రవ్వ దోసె ఒక విధమైన గోధుమ రవ్వతో చేసిన దోసె.

రవ్వ దోసె

కావలసిన పదార్థాలు

మార్చు
  • బియ్యపుపిండి... పావు కేజీ
  • మైదా... అర్థపావు కేజీ
  • బొంబాయి రవ్వ... అర్ధపావు కేజీ
  • జీలకర్ర... ఒక చెంచా
  • ఉప్పు... సరిపడా
  • నెయ్యి లేక నూనె... సరిపడా

తయారీ విధానం

మార్చు
  • మైదాను, బొంబాయి రవ్వను శుభ్రపరచుకొని, ఒక గిన్నెలో పోసి, బియ్యం పిండిని కూడా వేసి నీళ్ళు పోసి పిండిని గరిట జారుగా (పలుచగా) కలుపుకోవాలి. దీన్ని నాలుగు గంటల సేపు నానబెట్టాలి.
  • తరువాత పొయ్యిమీద పెనం పెట్టి కాలనియ్యాలి.
  • నానిన పిండిలో ఒక టీస్పూను జీలకర్ర, సరిపడా ఉప్పువేసి బాగా కలపాలి
  • పెనం మీద ఒక టీస్పూను నూనె వేస్తూ కలిపిన పిండి పోసి పలుచగా నెరపాలి.
  • కాలే దోశె మీద మళ్ళీ ఒక చెంచా నూనె వేసి, దోశెను తిరగవేసి తీసి... లేత గోధుమ రంగు వచ్చేవరకు వేపాలి.
  • దీనికి సైడ్‌డిష్‌గా కొబ్బరి పచ్చడి మొదలైన వాటితో తింటే చాలా బాగుంటుంది.

మూలాలు

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=రవ్వ_దోసె&oldid=3888627" నుండి వెలికితీశారు