రాగిణి షా
రాగిణి షా భారతీయ నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. టీవిరంగంలో అనేక సహాయ పాత్రలలో నటించింది. సరస్వతీచంద్ర అనే సీరియల్‌లో దుగ్బా పాత్రతో గుర్తింపు పొందింది.[1]
రాగిణి షా | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1970–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | దీపక్ ఘీవాలా |
వ్యక్తిగత జీవితం
మార్చునటుడు-దర్శకుడు దీపక్ ఘీవాలాతో రాగిణి వివాహం జరిగింది.
కళారంగం
మార్చురాగిణి 50కి పైగా గుజరాతీ సినిమాల్లో నటించడంతోపాటు దర్శకత్వం కూడా చేసింది. ఆ తరువాత ముంబైకి వెళ్ళి, అక్కడ కొన్ని హిందీ టెలివిజన్ సీరియళ్ళలో నటించింది. ఈటీవి గుజరాతీలో ప్రసారమైన మోతీ బా సీరియల్‌లో ప్రధానపాత్రలో నటించింది.
1990ల ప్రారంభంలో దూరదర్శన్‌లో వచ్చిన చాణక్య సీరియల్‌లో సహాయక పాత్రతో హిందీ టీవిరంగంలోకి అరంగేట్రం చేసింది. 1999లో సోనీ టీవీలో వచ్చిన ఏక్ మహల్ హో సప్నో కా అనే హిందీ సీరియల్‌లో రష్మీ శేఖర్ నానావతిగా కనిపించింది. 2001లో చందన్ కా పల్నా రేషమ్ కి డోరి సీరియల్‌లో కూడా నటించింది. దాని తర్వాత హిందీ సీరియళ్ళలో సహాయక, తల్లి పాత్రలను పోషించింది. సరస్వతీచంద్ర (2013–14)లో దుగ్బా పాత్రలో నటించిన రాగిణి అందరికి గుర్తుండిపోయింది.[2] దియా ఔర్ బాతీ హమ్ (2011–16)లో మాసా పాత్రను పోషించింది, ఇది భారతీయ టెలివిజన్‌లో అత్యధిక రేటింగ్ పొందిన సీరియళ్ళలో ఒకటిగా నిలిచింది.
వినోద్ గణత్రా దర్శకత్వంలో వచ్చిన హరున్ అరుణ్ (2009)లో ఒక పాత్రను పోషించింది. 2017 మే నుండి 2018 మే వరకు, స్టార్ ప్లస్‌లో వచ్చిన నామ్‌కరణ్ సీరియల్‌లో దయావంతి మెహతా సమాంతర ప్రధాన పాత్రను పోషించింది. గతంలో అదే పాత్రను పోషించిన ప్రముఖ నటి రీమా లాగూ ఆకస్మికంగా మరణించిన తర్వాత, నిర్మాత మహేష్ భట్ ఈ పాత్ర కోసం రాగిణి సంప్రదించాడు.[3]
నటించినవి
మార్చుటెలివిజన్
మార్చు- 1991: చాణక్యుడు ( చాణక్యుడి తల్లి)
- 2001: చందన్ కా పల్నా రేషమ్ కి డోరీ (శ్రీమతి. జాంకీ భీమని)
- 2011-2016: దియా ఔర్ బాతీ హమ్ (మా సా)
- 2013-2014: సరస్వతీచంద్ర (దుబ్గా షహస్త్రర్)
- 2017: నామ్‌కరణ్ (దయావంతి మెహతా)
- 2021 మెహందీ హై రచ్నే వాలీ (జయరావు)
సినిమాలు (కొన్ని)
మార్చు- డాకు రాణి గంగా (1976, తొలి గుజరాతీ సినిమా)
- హరున్ అరుణ్ (2009, గుజరాతీ)
- హార్దిక్ అభినందన్ (2016, గుజరాతీ సినిమా)
- దాదా హో డికారి - గుజరాతీ సినిమా
మూలాలు
మార్చు- ↑ "Actor Ragini Shah has been roped for Saraswatichandra". Archived from the original on 19 August 2014. Retrieved 2023-02-06.
- ↑ "Actor Ragini Shah has been roped for Saraswatichandra". Archived from the original on 19 August 2014. Retrieved 2023-02-06.
- ↑ Ragini Shah to play Dayavanti Mehta’s role made famous by Reema Lagoo in Naamkarann: Know more about Gujarati actress!
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాగిణి షా పేజీ