రాజసూయ యాగం
రాజసూయం అంటే ప్రాచీన భారతదేశపు రాజులు తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి చేసే ఒక వైదిక క్రతువు. రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో ఈ యాగాన్ని నిర్వహిస్తారు.[1][2]
విధానం
మార్చుఈ యాగంలో భాగంగా రాజుకు నాలుగు చెట్ల నుంచి తయారు చేసిన నాలుగు చెక్క బిందెలతో నాలుగు నదుల పవిత్ర జలాలు తెచ్చి స్నానం చేయిస్తారు. ఆ తర్వాత వైద్యపరమైన మూలికలు, ఎర్ర కలువల నుంచి ఒక రకమైన రంగును కలబోసిన ద్రవాలతో స్నానం చేయిస్తారు. దాంతో అతను ఒక దీక్ష చేపట్టినట్లు లెక్క. రాజు ఒక సంవత్సరం పాటు కొన్ని నియమాలు పాటించాలి. మధ్యలో అతను ముఖంమీది ఎలాంటి జుట్టునూ కత్తిరించరాదు. ఎందుకంటే అప్పటి అతను తలంటడానికి వాడిన ఔషధీ జలాల ప్రయోజనం పోతుంది కనుక. ఇది కేశ వపనీయ అనే క్రతువుతో ముగుస్తుంది. రాజసూయ యాగానికి ముందే పవిత్ర, అగ్నిస్తోమ, అభిశేచనీయ, సోమ లాంటి యాగాలు చేస్తారు. ఈ తంతు అంతా దాదాపు ఏడాదిపాటు జరుగుతుంది. సంవత్సరం చివర్లో రాజుకు పట్టాభిషేకం ప్రధాన భాగంగా జరిగేదే రాజసూయ యాగం. సంవత్సరం పాటు జరిగే వివిధ యజ్ఞాల ద్వారా రాజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదిస్తాడు. తన మనస్సును, బుద్ధిని సరిగ్గా వాడటం నేర్చుకుంటాడు. ఈ యాగానికి అయ్యే ఖర్చు అంతా రాజే భరిస్తాడు. యాగం కోసం ప్రత్యేకంగా యజ్ఞశాల నిర్మిస్తారు. ప్రతి యాగంలో చాలా మంది పురోహితులు పాల్గొంటారు. వారికి అందే పారిపతోషికాలు కూడా భారీగా ఉంటాయి.[3]
మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసినట్లు ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది.[4] ఈ యాగం చివరలో ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వబోగా అందరూ అంగీకరించినా శిశుపాలుడు అంగీకరించక, కృష్ణుణ్ణి తులనాడతాడు. శ్రీకృష్ణుడు అతని నూరు తప్పులు క్షమించి తర్వాత తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు.
మూలాలు
మార్చు- ↑ "Importance of yagna". The Hindu (in Indian English). 2018-06-27. ISSN 0971-751X. Retrieved 2019-06-01.
- ↑ "Mahabharat Episode 27: Rajasuya Yagna - Paving the Path to Power". isha.sadhguru.org. Retrieved 2022-08-17.
- ↑ Rao, Rekha (2019-04-29). "Mohenjo-Daro Man Performing Raajasooya Yajna". IndiaFacts (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
- ↑ "గౌతమీపుత్ర రాజసూయ యాగం". andhrabhoomi.net. 8 September 2016.