినట్లు వానికి పొక్కులు పొక్కి అవి రెండు వారములలో మానెను. అటు పిమ్మట కొంత కాలమయిన తరువాత జెన్నరు వానికి మశూచకపు చీమును అంటించెను. కాని ఎన్ని విధముల ప్రయత్నించినను వానికి మశూచకము అంట లేదు. ఇది చూచి జెన్నరు సంత సించి ఇట్లు అనేక మందికి రెండు సంవత్సరముల వరకు మొదట గొల్ల వాండ్ల పొక్కు చీమును దాని పొక్కు మానిన తరువాత పెద్దమ్మ చీమును అంటించుచు అనేకుల మీద శోధనలు చేసెను. టీకాలు చక్కగ అంటిన వారి కెవ్వరికిని పెద్దమ్మ వారు సోకదని అతడు కనిపెట్టెను. ఇది గాక ఈ రెండు వ్వాధులకును ఎదో ఒక విధమయిన సంబంధము గలదనియు బహుశః ఈ రెండు వ్వాధులు ఒకటే వ్వాధి యనియు ఆ వ్వాధి పశువులకు వచ్చినప్పుడు దాని ఉదృతము తగ్గి హాని లేని పొక్కులుగా బయలుదేరి తేలికగా పోవు ననియు ఈ వ్వాధియే మనుష్యులలో ప్రవేశించి నపుడు ఉపద్రవమై భయంకరమైన మారిగా పరిణామము చెందుననియు జెన్నరు ఊహ చేసెను.

పైని వ్రాసినది చదివిన యెడల ఇంతే కదా మహాకార్యము. అని తోచ వచ్చును. కాని లక్షల కొలది కోట్ల కొలది ప్రతి దినమును రూపు మాసి పోవు ఆ దినములలో నితడు చేసిన పరిశ్రమకు యింతింతని వెల గలదా? ప్రపంచము లోని కిరీటాధిపతు లందరు జెన్నరున కప్పుడు దాసోహ. మనిరి. నెపోలియన్ అంతటి వాడు జెన్నరునకు ఏమి యడిగిన నిచ్చెద. ననెనట.

జెన్నరు చూపిన మార్గమున ననుసరించి ఇప్పటి వైద్యులు అనేకములైన అంటు వ్వాధులకు టీకాలు వేయు పద్ధతిని కనిపెట్టి యున్నారు. ఇంక ననేక వ్వాధుల విషయమై యింకను గట్టి ప్రయత్నములు చేస్తున్నారు. దీని కంతకును జెన్నరే మూల పురుషుడు. వందనీయుడగు మహాత్ముడు. జెన్నరు టీకాలు కనిపెట్టిన తరువాత వేల కొలది మైళ్ళదూరములో నున్న అమెరికా మొదలగు ఖండాతరములకు ఈ టీకా రసములను ఎట్లు పంపుట? ఇది అనేక దినములు నిలిచి యుండదుగదా? అని యొక గొప్ప సంశయము కలిగెను. అంతట వారీ క్రింది యుక్తిని పన్నిరి. ఆ కాలములలో పడవలు ఇప్పటివలే యంత్ర శక్తిచే వారముకను వేలకొలది మైళ్ళు పరుగెత్తునవి కావు. అప్పుడొక చిన్న ప్రయాణమనిన ఆరు మాసములు పట్టెడిది. అప్పటి పుణ్యాత్ములు కొందరు దండు కట్టుకొని ఇరువది లేక ముప్పది చంటి బిడ్డలను తగినంత మంది వైద్యులను, దాదులను చేర్చుకొని టీకారసమును కొని పోవుటకు ఖండాంతర ప్రయాణమునకై ఓడ నెక్కుదురు. వారితో కూడా నొకరిద్దరు పిల్లకు టీకాలు వేసి తీసికొని పోవుదురు. ఎనిమిది దినములయిన తరువాత నీ యిద్దరు పిల్లలనుండి మరిద్దరకీ చీమును మార్చుదురు. ఇట్లు వారము వారమునకు మిక్కిలి జాగ్రత్తతో మార్చుకొనుచు వాని బలము తగ్గి పోకుండ నెలల తరబడి కాపాడుచు తమ గమ్యస్థానమును చేరుదురు. ఇట్లా దినములలో ననేక కష్టముల కోర్చి ప్రపంచమంటటకు నీ టీకా రసమును వ్వాపింప జేసిరి.

పెద్దమ్మ వారనిన భయము లేనట్టి ఈ దినములలో టీకాలు వేసి కొనుమనిన మాకు వద్దు వద్దు అని పారి పోవు వారు ఈ చరిత్రనంతయు వినిన తరువాత నట్లు చేయుదురా?

3. విషమును ఆర బెట్టుట వలన దాని తీవ్రమును తగ్గించుట..... ఈ ప్రకారము చేయు చికిత్సలలో వెర్రి కుక్క కాటు నకు చేయునది మిక్కిలి జయ ప్రథముగ నున్నది. ఇది పాస్టరు అను జీవ శాస్త్ర వేత్త మనకు ప్రసాదించిన యమూల్యమైన వరము. 33.వ. పటమును జూడుము. వెర్రి కుక్క కాటు లోని విషమును కలిగించు నిజమైన సూక్ష్మ జీవులింకను సరిగా తెలియ లేదు. అయినను పాస్టరీ వ్వాధి రాకుండ కాపుదలగా నుండు మందు ననేక సంవత్సరముల క్రింతటనే కని పెట్టి ప్రపంచమునకు మహోపకారమును చేసి యున్నాడు. మిక్కిలి తీవ్రమగు పిచ్చి ఎత్తిన చెపుల పిల్లుల వెన్నెముక నడుమలో వెనుపాము అను నరముల త్రాటి నెత్తి దాని ననేక ముక్కలుగ నరికి వేరు వేరు ముక్కలను ఒక దాని కంటే నొకటి ఎక్కువగ ఆరు నట్లు కొన్నింటిని రెండు దినములను, ఇంక కొన్నింటిని 3,4,5,6, మొదలు పది పదునైదు దినముల వరలమగా కడపటి వాని యందలి విషమంతయు నశించి పోవు వరకు ఆర బెట్టుదురు.

వెర్రి కుక్క కరచిన వారలు కూనూరు (Coonoor) నకు పోయినపుడు వారలకు మొదటి దినమున మిక్కిలి బలహీనమయిన కషాయమును అనగా బొత్తిగ విషమును లేకుండా నార బెట్టిన తునకలనుండి ఎత్తిన టీకా రసమును కండ లోనికి సూది గుండ ఎక్కింతురు. దీనికి అతడు తాళుకొనిన పిమ్మట క్రమక్రమముగ నొక నాటి కంటే మరియొకనాడు హెచ్చు మోతాదుల నెక్కించి తుదకెంత హెచ్చయిన విషమునైనను తాళు కొను శక్తి వచ్చు నట్లు చేయుదురు. ఇట్లు ఇరివది దినములలోపల రెండు దినములు మాత్రము ఆరబెట్టిన తునకల నుండి తీసిన టీకా రసమును కెక్కించురు. ఇందుచే పిచ్చి కుక్క కాటు వలన అతని శరీరములో పుట్టు విషమంతయు విరిగి పోయి దాని వలక కుక్క కాటు వలన రాబోవు బాధ ఎంత మాత్రమును లేకుండా పోవును. మెదటనే ఎండ పెట్టకుండ తయారు చేయ బడిన తీక్షణమయిన పచ్చి విషమును ఎక్కించిన యెడల రోగి చచ్చి పోవును. కాని క్రమ క్రమమున శరీరమునకు అలవాటు చేసినప్పుడు ఎంత తీక్షణ మయిన విషమునయినను తాళుకొనగలడు.

ఈ వైద్యము ప్రారంభించిన తరువాత మూడు లేక నాలుగు వారములకు గాని ఈ టీకాలకనుగుణము చక్కగ పట్టునని చెప్పుటకు వీలు లేదు. కాబట్టి కుక్క కరచిన వారలు వెంటనే వైద్యమునకు ప్ర్రారంబించిన గాని ప్రయోజన ముండదు. వ్వాధి రాక పూర్వము చికిత్స చేసి వ్వాధి రాకుండ జేయ వచ్చును. కాని వ్వాధి యొక్క ఉదృతము ప్రారంబించిన తేరువాత కుదుర్చుటకు వీలు లేదు. వెర్రి నక్కలు గరచిన గాని కుక్కలకు వెర్రి యెత్తదని ప్రజల అభిప్రాయము. కాని కుక్కలే దీనికి ముఖ్య కారణములని ఈ క్రింది లెక్కలను బట్టి తెలియగలదు. ఉత్తర హిందూ స్థానములో కాశాలి యను చోట గల వైద్య శాలలో వైద్యము చేసికొనిన వారి సంఖ్యను బట్టి వ్రాయ బడిన ఈ క్రింది సంఖ్యల వలన ఈ విషయము స్పష్టము కాగలదు. 1902 మొదలు 1942 వరకు గల కాలములో 14,730 కుక్కలును, 2,491 నక్కలును, 140 గుర్రములును, 78 పిల్లులును, 71 తోడేళ్ళును, 16 పశువులును, 79 మనుష్యలును కరచుట వలన వెర్రి కలిగినది. దీనిని బట్టి కుక్కలే ఈ వ్వాధికి ముఖ్య కారణములని తెలియగలదు. మన రాజధానిలో వెర్రి కుక్క కాటుకు చికిత్స చేయు ఔషధ శాల కూనూరులో ఉంది. ఈ క్రింది 33 . వ. పటము జూడుము. అక్కడకు పోవు వారలు తాలూకా మేజస్ట్రేటునకు గాని డిస్ట్రిక్టు సర్జనును గాని తమ అభిప్రాయమును తెలిపిన యెడల వారు రోగులకు రైలు చార్జి వగయిరాలిచ్చి సదుపాయము లన్నియు జెప్పుదురు. 3. ఇంతవరకు జీవించి యుండియు తీవ్రము తగ్గిన విషయములచే శరీర జనిత రక్షణ శక్తిని కలిగించుటను గూర్చి చెప్పియున్నాము. ఇక జీవము లేని సూక్ష్మజీవుల కళేబరముల నుండి తీసిన రసమునెత్తి దానితో అంటు వ్వాధులను కుదుర్చు మార్గములను చూపెదము. బ్రతికియున్న సూక్ష్మ జీవులను మన శారీరములోని కెక్కించినప్పుడు ఒకానొకచో అపాయము కలుగ వచ్చును. ప్రాణము లేని సూక్ష్మ జీవుల నుపయోగించునపు డట్టి యపాయముండదు. కొన్ని సూక్ష్మ జీవుల మృత కళేబరముల నుండి కూడా నుపయోగ క్రములగు టీటా రసములను మనము తయారు చేయ వచ్చును. కలారా, టైఫాయిడు జ్వరము, మహామారి (ప్లేగు) క్షయ మొదలగు వ్వాధులందీ పద్ధతి ప్రస్తుతము కొంత వరకుపయోగములో నున్నది.

తీవ్రమైన కలరా సూక్ష్మ జీవులను తగినన్నిటిని సూది గుండ కడుపు లోనికి పిచికారీ చేసిన యెడల చుంచులు, పిల్లులు మొదలగు జంతువులు చచ్చును. కాని కలరా వ్వాధి వచ్చి నెమ్మది అయిన రోగి శరీరమును నుండి కొంచెము రక్తము నెత్తి దాని యందలి రసముతో పైన చెప్పినన్ని కలరా సూక్ష్మ జీవులనే కలిపి యా మిశ్రపదార్థమును ఆ జంతువుల కడుపు లోనికి బోలు సూది గుండ అదే ప్రకారము ఎక్కించి నప్పుడు అవి చావవు. అనగా కలరా సూక్ష్మ జీవుల శక్తి రోగి యొక్క రసము నందుండు విరుగుడు పదార్థములచే నశించి పోయింది. ఈ రసమునందున్న గుణము ఇతర మానవుల రసమునందున్నట్టిది కాదు. కొంత వరకు మనయందుండు రక్తము లోని రసము నందును సూక్ష్మ జీవులను చంపు శక్తి కలదని చెప్పి యున్నాము. అట్టిశక్తి అన్ని జాతుల సూక్ష్మ జీవులను సమానముగా చంపును గాని కలరా వ్యాధి వచ్చి తేలిన రోగి యొక్క రక్తము నందుండు రసము కలరా సూక్ష్మ జీవులను మిక్కిలి వేగముగ చంపును. కావున ఇట్టి వాని రసమునందుండు పదార్థములను కలరా నాశక పదార్థములని చెప్ప వచ్చును. ఇట్లే టైఫాయిడు జ్వరము వచ్చి కుదిరిన వారి నెత్తురులో టైఫాయిడు నాశక పదార్థములును, ప్లేగు వచ్చి, కుదిరిన వారి శరీరములో ప్లేగు నాశక పదార్థములును ఉండును. ఒకటి రెండు వారములు టైఫాయిడు జ్వరము పడిన వారి నెత్తురు నీ టైపాయిడు నాశక పదార్థము లుండుటను బట్టి ఫలానా రోగి యొక్క జ్వరము టైపాయిడు జ్వరము అగునా కాదా యను విషయమును కూడా తెలిసికొన వచ్చును. అనుమానముగ నున్న అరోగి యొక్క రక్తము నుండి ఒకబొట్టు రసమునెత్తి దానిలో కొంచెము టైఫాయిడు సూక్ష్మ జీవులను కలిపి సూక్ష్మ దర్శినిలో పరీక్షించిన యెడల అవి యన్నియు చలనము మాని ముద్దలు ముద్దలుగా కూడు కొనుట చూడ నగును. ఆ రోగి యొక్క జ్వరము టైఫాయుడు జ్వరము కాని యెడల మనము కలిపిన టైఫాయుడు సూక్ష్మ జీవులా రసములో యధేచ్చముగా గంతులు వేయుచు మెలికలు తిరుగుచు పరుగు లెత్తుచుండును. దీనిని బట్టి రోగి జ్వరము టైఫాయిడు జ్వరము అగునా కాదా యని తెలియ నగును.

ఆయా రోగుల నెత్తురు ఆయా జాతి సూక్ష్మ జీవులను చంపు శక్తి నధికముగ పొంది యున్నదను విషయము తెలిసిన తరువాత ఆరోగ్య వంతుల శరీరములో నిట్టి శక్తి మన మెట్లయిన పుట్టింప గలమా యని అనేక్ వైద్యులు ప్రయత్నించిరి. తీవ్రమైన సూక్ష్మ జీవులను మానవుల కంటించుట ఒక్కొక్కప్పుడు అపాయకరము కావున చచ్చిన సూక్ష్మ జీవులనే ఉపయోగింప నగును. ఈ ప్రకారము తయారు చేయ బడిన టీకా రసములు కలరాకును, టైఫాయిడు జ్వరమునకును, ప్లేగు నకును కూడా ప్రస్తుతము మందుల షాపులలో విక్రయిముకు దొరకును.

కలరా టీకారసము: మార్చు

1894 సంవత్సరములలో కలకత్తాలో నీ కలరా టీకా రసమును 36 ఇండ్లలో 521 మందికి ఉపయోగించిరి. అందొక యింటిలో 18 మంది మనుష్యులుండిరి. వారిలో 11 గురికి కలరా టీకాలు వేసిరి. 7 గురికి కలరా టీకాలు వేయలేదు. టీకాలు వేయని 7 గురిలో 4 గురికి కలరావచ్చి ముగ్గురు చనిపోయిరి. టీకాలు వేసిన 11 గురిలో ఒక్కరికి కూడా కలరా రాలేదు. కాని కలరా టీకా రసము వలన పుట్టిన రక్షణ శక్తి టీకాలు వేసినది మొదలు 15 దినముల కంటే హెచ్చు కాలముండదు. అందు చేత ఈ విధమైన చితిత్స సర్వత్ర ఉపయోగించుటకను యుక్తముగ నున్నది.

టైఫాయిడు టీకారసము: మార్చు

టైఫాయిడు టీకా రసమును తగిన మోతాదును చర్మము క్రిందికి పిచికారితో ఎక్కించిన యెడల టైఫాయిడు జ్వరము రాకుండ కొంత వరకు కాపాడును. ఎక్కించిన దినమున 101 లేక 102 దిగ్రీల వరకు జ్వరమును, తలనొప్పియు కొంత భారకింపును కలిగించును. చుట్టు ప్రక్కల నుండు బెళ్లలు కొంచెముబ్బి నొప్పిగ నుండును ఒకానొప్పుడు సీమనుండి హిందూ దేశానికి వచ్చు పటాలములోని సోల్జర్లకందరకును నీ టీకారసమును ఎక్కించెడి వారు. కాని ఈ పద్ధతి యొక్క యుపయోగమును గూర్చి నిర్ధారణగా చెప్పుటకు వీలులేదు.

ప్లేగు టీకా రసము. మార్చు

ప్లేగు సూక్ష్మ జీవులను ఒక నెల వరకు మాంస రసములో పెంచి దానిని తగినంత వరకు కాచి దాని యందలి సూక్ష్మ జీవులను చంపి ఆ రసములో 50 లేక 60 చుక్కలు కండలోనికి ఎక్కించిన ఎడల అట్టి స్థలమునందు కొంచెము వాపును నొప్పియు కలిగి కొద్ది పాటి జ్వరము వచ్చును. ఇట్టి వారలకు ఎనిమిది లేక పది రోజులు గడచిన పిమ్మట తిరిగి ఇంక కొంచెము హెచ్చు మోతాదుగల టీకా రసమును ఎక్కించిన యెడల వారలకు సామాన్యముగ అనేక నెలల వరకు ప్లేగు వ్వాధి రాదు. బొంబాయిలో అధికముగ ప్లేగు వచ్చి యున్నప్పుడు అక్కడి జెయిల లోని 154 గురు జనులకు ప్లేగు టీకాలు వేసిరి. 177 గురు టీకాలు లేక యుండిరి. టీకాలు వేసిన వారిలో నొక్కడును ప్లేగుచే మృతి నొంద లేదు. కాని టీకాలు వేసికొనని వారిలో 14 గురికి ప్లేగు వచ్చి ఆరుగురు మృతి నొందిరి. కాబట్టి ఈ ప్లేగు టీకాలను వ్యాధి ముమ్మరముగ గలయన్ని చోట్లను వైద్యులకును పరిచారలకులనును సేవకులకును నిర్బంధముగ వేయవలెను. ప్రజలకు కూడా ఈ టీకాల ఉపయోగమును గూర్చి బోధించి సర్వత్ర వ్వాపించు నట్లు ప్రోత్సాహ పరచ వలెను.

క్షయ టీకారసము: మార్చు

దీనిని ప్రస్తుతము పెద్ద పట్టణములన్నిటి యందును వైద్యులుపయోగ పరుచు చున్నారు. ఇందు రెండు విధముల టీకా రసములు గలవు.

1. క్షయ సూక్ష్మ జీవులను చంపి వాని శరీరములో నుండు విషములను వేడి నీళ్లు గ్లిసరిన్ మొదలగు ద్రావకములతో కలిపి విడదీసి ఆ విషములను ద్రవ రూపముగ శరీరము లోనికి ఎక్కించుట.

2. క్షయ సూక్ష్మ జీవులను మెత్తగ నూరి పొడిగా జేసి ఆ పొడుని పరిశుభ్ర మయిన నీటిలో కలిపి ఆ నీటిని తగు మోతాదులతో చర్మము క్రింద ఎక్కించుట. ఇట్టి టీకాల వలన మన శరీరములో సూక్ష్మ జీవులకు అపకారులగు తెల్ల కణములును విరుగుడు పదార్థములును వృద్ధియై అవి శరీరమునకు రక్షణ శక్తిని హెచ్చు చేయును. నిజముగ కుదిరినదని చెప్పుటకు సామాన్యముగ రెండు సంవత్సరముల వరకీ విధమయిన చితిత్స చేయ వలెను.

క్షయ టీకా రసము ఇతరుల యందు కంటే క్షయ రోగులయందు నొప్పి, వాపు, జ్వరము, మొదలగు గుణములను కలిగించును. దీనిని బట్టి ఒకానొక రోగి క్షయ రోగి యగునా, కాదా అను విషయమును గుర్తించుటకు తగిన మార్గములు ఏర్పరచి యున్నారు. టీకా వేసిన చోట వాపు, ఎరుపు మొదలగునవి కలిగిన ఎడల నా రోగికి క్షయ వ్వాధి యున్నట్టును గ్రహింప వలెను.

 
ఏడ్వర్ద్ జెన్నర్
 
లూయీ పాచ్చరు

మచూచకము రాకుండ వేయు టీకాలను కనిపెట్టిన మహా పురుషుడు 1749 వ సంవత్సరము మేనెల 17 అ తేదీన జననము. మరణము: 1623 వ సంవత్సరము జనవరి 26వ తేది.