గోధుమ లడ్డు
(రవ్వ లడ్డు నుండి దారిమార్పు చెందింది)
గోధుమ లడ్డు లేదా రవ్వ లడ్డు చాలా రుచిగా ఉంటుంది. శనగపిండితో చేసిన లడ్డు కంటే అతి సులువుగా చేసుకోవచ్చు.
మూలము | |
---|---|
మూలస్థానం | దక్షిణ ఆసియా |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | ఎర్రని గోధుమలు, ఏలకులు,చక్కెర |
వైవిధ్యాలు | శనగపిండి , |
ఇతర సమాచారం | పండగలు లేదా మతపరమైన కార్యక్రమాలు |
కావలసిన పదార్ధాలు
మార్చుతయారుచేయు విధానం
మార్చు- ఎర్రగోధుమలు శుభ్రంచేసి బూరెల మూకుడులో వేసి దోరగా వేయించాలి. ఈ గోధుమలను తిరగలిలో విసరాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వగా కాకుండా మధ్యస్తంగా ఉండాలి.
- చక్కెర తిరగలిలో పోసి మెత్తగా విసురుకోవాలి.
- ఏలకులు పొడి చేసుకొని, ఎండుద్రాక్షలు ఈ గోధుమపిండి, చక్క్రెరపొడితో బాగా కలిపాలి.
- ఈ మిశ్రమంలో రెండు చెంచాల పాలు గాని, నెయ్యి గాని వేసి కలిపితే చక్కగా ముద్దలాగా అవుతుంది.
- దీనితో కావలసినంత పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.
చిట్కాలు
మార్చు- గోధుమలు వేపి, దంచడం ఈ కాలంలో కష్టం. అందువల్ల కొంతమంది బొంబాయిరవ్వతో తయారుచేస్తారు.
- రవ్వలడ్డు విడిపోకుండా కొంచెం గట్టిగా ఉండదానికి చక్కెరను లేతపాకం చేసి అందులో అన్ని పదార్ధాలు వేసి ఉండలు చుట్టుకుంటారు.