రాజరాజు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వారి నవలిక. ఇది రాజమహేంద్రవరము అను రాజమండ్రిని పాలించిన రాజరాజ నరేంద్రుని కథ. రాజరాజ నరేంద్రుని కొలువులో ఉంటూ ఆంధ్ర సాహిత్యానికి శ్రీకారం చుట్టిన నన్నయ్య యొక్క అభిమానం, ఆయన విలక్షణ వ్యక్తిత్వం ప్రతిబింబించే రచన రాజరాజు.

రాజరాజు
శ్రీపాధ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి రాజరాజు నవల ముఖచిత్రం
కృతికర్త: శ్రీపాధ సుబ్రహ్మణ్యశాస్త్రి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: ఎం.షేషాచలం,అండ్ కో, మచిలీపట్నం, మద్రాస్
విడుదల: 1944
పేజీలు: 232

పాత్రలు

మార్చు
  • రాజరాజు - చాళుక్య చక్రవర్తి
  • నన్నయభట్టు - ఆస్థాన కవి
  • సారంగధరుడు - యువరాజు
  • చిట్టివీరన్న - మహామంత్రి
  • విజయాదిత్యుడు - చక్రవర్తి తమ్ముడు
  • సుబుద్ధి - మహామంత్రి కొడుకు
  • రత్నాంగి - మహారాణి
  • చిత్రాంగి - జక్కులదీవి రాజ పుత్రిక

కథ, రచనా విధానం

మార్చు

ఇతర విశేషాలు

మార్చు
  • శ్రీపాద వారు ఈ నవలికను విక్రమ దేవవర్మ మహారాజుకు అంకితమిచ్చాడు
  • ఎమెస్కో బుక్ ట్రస్ట్ వారు దీనిని పాకెట్ పుస్తకంగా 1944 మార్చిలో ముద్రించారు.
  • ఇది నిజానికి ఒక రూపకంగా ఉండే నవల
  • దీనికి పీఠికను పి.గణపతి శాస్త్రి గారు వ్రాసారు.
  • ఈ రచన అప్పటి రాజమండ్రి, గోదావరిల శోభను వర్ణిస్తుంది