భారత గూడచారి విభాగమైన రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ ( రా ) కు నూతన అధిపతిగా సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ( ఐపీఎస్) అధికారి రవి సిన్హా నియమితుడయ్యాడు.[1]. రవి సిన్హా నియామకాన్ని మంత్రిమండలి నియామకాల కమిటీ ఆమోదించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 1988 బ్యాచ్ కు చెందిన సిన్హాను రా చీఫ్ గా నియమిస్తూ 2023 జూన్ 19వ తేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది[2]. బాధ్యతలు చేపట్టిన తేదీ నుండి 2 సంవత్సరాల పాటు లేదంటే తదుపరి ఉత్తర్వుల వరకు ... ఇందులో ఏది ముందైతే అంతవరకు ఆయన రా చీఫ్ పదవిలో కొనసాగుతారు[3]. విదేశాలలో అత్యంత కీలకమైన '' కార్యక్రమాలను ఈ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ' రా ' నిర్వహిస్తూ ఉంటుంది. భారత ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రతిభావంతుడుగా ఈయనకు పేరుంది[4]. పొరుగు దేశాలలో జరిగే పరిణామాలపై పట్టుంది. ముఖ్యంగా ఈయన జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారత్ వామపక్ష తీవ్రవాదంపై పనిచేశారు.

మూలాలు

మార్చు
  1. "RAW Chief: భారత నిఘా విభాగానికి అధిపతిగా రవి సిన్హా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?". Samayam Telugu. Retrieved 2023-08-30.
  2. "Ravi Sinha: రిసెర్చ్ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(RAW) అధిపతిగా రవి సిన్హా నియామకం". Sakshi Education. Retrieved 2023-08-30.
  3. "New RAW Chief: 'రా' అధిపతిగా రవి సిన్హా". EENADU. Retrieved 2023-08-30.
  4. telugu, NT News (2023-06-19). "Ravi Sinha | RAW నూతన చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవి సిన్హా నియామకం". www.ntnews.com. Retrieved 2023-08-30.