రవ్వ పులిహోర

కావలసిన పదార్థాలు

మార్చు
  • రవ్వ - ఒక కప్పు,
  • పచ్చిమిరపకాయలు - 5,
  • పల్లీలు - పావు కప్పు,
  • కరివేపాకు - నాలుగు రెమ్మలు,
  • నిమ్మకాయలు - 2,
  • ఎండు మిరపకాయలు - 2,
  • శనగపప్పు - 2 చెంచాలు,
  • మినపప్పు - ఒక చెంచా,
  • ఆవాలు - అర చెంచా,
  • జీలకర్ర - అర చెంచా,
  • పసుపు - పావు చెంచా,
  • ఉప్పు- తగినంత
  • నూనె - తగినంత

తయారీ

మార్చు
  1. రెండు కప్పుల నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, పసుపు వేయాలి. దీంట్లో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి.
  2. ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో వేసి పక్కన పెట్టాలి.
  3. కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేగాక పల్లీలు వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత శనగ పప్పు, మినప పప్పు వేసి వేగనివ్వాలి.
  5. దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి. కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వలో కలపాలి.
  6. ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేస్తే. వేడి.. వేడి.. రవ్వ పులిహోర తయార్
  7. దీన్ని చల్లార్చి, రెండుగంటల తర్వాత వడ్డిస్తే రుచికరంగా ఉంటుంది.