రాజరాజ నరేంద్రుడు

రాజరాజ నరేంద్రుడు (సా.శ. 1019–1061) దక్షిణ భారతదేశంలో వేంగి రాజ్యం యొక్క తూర్పు చాళుక్య రాజు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం (రాజమండ్రి) స్థాపించాడు. అతని కాలం సామాజిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.

రాజరాజ నరేంద్రుడి చిత్రపటం
రాజమండ్రిలో పుష్కర ఘాట్ కి ఎదురుగా ఉన్న రాజరాజనరేంద్రుడు విగ్రహం
రాజమండ్రి రైల్వేస్టేషన్ భవంతిపై రాజరాజ నరేంద్రుడి (సా.శ. 1019–1061) విగ్రహం

వివాహ, రాజకీయ లింకుల ద్వారా తంజావూరు యొక్క చోళులతో రాజరాజకు సంబంధముంది.

తన కాలంలో సాహిత్య రచనలు

మార్చు
 
నన్నయ చిత్రపటం

రాజరాజ నరేంద్రుడి కాలంలో రెండు సాహిత్య రచనలు ఉదాహరణకు విక్రమార్జున విజయం, గదాయుద్ధం కన్నడ భాషలో రచించబడ్డాయి, అవి అప్పటికే కర్నాటకలో సంస్కృత మహాభారతం యొక్క కథలుగా ప్రాచుర్యం పొందాయి. ఏడవ, ఎనిమిదవ శతాబ్దాలలోనే మహాభారతం యొక్క తమిళ అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, పురాణాలు తెలుగులో అందుబాటులో లేవు. తూర్పు చాళుక్య రాజవంశస్తులు జైనమతం, శైవ మతానికి మద్దతు నిచ్చారు. రాజరాజ నరేంద్రుడు శైవమతస్తుడు (Shaivite). అతను జైనులు, బౌద్ధుల యొక్క విజయం నుంచి అన్ని మతాలను ఆదరించడం, పురాణాలను తెలుగులోకి అనువదించడం వంటివి విజయానికి ఏకైక మార్గమని నేర్చుకున్నాడు. ఒక వెయ్యి సంవత్సరాల ముందే, బౌద్ధమతం, జైనమతం వారి ప్రబోధాల, శిక్షణల కొరకు స్థానిక భాషలను ఉపయోగించి బాగా ప్రాచుర్యం పొందారు. కనుక, రాజరాజ నరేంద్రుడు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని తన గురువు, సలహాదారు, ఆస్థాన కవి అయిన నన్నయ భట్టారకుని అభ్యర్థించాడు. నన్నయ భట్టారకుడు ఈ కార్యక్రమాన్ని చాలా తీవ్రమైన సవాలుగా తీసుకున్నాడు. అతను, ఆ సమయంలో వాడుకలో ఉన్న అన్ని తెలుగు పదజాలాలను పరిశీలిస్తూ, సంస్కృత పదజాలం పరిచయం చేసుకొని, ఆ విధంగా అతను ఒక ప్రత్యేకమైన సాహిత్య శైలి, ఛందస్సు,, వ్యాకరణం అభివృద్ధి చేశారు. నన్నయ సంస్కృత మహాభారతంలోని ఆది, సభ, అరణ్య పర్వాల యొక్క 142 పద్యాలను అనువదించాడు. అయితే, అతను అసలైన దానికి కట్టుబడి వ్రాయలేదు. కథాంశం కొనసాగిస్తూ సవరణలు, తొలగింపులు చేస్తూ, అందనంగా మరికొంత చేర్చుతూ అతను దాదాపు ఆంధ్రమహాభారతం యొక్క సొంత కథనం రూపొందించారు. తన భాష చాలా సంస్కృతీకరించబడినది, పాఠకులకు ఆనందానిచ్చింది.

ఇవి కూడా చూడండి

మార్చు

నన్నయ

బయటి లింకులు

మార్చు