రన్ లోలా రన్ (1998 సినిమా)
రన్ లోలా రన్ 1998, ఆగష్టు 20న విడుదలైన జర్మన్ చలనచిత్రం. టామ్ టైక్వెర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోలాగా ఫ్రాంకా పోటేంట్, మన్నీగా మొరిట్జ్ బ్లీబ్ట్రూ నటించారు. పోగొట్టుకున్న డబ్బును కనిపెట్టడంతోపాటు, ప్రియుడిని కాపాడుకోవడం కోసం ఒక మహిళ చేసే పరుగు నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రం 55వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి, గోల్డెన్ లయన్ అవార్డు కోసం పోటీపడింది.[3]
రన్ లోలా రన్ | |
---|---|
దర్శకత్వం | టామ్ టైక్వెర్ |
రచన | టామ్ టైక్వెర్ |
నిర్మాత | స్టీఫన్ అర్న్ద్ట్ |
తారాగణం | ఫ్రాంకా పోటేంట్, మొరిట్జ్ బ్లీబ్ట్రూ, హెర్బర్ట్ కన్నాప్, నినా పెట్రి, జోచిం క్రోల్, అర్మిన్ రోడ్, హీనో ఫెర్చ్, సుజానే వాన్ బోర్సొడి, సెబాస్టియన్ స్కిప్పర్ |
Narrated by | హన్స్ పేష్చ్ |
ఛాయాగ్రహణం | ఫ్రాంక్ గిరీబ్ |
కూర్పు | మాథిల్డే బోనీఫాయ్ |
సంగీతం | టామ్ టైక్వెర్, జానీ క్లేమేక్, రైన్హోల్డ్ హెయిల్ |
పంపిణీదార్లు | ప్రొకినో ఫిలింవర్లీహ |
విడుదల తేదీ | 20 ఆగస్టు 1998 |
సినిమా నిడివి | 80 నిముషాలు[1] |
దేశం | జర్మనీ |
భాష | జర్మన్ |
బడ్జెట్ | $1.75 మిలియన్[2] |
బాక్సాఫీసు | $22.9 మిలియన్[2] |
ఇది 71వ ఆస్కార్ అవార్డులలో జర్మనీ నుండి ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంట్రీగా ఎంపికైంది, కానీ నామినేట్ చేయబడలేదు.[4][5] ఈ చిత్రం 1999, డిసెంబరు 21న డివిడిలలో, 2008, ఫిబ్రవరి 19న బ్లూ రేలో విడుదలైంది.
కథ
మార్చులోలా ప్రియుడు మన్నీ వృత్తిలో భాగంగా యజమానికి కొంత డబ్బును ఇవ్వడం కోసం ట్రైన్‌లో వస్తున్న తరుణంలో పోలీసులకు భయపడి ఆ డబ్బుని అక్కడే వదిలేసి పారిపోతాడు. ఆ డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బాస్ మన్నీని బెదిరిస్తాడు. ఆ డబ్బుని బాస్‌కి ఇవ్వడం కోసం మన్నీ చేసే ప్రయత్నాల్లో ప్రియురాలు లోలా ఎటువంటి సాహసం చేసిందనేదే ఈ కథ.[6]
నటవర్గం
మార్చు- ఫ్రాంకా పోటేంట్
- మొరిట్జ్ బ్లీబ్ట్రూ
- హెర్బర్ట్ కన్నాప్
- నినా పెట్రి
- అర్మిన్ రోడ్
- జోచిం క్రోల్
- లడ్జర్ పిస్టర్
- సుజానే వాన్ బోర్సొడి
- సెబాస్టియన్ స్కిప్పర్
- జూలియా లిన్డిగ్
- లార్స్ రుడోల్ఫ్
- ఉటె లూబాష్
- మోనికా బ్లీబెట్రూ
- హీనో ఫెర్చ్
- హన్స్ పేష్చ్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: టామ్ టైక్వెర్
- నిర్మాత: స్టీఫన్ అర్న్ద్ట్
- రచన: టామ్ టైక్వెర్
- వ్యాఖ్యానం: హన్స్ పేష్చ్
- సంగీతం: టామ్ టైక్వెర్, జానీ క్లేమేక్, రైన్హోల్డ్ హెయిల్
- ఛాయాగ్రహణం: ఫ్రాంక్ గిరీబ్
- కూర్పు: మాథిల్డే బోనీఫాయ్
- నిర్మాణ సంస్థ: ఎక్స్- ఫిల్మ్ క్రియేటివ్ పూల్, డబ్ల్యూ.డి.ఆర్., ఆర్టే
- పంపిణీదారు: ప్రొకినో ఫిలింవర్లీహ
ఇతర వివరాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Run Lola Run (15)". British Board of Film Classification. 21 June 1999. Retrieved 12 March 2019.
- ↑ 2.0 2.1 "Run Lola Run". The Numbers. Archived from the original on 29 నవంబర్ 2014. Retrieved 12 March 2019.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "55th Venice Film Festival 1998 - FilmAffinity". FilmAffinity (in ఇంగ్లీష్). Retrieved 13 March 2019.
- ↑ Margaret Herrick Library, Academy of Motion Picture Arts and Sciences
- ↑ "45 Countries Submit Films for Oscar Consideration". Academy of Motion Picture Arts and Sciences. 19 నవంబరు 1998. Archived from the original on 19 ఫిబ్రవరి 1999. Retrieved 2 ఏప్రిల్ 2022.
- ↑ నవతెలంగాణ, షో-స్టోరి (4 July 2015). "కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జర్మన్ చిత్రాలు". Archived from the original on 13 March 2019. Retrieved 13 March 2019.
- ↑ Flippo, Hyde. "Run Lola Run Berlin Locations, Photos". German language. Dotdash. Archived from the original on 2 డిసెంబరు 2002. Retrieved 13 మార్చి 2019.