రాజమండ్రి పుష్కరాలు 2015

2015 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా ప్రసిద్ధి కలిగిన రాజమహేంద్రవరం పట్టణంలో ఈ పుష్కరాలను భారీ ఎత్తున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రారంభంసవరించు

జులై 14 నుండి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు జూలై 13 నుండి కార్యక్రమాలు మొదలు కానున్నాయి. వీటిలో పలు గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉన్నాయి.

రాజమహేంద్రవరం సందర్శనీయ ప్రాంతాలుసవరించు

దేవాలయాలు, దర్శనాలుసవరించు

 • ఇస్కాన్ కృష్ణ మందిరం - మునుపు ఎరుపు, పసుపు రంగుల కలయికతో ఉన్న ఆలయాన్ని ఇపుడు నీలి రంగుల మిశ్రమంతో అలంకరించారు. ఇది గౌతమీ ఘాట్ ప్రధాన రహదారిలో ఉంది.
 • స్వామి అయ్యప్ప దేవాలయం - ఇది కేరళ అయ్యప్ప ఆలయ రీతిలో పూర్తిగా కొండ రాళ్లతో నిర్మించిన ఆలయం. దీనిలో స్వాముల దీక్షలకు వీలుగా పలు భవనాలు నిర్మించారు. పూజా విధానాలు కూడా కేరళ పద్ధతిలో జరుగుతాయి.
 • శ్రీరంగధామం - చిన జీయర్ స్వామి ద్వారా ప్రారంభించిన ఈ ఆలయ సముదాయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల ఆలయంతో మూడు అంతస్తులుగా ఉంటుంది. ఇది గౌతమీ ఘాట్ ఎగువ భాగంలో ఇస్కాన్ దేవాలయం ప్రక్కన ఉంది. దీనిని చేరుకోవాలంటే ధవళేశ్వరం వద్ద గోదావరి రోడ్డున రావలి లేదా కోటి పల్లి నుండి, కోటి లింగాల రేవుకు వెళ్లే మార్గంలో ఉంది.
 • గాయత్రీ పీఠం - ఇది కూడా గౌతమీ ఘాట్ వద్దే కైలాసగిరికి ప్రక్కన గోదావరి ఒడ్డున ఉంది. దీని ప్రత్యేకతలు 150 అడుగుల ఎత్తున కల దేవాలయం. మలయాళ స్వామి వారి గీతా జ్ఞాన మందిరం, సిద్ద సమాధి వంటివి ఉన్నాయి.
 • జగద్గురు పీఠం - ఇది కూడా గౌతమీ ఘాట్ వద్ద రెందవ వీధిలో ఉంది. దీనిలో ప్రతి ధినం పారాయణం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉచిత హోమియో వైద్యం జరుగుతుంది.
 • ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం - ఇక్కడ శ్రీ అన్న పూర్ణ సమేత కోటిలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ సీతా రాముల దేవాలయం కుడా ఉంది.
 • శ్రీ వేణుగోపాలస్వామి గుడి - గుడిలోని 12 దేవాలయ స్తంభాలు, సరోవరం, రాతి కట్టడంతో చదరస్రాకారములో దిగుడు బావి ఇంకను అలాగే ఉన్నాయి.
 • దత్త ముక్తి క్షేత్రం. ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ లో ఉంది. దత్త ముక్తి క్షేత్రం
 • శ్యామలాంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం
 • సత్యనారాయణ స్వామి ఆలయం
 • అయ్యప్ప దేవాలయం
 • వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయం
 • శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి గుడి
 • శ్రీ సారంగధీశ్వర స్వామి గుడి
 • జగన్నాధ స్వామి ఆలయం

నమూనా దేవాలయాలుసవరించు

 
నమూనా దేవాలయాలలో ఒకటి
 
నమూనా దేవాలయాలలో ఒకటి
 • వెంకటేశ్వర స్వామి ఆలయం - కోటిపల్లి బస్టాండ్ నుండి తాడితోటకు వెళ్ళే దారిలో కల మునిసిపాలిటీ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థాన నమూనా ఆలయం నిర్మించారు. దీనిని వెంకటేశ్వరుని 13 ఉదయం ప్రతిష్ఠించారు. తరువాత ధర్శనానికి అందుబాటులో ఉంచారు.
 • కాణిపాక వరసిద్ది వినాయక ఆలయం - దీనిని స్థానిక ప్రభుత్వ మహిళాకళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసారు.
 • ద్వారకాతిరుమల దేవస్థానం
 • అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం
 • విజయవాడ కనకదుర్గ ఆలయం
 • సింహాచల నారసింహ ఆలయం
 • కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం (విశాఖపట్నం)
 • మల్లికార్జునస్వామి దేవాలయం, శ్రీశైలం
 • శ్రీరామాలయం, ఒంటిమిట్ట
 • సూర్యనారాయణస్వామి ఆలయం అరసవెల్లి
 • ఆంజనేయస్వామి ఆలయం, కసాపురం
 • నరసింహస్వామి, అహోబిలం

ఉద్యాన వనాలుసవరించు

 
Nrutya vanam Rajamandry
 • నృత్య వనం - ఇది కోటి పల్లి బస్టాండ్ ఎదుట ఉంది. భారతీయ నృత్య రీతులన్నీ బొమ్మల రూపంలో కలిగి ఉండటం దీని ప్రత్యేకత
 • పి.వి.నరసింహారావు ఉద్యానవనం
 • కంబాల చెరువు ఉద్యానవనం
 • పి.వి. నరసింహారావు ఉద్యానవనం (గోదావరి పార్కు)

పట్టణ సుందరీకరణసవరించు

రహదారులు, భవనాల శాఖసవరించు

రోడ్లు, భవనాల సంస్థ తొలివిడతలో 115 కోట్లతో 57 పనులను చేపట్టింది. రెందవ దశలో 228 కోట్లతో 134 పనులు చేపట్టింది వీటిలో ముఖ్యమైనవి

 • జాతీయ రహదారి నుండి రైల్వే స్టేషన్ వెనుక వైపు రహదారి విస్తరణ
 • వేమగిరి నుండి కొటిపల్లి బస్టాండ్ వరకూ రహదారి విస్తరణ, భూగర్భ డ్రైనేజి వ్యవస్థ
 • కొత్త వంతెన నుండి జాతీయ రహదారి వరకు నూతన రహదారి నిర్మాణం
 • రాజానగరం నుండి వేమగిరి వరకు రహదారి అభివృద్ధి

పంచాయితీ రాజ్ శాఖసవరించు

పంచాయితీరాజ్ శాఖ 7.59 కోట్లతో 42 పనులు చేపట్టింది. రెండవ దశలో 35.97 కోట్లతో 126 పనులు చేపట్టింది.

దేవాదాయ శాఖసవరించు

మొదటి విడత 12.50 కోట్లతో 116 పనులు, రెండవ విడత 4.51 కోట్లతో 210 పనులు చేపట్టారు

మొక్కలు, ఉద్యానవనాలుసవరించు

పట్టణంలో వివిధ ప్రాంతాలలో మొక్కలు నాటడం చేస్తున్నారు. దీనికోసం కడియం నర్సరీల నుండి 20 లక్షల మొక్కలు తీసుకొస్తున్నారు. వీటిని గోదావరి తీరం, రోడ్డు ప్రాంతంలోనూ, జైలు రోడ్డు, ధవళేశ్వరం, కొత్త వంతెన ప్రాంతాలలో నాటుతున్నారు

రవాణా వ్యవస్థసవరించు

బస్సుసవరించు

రాజమహేంద్రవరం ప్రధాన బస్సు నిలయం, డిపో సుమారు వెయ్యి బస్సుల సామర్ధ్యం కలిగి ఉంది. కొవ్వూరుమీదుగా వచ్చేవారు కోటిపల్లి బస్సుస్టాండు వద్ద దిగి గోదావరికి నడిచి చేరుకోవచ్చును

భద్రతా వ్యవస్థసవరించు

గోడావరి పుష్కరాలకు రాజమండ్రిలో తొలిసారిగా ఆకాశంలో నిఘా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ట్రైల్స్ వేసిన రక్షణ సిబ్బంది డ్రోన్ అనే తెలికపాటి నిఘా కెమేరాలు కలిగిన విమానాలను వాడుతున్నారు. వీటిని కొవ్వూరు, రాజమండ్రిలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో వాడుతారు

మీడియా, ఇంటర్నెట్ సేవలుసవరించు

 • గోదావరి పుష్కరాలలో భాగంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, బస్టాండ్లలో 3జి సర్వీస్ మొదటి అరగంట ఉచితంగా అందిస్తున్నారు. తరువాత రుసుము చెల్లించవలసి ఉంటుంది.

స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంసవరించు

ఇస్కాన్సవరించు

రామకృష్ణమఠంసవరించు

సత్యసాయి సేవా ట్రస్ట్సవరించు

జగద్గురు పీఠంసవరించు

ప్రతి రోజూ ఐదువేల మందికి భోజన సౌకర్యాలు సమకూర్చుతున్నారు. ఇది గౌతమీ ఘాట్ చివరి సందులో కలదు

లైన్స్ క్లబ్ రాజమండ్రిసవరించు

రాజమండ్రి రైజింగ్ గ్రూప్సవరించు

రాజమండ్రి రైజింగ్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ పేస్బుక్ ద్వారా తమ సేవలను అందిస్తున్నది. అగ్లీ ఇండియా ద్వారా ప్రేరణ పొందిన వీరు ప్రధాన కూడళ్ళలో గోడలను శుభ్రం చేసి వాటిని చక్కని చిత్రాలతో తీర్చిదిద్దుతారు


భక్తులకు సౌకర్యాలుసవరించు

పిండప్రధానాలుసవరించు

పిండ ప్రధానాలకొరకు కొటిలింగాల రేవు దగ్గర కోటగుమ్మం ప్రక్కగా షెడ్ల నిర్మాణం జరిగింది. ఘాట్ల పైన రొడ్డుకు మద్యలో కూడా మద్య మద్య షెడ్ల నిర్మాణం జరిపారు.

ఘాట్లు, ప్రాంతాలుసవరించు

పుష్కర రేవు
 
పుష్కరాల రేవు వద్ద భక్తుల స్నానాలు
 • గౌతమీ ఘాట్
 • సరస్వతీ ఘాట్
 • మర్కండేయ ఘాట్
 • కోటి లింగాల రేవు

భోజన సౌకర్యాలుసవరించు

విశ్రాంతి సౌకర్యాలుసవరించు

మరుగు దొడ్లుసవరించు

 • ఘాట్ల వద్ద శాశ్వత మరుగు దొడ్లు ఉన్నాయి.
 • రాజమహేంద్రవరం మునిసిపాలిటీ 1300 మొబైల్ మరుగుదొడ్లను వివిధప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నది.
 • రైల్వే స్టేషన్ వద్ద భారతీయ రైల్వే వారు 100 మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

పరిసర ప్రాంత దేవాలయాలుసవరించు

మూలాలుసవరించు