రవీంద్రనాథ్ టాగూర్ రచనలు

రవీంద్రనాథ్ టాగూర్ రచనలలో కవితలు, నవలలు, చిన్న కథలు, నాటికలు, పెయింటింగులు, డ్రాయింగులు, సంగీతం ఉన్నాయి. వాటిలో చిన్న కథలకు చాలా ప్రాముఖ్యం ఉంది. సాధారణ మానవుల జీవితాలలో జరిగే వృత్తాంతాలు ఈ చిన్న కథలలో దాగి ఉంటాయి. బంగ్లాలో ఈ ప్రక్రియను సృష్టంచిన ఘనత కూడా ఆతనికే దక్కుతుంది. ఆతని రచనలలో ఆశావాదం కనపడుతుంది.

బెంగాలీ 'ర','థ' అక్షరాలతో చేసిన టేగోర్ సంతకపు చెక్క సీల్

నాటికలు

మార్చు

పదహారు సంవత్సరాల వయస్సులో మొదలు తన సోదరుడు జ్యోతిరీంద్రనాథ్ టాగూర్ రచించిన బూర్జువా నాగరికుడు (16 వ శతాబ్దపు ఫ్రెంచి రచయిత మోలియే రచించిన లా బూర్జువా జెంటిల్హోమ్ ఆధారంగా) నాటికలో ముఖ్య పాత్రతో తన నట జీవితాన్ని మొదలు పెడతాడు. 20 సంవత్సరాల వయస్సులో వ్రాసిన వాల్మీకి ప్రతిభ ఆతని మొదట స్వీయరచిత నాటకం. ఇది టాగూర్ భవనంలో చూపబడింది. టాగూర్ గా చెప్పబడుతుంది. ఆ తరువాత రచించిన నాటకాలు, తత్త్వ, శాస్త్ర, రూపక భావాలు కలిగి ఉంటాయి. 1912 లో రచించిన ఢాక్ ఘర్ ("పోస్టాఫీసు") కు లండన్, బెర్లిన్, పారిస్ ల నుంచి ఉన్మాద రివ్యూలు వచ్చాయి. టాగూర్ నాటకం ఛండాలిక గౌతమ బుద్దుని శిష్యుడు ఆనంద ఒక ఆదివాసి యువతిని నీళ్ళు అడిగిన వైనాన్ని వివరిస్తున్నాయి.

రచనల జాబితా

మార్చు

మూలాలు

మార్చు