రాఖీ
రాఖీ శ్రావణ పూర్ణిమ నాడు సోదరీ మణులు సోదరుల ఉన్నతిని కోరుతూ సోదరులకు కట్టే ఒక రకపు దారపు పట్టీ. ఈ అచారం హిందువులు, సిక్కులలో కనిపిస్తుంది[1][2][3]. పంజాబ్ ప్రాంతంలో రక్షా బంధన్ పండుగను రఖ్రియ గా జరుపుకుంటారు. [4] ఈ పండుగను కూడా శ్రావణ మాసంలో అదే రోజు జరుపుతారు. రక్షాబంధన్ అనే పండుగ సోదరీ, సోదరుల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుతారు. "రఖ్రి" అనగా "రక్షించడం" అని అర్థం. ఈ పండలలో సోదరి సోదరుని శ్రేయస్సును కోరుతూ రాఖీ కడితే, సోదరుడు సోదరిని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఫెడొరేక్ (2006) ప్రకారం రాఖీ పండుగ "సోదరులు, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని" తెలియజేసే పండుగ.[5] వివాహితులైన స్త్రీలు కూడా ఈ పండగ రోజున తన పుట్టింటికి వచ్చి సోదరులకు రాఖీలు కడతారు.[6]
రఖ్రియ a పంజాబీ: ਰੱਖੜੀਆ | |
---|---|
అధికారిక పేరు | రఖ్రియ |
యితర పేర్లు | రఖర్ పుణ్య |
జరుపుకొనేవారు | హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, |
జరుపుకొనే రోజు | శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజు ਸਾਵਨ ਪੁੰਨਿਆ |
ఒక రాఖ్రిని ఎవరైనా బంధువు లేదా సంబంధం లేని వ్యక్తులకు కూడా సోదరులుగా భావించి కట్టవచ్చు. ఎవరైనా స్త్రీ సంబంధం లేని వ్యక్తి చేతికి రాఖీ ని కడితే వారిమధ్య సోదరీ, సోదరుల అనుబంధం ఉన్నట్లు భావించబడుతుంది. ఈ పండుగ తల్లుల దినోత్సవం, తండ్రుల దినోత్సవం, తాతల దినోత్సవం వలె తోబుట్టువుల దినోత్సవంగా భావించవచ్చు.[7]
వేడుక
మార్చుఈ పండగ రోజు సోదరి సోదరుని చేతికి రాఖీ కడితే సాంప్రదాయకంగా సోదరుడు ఏదైనా బహుమతిని సోదరికి అందజేస్తాడు. వేడుకల మరొక లక్షణం స్వీట్లు తీసుకోవడం.[8] ప్రత్యేకమైన వేడుక లేదు, కానీ కొందరు సోదరీమణులు జానపద పాటలు పాడతారు[9].
మూలాలు
మార్చు- ↑ Eleanor Nesbitt (2016) Sikhism: A Very Short Introduction. Oxford University Press[1]
- ↑ Marian de Souza, Gloria Durka, Kathleen Engebretson, Robert Jackson, Andrew McGrad (2007) International Handbook of the Religious, Moral and Spiritual Dimensions in Education. Springer [2]
- ↑ People of India: A - G., Volume 4 (1998) Oxford Univ. Press[3]
- ↑ "Raksha bandhan is here!". The Hindu (in Indian English). 2014-08-08. ISSN 0971-751X. Retrieved 2016-08-17.
- ↑ Fedorak, Shirley (2006) Windows on the World: Case Studies in Anthropology. Nelson. [4]
- ↑ Hess, Linda (2015) Bodies of Song: Kabir Oral Traditions and Performative Worlds in North India. Oxford University Press[5]
- ↑ "Articles - Siblings Day Foundation". Archived from the original on 2016-06-17. Retrieved 2016-08-17.
- ↑ Kristen Haar, Sewa Singh Kalsi (2009) Sikhism
- ↑ Pande, Alka (1999) Folk Music & Musical Instruments of Punjab: From Mustard Fields to Disco Lights, Volume 1 [6]