రాజధాని
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రాజధాని ( రాజధాని నగరం) అనగా దేశం, ప్రాంతం, రాష్ట్రం మొదలైన వాటి పరిపాలన శాఖలు ప్రధానంగా గల పట్టణం లేదా నగరం. రాజధాని పరిపాలన కొరకు సాధారణంగా మహా నగరపాలక సంస్థ ఉంటుంది. ఒక నగరాన్ని రాజధానిగా పేర్కొనడం రాజ్యాంగంలో కాని చట్టం ద్వారాగాని జరుగుతుంది. కొన్ని దేశాలకు, ప్రాంతాలకు అధికారిక రాజధాని వున్నా, ప్రభుత్వ పాలన కేంద్రం వేరేగా వుండవచ్చు. మాధ్యమాలలో రాజధాని నగరాన్ని ఆ దేశ ప్రభుత్వానికి బదులుగా వాడుతారు. ఉదాహరణకు, వాషింగ్టన్, లండన్ మధ్య సంబంధాలు అనగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్డమ్ సంబంధాలు అని అర్ధం.[1]
మూలాలుసవరించు
- ↑ Panther, Klaus-Uwe; Thornburg, Linda L.; Barcelona, Antonio (2009). Metonymy and Metaphor in Grammar (in ఇంగ్లీష్). John Benjamins Publishing. ISBN 978-90-272-2379-1.