రమేష్ లట్కే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రమేష్ లట్కే

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – మే 11, 2022
ముందు సురేష్ శెట్టి
నియోజకవర్గం అంధేరి తూర్పు

వ్యక్తిగత వివరాలు

జననం 1970 ఏప్రిల్ 21
భారతదేశం
మరణం 2022 మే 11(2022-05-11) (వయసు 52)
దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
జాతీయత  Indian
రాజకీయ పార్టీ శివసేన
నివాసం ముంబై

రాజకీయ జీవితం

మార్చు

రమేష్ లట్కే శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997 నుండి 2012 వరకు బృహన్​ ముంబై మునిసిపల్​ కార్పొరేషన్​కు(బీఎంసీ)కు మూడుసార్లు కార్పొరేటర్‌గా పని చేశాడు.[1] ఆయన ఆ తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్​ షెట్టిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3] రమేష్ లట్కే 2019లో అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి ఎం. పటేల్​పై వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

రమేష్‌ లట్కే కుటుంబంతో కలిసి దుబాయ్‌కు విహారయాత్రకు వెళ్లిన ఆయన 2022 మే 11న గుండెపోటుతో దుబాయ్‌లో మరణించాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Brihanmumbai Municipal Corporation 2007 winner list". Archived from the original on 2017-11-18. Retrieved 2022-06-07.
  2. "Shiv Sens MLAs in 2014". Archived from the original on 2015-09-12.
  3. "Sitting and previous MLAs from Andheri East Assembly Constituency". Archived from the original on 2022-05-12. Retrieved 2022-06-07.
  4. "Andheri East 2019 MLA".
  5. 10TV (12 May 2022). "విహారయాత్రలో విషాదం..దుబాయ్ ట్రిప్ కు వెళ్లిన ఎమ్మెల్యే హాఠాన్మరణం..!" (in telugu). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. The Hindu (12 May 2022). "Shiv Sena MLA Ramesh Latke dies of cardiac arrest in Dubai" (in Indian English). Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)