రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్


రడిస్సన్ బ్లూ హోటల్ (అర్మేనియన్:Ռեդիսոն Բլու Հոթել Երևան), ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఉన్న ఒక 5-స్టార్ ఉన్నతమైన లగ్జరీ హోటల్. దీని కార్యకలాపాలు రడిస్సన్ హోటల్స్ కింద రడిస్సన్ బ్లూ బ్రాండ్ తరపున జరుగుతాయి. ఈ హోటల్ని 2005 లో మొదటిగా  గోల్డెన్ ప్యాలెస్ యెరెవాన్ గా ప్రారంభించారు. తరువాత, 2014, 2016 మధ్య హోటలును పూర్తిగా పునరుద్ధరించి  విస్తరించారు. దీనిని చివరకు 2016 జూలైలో రేడిసన్ బ్లూ హోటల్, యెరెవాన్ గా పునఃప్రారంభించారు.[1]

రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్
Radisson Blu Hotel, Yerevan616.jpg
రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్
రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్ is located in Armenia
రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్
Location within Armenia
సాధారణ సమాచారం
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
భౌగోళికాంశాలు40°11′49″N 44°31′8″E / 40.19694°N 44.51889°E / 40.19694; 44.51889
ప్రారంభం2005 (గోల్డెన్ ప్యాలెస్)
2016 (రడిస్సన్ బ్లూ)
యజమానిగోల్డెన్ ప్యాలెస్ ఎల్.సి.సి
యాజమాన్యంరడిస్సన్ హోటల్స్
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య7
ఇతర విషయములు
గదుల సంఖ్య142
సూట్ల సంఖ్య19
రెస్టారెంట్ల సంఖ్య2
పార్కింగ్ఉన్నది
జాలగూడు
Official website

ఈ హోటల్ కనాకర్-జేత్యున్ జిల్లాలోని 2/2 లిబర్టీ అవెన్యూ పై ఉన్నది. ఇది యెరెవాన్ కోన మెట్లదారి దగ్గర విక్టరీ పార్కులో ఉంది.

చరిత్రసవరించు

31 మే 2005 న, గోల్డెన్ ప్యాలెస్ హోటల్ ను ప్రారంభించారు, ఇది యెరెవాన్ విక్టరీ పార్కులో ఒక భాగాన్ని ఆక్రమించింది. ఈ హోటల్ ను నిర్మించడానికి దాదాపుగా వెయ్యి చెట్లను తొలగించారు. ప్రారంభోత్సవ సమయంలో, ఈ హోటల్ లో 66 అతిథి గృహాలు ఉన్నాయి. హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పటి ప్రెసిడెంటు రాబర్ట్ కొచారిన్ హాజరయ్యారు.

2014 వ సంవత్సరంలో, పునరుద్ధరణ, విస్తరణ పనుల కోసం హోటల్ ను తాత్కాలికంగా మూసివేయబడింది. జూలై 2016 12 వ తేదీన, పునర్నిర్మించిన హోటల్ ను రడిస్సన్ బ్లూ హోటల్ పేరుతో పునఃప్రారంభించారు, దాని పనితీరును రడిస్సన్ హోటల్స్ సంస్థ పరివేక్షిస్తుంది. యారేవాన్ మేయరు తారోన్ మార్గారియన్ తో కలిసి ప్రెసిడెంట్ సెర్జ్ సర్గ్సయన్ ప్రారంభ వేడుకకు హాజరయ్యారు.[2]

ప్రత్యేకతలుసవరించు

 
2008 లో పునరాభివృద్ధికి ముందు హోటల్

హోటల్ లో 142 అతిథి గృహాలు ఉన్నవి, వీటిలో 19 సూట్లు (రాయల్, ప్రెసిడెన్షియల్, అంబాసిడర్ సూట్లు).[3] ఈ హోటల్ లో 6 సమావేశ మందిరాలు, ఒక ఆరోగ్య, స్పా సెంటరు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఒక బహిరంగ టెన్నిస్ కోర్టు ఉన్నాయి.

ఈ హోటల్ లో అనేక రకముల రెస్టారెంటులు ఉన్నవి, "యాడ్ ఆస్ట్రా" పైకప్పు రెస్టారెంట్, బార్, "రెస్టారెంట్ లార్డర్ అండ్ సమ్మర్ పార్క్", "డార్చిన్" రెస్టారెంట్, కాఫీ షాపుల ద్వారా అనేక రకాల వంటకాలను ఈ హోటల్ ఇక్కడి అతిథులకు అందజేస్తుంది. "హవానా క్లబ్" సిగార్ బార్, లాబీ లాంజ్, బార్ కూడా ఈ హోటల్ లో ఉన్నవి.

సూచనలుసవరించు

బాహ్య లింకులుసవరించు