రతికా రామస్వామి

రతికా రామస్వామి, భారతీయ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్. రతికా ఢిల్లీలో  ఉంటూ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తుంటారు.[2] ఆమె తీసిన ఛాయాచిత్రాలు ఎన్నో ప్రశంసాలు పొందాయి.[1][3] ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మొట్టమొదటి భారతీయ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ గా పేరు పొందారు రతికా. ఆమె తీసిన ఛాయాచిత్రాలు ఎన్నో ప్రశంసాలు పొందాయి.[4]

రతికా రామస్వామి
జననం
వెంకటాచలపురం, తెని, తమిళనాడు, భారతదేశం[1]
జాతీయతభారతీయుడు
వృత్తివన్యప్రాణి ఫోటోగ్రాఫర్

జీవిత చిత్రణసవరించు

 
మలబార్ గ్రే హార్న్ బిల్, పశ్చిమ కనుమలుకు చెందిన స్థానిక పక్షి.
 
రెడ్-వాటెల్డ్ లాప్ వింగ్

1999లో పెళ్ళి అయిన దగ్గర్నుంచీ ఢిల్లీలో ఉంటున్నారు రతికా.[5] కంప్యూటర్ ఇంజినీరింగ్ లో బిటెక్ చదివిన రతికా, ఎంబిఏ కూడా చదువుకున్నారు. ఫుల్ టైం ఫోటోగ్రాఫర్ గా మారకముందు ఆమె చాలా కాలం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు.[6]

ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ అయిన తన బంధువు మొదటిసారి రతికాకు కెమెరా బహుమతి ఇచ్చారు. ఆ కెమెరాతో ఆమె మొదట్లో చెట్లు, పువ్వులను ఫోటోలు తీసేవారు.[6] 2003లో భరత్ పూర్ లోని కొయిలడో జాతీయ పార్కును సందర్శించినపుడు అక్కడ ఉన్న పక్షులను ఫోటో తీశారు.[7] మొదట్లో ఆమె తీసే ఫోటోల్లో నైపుణ్యం పెద్దగా ఉండకపోయినా, తరువాత తనను తాను చాలా అభివృద్ధి చేసుకున్నారు. ఆమె ఎక్కువగా ఓఖ్లా పక్షి అభియారణ్యానికి వెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ వివిధ రకాలైన పక్షుల ప్రవర్తన, వైఖరి గమనించేవారు. ఆ తరువాత కొన్నాళ్ళకు వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ ను మలచుకున్నారు. కెన్యా, టాంజేనియా వంటి దేశాల్లోని జాతీయా పార్కులను సందర్శించారు.[7]

సెప్టెంబర్ 2005న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన "క్లీన్ గంగా కాంపైన్"లో ఆమె ఛాయాచిత్రాలను ప్రదర్శించారు.[8] ఆమె తీసిన పక్షుల చిత్రాలతో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 2007 క్యాలండర్ ను విడుదల చేసింది.[1] 2008లో "ది బర్డ్స్ ఆఫ్ ఇండియా" రతికాను టాప్ 20 ఉత్తమ భారతీయ ఫోటోగ్రాఫర్ గా గుర్తించింది. ఈ అరుదైన గౌరవం దక్కిన ఏకైక మహిళ ఆమే కావడం విశేషం.[6][9] వన్యప్రాణి ఎగ్జిబిషన్స్ లో పాల్గొనడంతో పాటు, ఆమె వన్యప్రాణి ఫోటోగ్రఫీపై వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తూంటారు.[3][5][8]

ఫోటోగ్రఫీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ స్థాపకుల్లో రతికా ఒకరు.[6]

రచనలుసవరించు

ది బెస్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ మూమెంట్స్ అనే పుస్తకం రాసి, 2014లో ప్రచురించారు.[3][8]

పురస్కారాలుసవరించు

 • 2015: ఇన్స్పైరింగ్ ఐకాన్ అవార్డ్, సత్యభామ విశ్వవిద్యాలయం, చెన్నై[3][8]
 • 2015: అంతర్జాతీయ కెమెరా ఫెయిర్(ఐసిఎఫ్) పురస్కారం[3]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 "About Rathika Ramasamy". Nikonschool.in. Retrieved 21 May 2016.
 2. Sanjeevi, Kaviya. "A Lens View of the Wild". The New Indian Express. Retrieved 16 May 2016.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 "Rathika Ramasamy". Shillongphotofestival. Archived from the original on 4 జూన్ 2016. Retrieved 1 May 2016.
 4. Vijay, Hema. "Pretty wild by nature". Deccan Herald. Retrieved 16 May 2016.
 5. 5.0 5.1 "Bird woman: She shoots to conserve". Rediff.com. 24 March 2015. Retrieved 1 May 2016.
 6. 6.0 6.1 6.2 6.3 Kavitha, S. S. (27 January 2011). "Off the beaten track". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 16 May 2016.
 7. 7.0 7.1 Shrikumar, A. (6 August 2014). "Wooing the woods". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 16 May 2016.
 8. 8.0 8.1 8.2 8.3 "Rathika Ramasamy". SIENNA International Photo Awards. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 21 May 2016.
 9. "Birds of India: Indian Bird Photographers: Rathika Ramaswamy". www.kolkatabirds.com. Archived from the original on 9 మే 2016. Retrieved 16 May 2016.