రమ గోవిందరాజన్
రమ గోవిందరాజన్, భారతీయ శాస్త్రవేత్త. ఆమె భౌతిక శాస్త్ర విభాగమైన ప్రవాహి గతిశాస్త్రం (ఫ్లూయిడ్ డైనమిక్స్)లో కృషి చేసింది. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ లోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసారు. [1] ప్రస్తుతం హైదరాబాదు లోని టి.ఐ.ఎఫ్.ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిఫ్లినరీ సైన్సెస్ నందు ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. [2] ఆమెకు 2007 లో శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం లభించింది.
జననం | |
---|---|
నివాసం | హైదరాబాదు |
జాతీయత | భారతీయులు |
మాతృ సంస్థ | IIT, Delhi Drexel University, Philadelphia IISc Bangalore |
పర్యవేక్షకుడు | రొద్దం నరసింహ |
విద్య
మార్చుఅమె 1984లో ఐ.ఐ.టి., ఢిల్లీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) లో పట్టాను పొందారు. ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఫిలడెల్ఫియా లోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసారు. ఆమె 1994 లో బెంగళూరు నందు గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఆరోస్పేస్ ఇంజనీరింగ్ లో పి.హెచ్.డి చేసారు. ఆమె కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 1994 నుండి ఆరోనాటిక్స్ పోస్టు డాక్టరల్ రీసెర్చ్ విభాగంలో పనిచేయుచున్నారు. [3]
కెరీర్
మార్చుఆమె శాస్త్రవేత్తగా తన జీవితాన్ని బెంగళూరు లోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లోని ప్రవాహి గతిశాస్త్ర విభాగంలో ప్రారంభించారు. అక్కడ 1988 నుండి 1998 వరకు ఒక దశాబ్దం పాటు పనిచేసారు. తరువాత ఆమె 1998 నుండి 2012 వరకు జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగంలో ఫాకల్టీ సభ్యురాలిగా పనిచేసారు. 2012 నుండి ఆమె టిఐఎఫ్‌ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ఆమె తన ప్రత్యేక రంగమైన ప్రవాహి గతిశాస్త్రంలో అనేక సాంకేతిక పత్రాలను ప్రచురించారు. కొన్ని పుస్తకాలను కూడా ప్రచురించారు. ఆమె ప్రధాన పరిశోధన ఆసక్తులు అస్థిర ప్రవాహాల కల్లోలభరితతకు, అస్థిరతకు, ఇంటర్ఫేషియల్ ప్రవాహాల భౌతిక శాస్త్రానికి సంబంధించినవి.[4][5]
పురస్కారాలు
మార్చుఆమెకు అనేక పురస్కారాలు వచ్చాయి. అందులో ప్రసిద్ధమైనది 2007 లో శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం. 1987 లో ఆమెకు యంగ్ సైంటిస్టు పురస్కారం, 1996 లో అవుట్ స్టాండింగ్ సైంటిస్టు పురస్కారం, 2004 లో సి.ఎన్.రావు ఓరేషన్ పురస్కారాలు లభించాయి. [6]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-03-20. Retrieved 2018-01-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-22. Retrieved 2018-01-11.
- ↑ "Rama Govindarajan". Archived from the original on 22 నవంబరు 2016. Retrieved 15 March 2014.
- ↑ "Noted Women Scientists of India – an attempt at enumeration". Retrieved 15 March 2014.
- ↑ "Lilavati's Daughters:Dream Your Dream" (PDF). Retrieved 15 March 2014.
- ↑ "Shanti Swarup Bhatnagar prize for the year 2007 & 2008". Retrieved 15 March 2014.