రాజన్ మహదేవ్ (జననం 1957) ఒక భారతీయ భారతదేశంలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒక్కడిగా పేర్కొన్న బడ్డాడు .

బాల్యం మార్చు

మహదేవ్ 1957లో మద్రాసులో జన్మించాడు. 1959లో ఇతని కుటుంబం కర్ణాటకలోని మంగళూరుకు వలస వెళ్లింది. రాజన్ మహదేవ్ 5 సంవత్సరాల వయస్సులో సంఖ్యలను గుర్తించుకునేవాడు. రాజన్ మహదేవ్ చిన్నప్పుడు తన ఇంటి వద్ద ఉన్న కారు నంబర్ ప్లేట్ల ను నోట్ బుక్ లో రాసుకునేవాడు.

విద్య మార్చు

1977లో, ఇంజినీరింగ్‌పై మహాదేవ్ ఆసక్తిని చూపాడు. 5 జూలై 1981న, అతను పై మొదటి 31,811 అంకెలను జ్ఞాపకం ఉంచుకున్నాడు [1] మహాదేవ్ 1984లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

1986లో మైసూర్ విశ్వవిద్యాలయం నుండి క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

మహదేవన్ సంఖ్యలను గుర్తుపెట్టుకోవడంలో ప్రవీణుడు అయినప్పటికీ, గద్య భాగాలు లేదా రేఖాగణిత ఆకృతుల విషయానికి వస్తే అతను సగటు జ్ఞాపకశక్తిని మాత్రమే ప్రదర్శిస్తాడు. [2]

మూలాలు మార్చు

  1. Rajan Mahadevan recites 31,811 digits of ã from memory 5 July in History
  2. DAVID R. SHANKS, Science Spectra, 1999, Number 18. Outstanding Performers: Created, Not Born? NEW RESULTS ON NATURE VS. NURTURE.