రాంగేయ రాఘవ
రాంగేయ రాఘవ (रांगेय राघव) (17 January 1923 – 12 September 1962) 20 వ శతాబ్ధపు ప్రముఖ హింది రచయిత, ప్రముఖ హిందీ సాహిత్యకారుడు. ఆయన జన్మనామం తిరుమళ్ళ నంబాక్కం వీరరాఘవాచార్యులు కాగా హిందీ సంప్రదాయానికి నప్పేలా తన పేరును మార్చుకున్నారు. హిందీ సాహిత్యంలో అభ్యుదయ విప్లవ ధోరణులకు ఆద్యులుగా నిలిచిన వ్యక్తి ఆయన. తన రచనా వ్యాసంగానికి ఆటంకం కాకుండా ఉద్యోగాన్ని చేయకుండా, కొన్నేళ్ళ పాటు వివాహం చేసుకోకుండా నిలిచిన నిబద్ధ రచయిత ఆయన. ఈయన తన రచనల ద్వారా ఆధునిక హింది సాహిత్యంలో అనేక మార్పులు వచ్చెను. కథాకరునిగా, ఆలలోచకునిగా, అనువాదకునిగా, తాత్వి కునిగా, పురతత్వవేతగా ఎన్నొ అమూల్యమైన రచనలు చేసెను. ఒక రచయిత యొక్క ముఖ్య లక్ష్యం సమాజాన్ని తన రచనల ద్వారా ప్రగతిపథం వైపు పయనింపచేయటం.
రాంగేయ రాఘవ్ | |
---|---|
జననం | రాంగేయ రాఘవ్ 1923,జనవరి 17 [1] రాజస్థాన్ |
మరణం | 1962,సెప్టెంబర్ 12 ముంబై |
నివాస ప్రాంతం | రాజ |
మతం | హిందూ |
భాగస్వాములు | సులోచనా |
పిల్లలు | సీమంతిని |
జీవితం
మార్చుసాహిత్యం సమాజానికి అద్దం లాంటిది అంతటారు. రాంగేయ రాఘవ్ రచనల్లో సమాజంలోని విభిన్న కోణాలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. ఈయన అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో 17.1.1923 న రాజస్తాన్ లో జన్మించెను. ఈయన ధర్మప్రవక్త రామనుజాచార్యులవారి వంశస్తులని ప్రతీతి. రాంగేయ రాఘవ్ పూర్తి పేరు తిరువల్లూర్ నంబాకం వీరరాఘవ ఆచార్య్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన చిన్నతనంలోనే అనేక పురణాలు, వేదాలు అవపోసన పట్టెను. 7-5-1956 న సులోచనతో ఈయన వివహం జరిగెను.
కుటుంబ నేపథ్యం
మార్చురాంగేయ రాఘవ తమిళ మూలాలున్న శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించారు. రాఘవ జననానికి సుమారు రెండున్నర శతాబ్దాలకు పూర్వమే ఆయన పూర్వీకులు దక్షిణ ఆర్కాటు జిల్లాల నుంచి రాజస్థాన్ సరిహద్దు గ్రామాలైన వైర్, వారౌలీ జాగీరు భూములకు వలసవెళ్ళీ స్థిరపడ్డారు. తల్లి కనకవల్లి, తండ్రి రంగాచార్యులు తమిళ, కన్నడ భాషల్లో ప్రవీణులు, స్థానిక వ్రజ భాషలో చక్కని పరిజ్ఞానం ఉన్నవారు. వారి నుంచి ఆయనకు సాహిత్యాభిలాష, భాషా పరిజ్ఞానం లభించింది.
వ్యక్తిగత వివరాలు
మార్చురాంగేయ రాఘవ తమిళ వైష్ణవ సంప్రదాయం ప్రకారం తనకు పెట్టిన పేరును స్థానికి హిందీ పద్ధతుల్లోకి మార్చుకున్నారు. రంగని కుమారుడన్న అర్థంలో రాంగేయ అనే పదం, వీరరాఘవాచార్యులు అన్న పేరులోని మధ్యభాగమైన రాఘవ స్వీకరించి హిందీ పద్ధతుల ప్రకారం రాంగేయ్ రాఘవ అని పెట్టుకున్నారు. ఆ పేరుతోనే సాహిత్య ప్రపంచంలో చిరఖ్యాతిని ఆర్జించుకున్నారు. ఆయన పీహెచ్‌డీ పట్టా ఉండీ, ఎన్నో ఉద్యోగాలు తలుపు తడుతూన్నా వ్యక్తిగతమైన అభిరుచి మేరకు సాహిత్యానికే నిబద్ధులై ఉండిపోయారు. సాహిత్యాన్నే పూర్తిస్థాయి వ్యాపకంగా స్వీకరించి జీవితాంతం ఏ ఉద్యోగాన్నీ చేయకుండా ఉండిపోయారు. వివాహం తన సాహిత్య కృషికి ఆటంకమవుతుందన్న అభిప్రాయంతో వివాహాన్ని వాయిదాలు వేస్తూ పోయారు. తన కోసం నిశ్చయించిన తమిళ వైష్ణవ మూలాలున్న శకుంతల అనే అమ్మాయిని తన అన్నకు ఇచ్చి పెళ్ళిచేయించారు. చివరకు శకుంతల చెల్లెలు, అప్పటికి మెట్రిక్ చదువుతున్న సులోచనతో వివాహమైతే తన వ్యాపకానికి, ఉద్యోగం చేయనితనానికి అడ్డువుండదన్న హామీతో వివాహం చేసుకున్నారు.
వైవాహిక జీవితం
మార్చుఅభ్యుదయ భావాలు కలిగిన రచయిత కవటంతో తన భార్య సులోచనను బి.ఏ వరకు చదివించి తనను తాను పోషించుకోగలదనే ఆత్మవిశ్వాసాన్ని ఆమెలో పెంపోందించెను. "తన తండ్రి రంగాచార్యుని పేరు నుండి 'రాంగేయ్', వంశపారంపర్యంగా వచ్చే వీరరాఘవ్ లోని 'రాఘవ్' ను చేర్చి ఆయన తన పేరును 'రాంగేయ రాఘవ్' గా మార్చుకొనెను."[2]
విద్య
మార్చుఆగ్రా విశ్వవిద్యాలయం నుండి 'గురు గొరఖనాథ్ అవుర్ ఉన్ కా యుగ్' అనే పరిశోధనా గ్రంథాన్ని సమర్పించెను.
అధ్యయనం, సాహిత్యం
మార్చురాంగేయ రాఘవను హిందీ సాహిత్యంలో అంతర్జాతీయ దృక్పథాన్ని ప్రవేశపెట్టిన వైతాళికునిగా సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. తన పీహెచ్‌డీ కోసం చేసిన అధ్యయనం కోసం రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకూ విస్తృతమైన ప్రయాణాలతో పరిశోధనలు చేశారు. భారతీయ మధ్యయుగాలలో సంధికాల అధ్యయనం-గోరఖ్‌నాథ్ యుగం అనే అంశంపై అధ్యయనం కోసం ఆయన శాంతినికేతన్ వరకూ వెళ్ళారు. ద్వివేదీ అనే సాహిత్యవేత్త "నాథ సంప్రదాయం" అనే రచన చేసినా అప్పటికి అచ్చుకాలేదు. రాఘవ అధ్యయనం, పట్టుదలకు ముచ్చటవేసి ఆయన రాతప్రతిని చదువుకునే వీలిచ్చారు. ద్వివేదీ ఇంట్లోనే మకాంచేసి అధ్యయనం చేసి అనంతరం వారణాసిలోని మణినాథ మఠాన్ని కూడా సందర్శించి అత్యంత సమగ్రంగా అధ్యయనం చేశారు.
ఆయన రచనలు అడపాదడపా కాలేజీ మ్యాగజైన్లలో ప్రచురితమైనా, పూర్తిస్థాయి సాహిత్యంగా ఘరౌందా నవలను ఎం.ఎ. (ఆర్థిక శాస్త్రం) చదువుతున్నప్పుడు రచించారు. ముర్దోంకా తీలా, కబ్ తక్ పుకరూన్ మొదలైన రచనలు హిందీ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
అభిప్రాయాలు
మార్చురాంగేయ రాఘవ ఎన్నో రంగాల్లో విభిన్నమైన అభిప్రాయాలు వెలువరించారు. వామాచారం, పురోగామితత్త్వ లేమితో బౌద్ధం నైతికంగా పతనమై తనకు తానే హిందూమతానికి తిరిగి దారినిచ్చిందని, దానికి భిన్నమైన రీతిలో జైనం పురోగామితత్త్వాన్ని పొందిందని, క్షత్రియుల్ని యుద్ధంలో చంపి పొందిన బ్రాహ్మణ భూమిలో చివరకు భార్గవరామునికి నిలువనీడ లేకపోవడం తర్వాతి యుగారంభమైన బ్రాహ్మణ-క్షత్రియ సహకారాన్ని సూచిస్తుందని, ఋగ్వేదానికి మారిన రూపమే సామవేదమని, కపటియైన అక్బరు ఏ విధంగానూ గొప్పవాడన్న గౌరవానికి అర్హుడు కాడనీ ఆయన వైవిధ్యభరితమైన అభిప్రాయాలు సప్రమాణంగా వెలువరించారు.
రచనలు
మార్చుపువ్వు పుట్టగానే పరిమళించింట్టుగా ఈయన 12 సం: ల వయస్సులోనే తన రచనా జీవితాన్ని ఆరంభించెను. జీవించిన అతి కొద్దికాలం లోనే మొత్తం 159 రచనలు చేసి హిందీ సాహిత్యానికి ఎనలేని సేవ చేసెను. 40 నవలలు రచించి వాటి ద్వారా విభిన్న కొత్త కొణాలను ఆవిష్కరించెను. 'ఘరొందా' డా.రాంగేయ రాఘవ్ యొక్క మొదటి నవల. 1946 వ సం:లో దీని ప్రచురణ జరిగెను. ఈనవల ద్వారా సహశిక్షణ ద్వారా కళాశాల వాతావరణం ఎవిధంగా కలుషితమవుతుందో వివరించెను. 'విషాదమఠ్' నవల ద్వారా బెంగాల్ లో కరువు సంభవించక ముందు సుభిక్షంగా వున్న బెంగాల్ ను ఆధారంగా చేసులకొని బకించంద్ చఠర్జి రచించిన 'ఆనంద్ మఠ్' కరువు తరువాత విషాద్ మఠ్ గా ఏవిధంగా మారిందో, 1943 లో సంభవించిన కరువు ద్వారా ఆకలి దప్పులతో అలమటించిన ప్రజల పరిస్థితిని, తిండి కోసం వెశ్యలుగా మారిన మహిళల దుస్థితిని వివరించెను. రాంగేయ రాఘవ్ యొక్క మరొక అధ్బుత నవల రాయి అవుర్ పర్వత్ ఈ నవల ద్వారా సమాజంలో దిగజారుతున్న నైతికవిలువలను తెలియజేసెను.