రాజాచారి
అంతరిక్షంలో పరిశోధనల కోసం 1998వ సంవత్సరంలో ఆకాశంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని కి పరిశోధనల కోసం తరచుగా వ్యోమగాములు భూమి నుంచి వెళ్తుంటారు.అలాంటి నలుగురు సభ్యులు ఉన్న బృందం ఈలన్‌మ్‌స్కకు చెందిన స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో ఐఎస్‌ఎస్‌కు పయనమైంది. గడిచిన 60 ఏళ్లలో అంతరిక్షానికి వెళ్లినవారి సంఖ్య ఈ నలుగురితో కలిపి 600 దాటింది.1961లో యూరీగగారిన్ రోదసిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.అప్పట్నుంచీ ఈ 60 ఏళ్లలో సగటున 10 మంది రోదసిలోకి వెళ్లినట్టు.కాగా, ప్రస్తుతం ఐఎస్‌ఎస్ వెళ్తున్న బృందానికి నేతృత్వం వహిస్తున్నది రాజాచారి (44) అనే తెలుగు వ్యక్తి కావడం గర్వకారణము.[1][2]
రాజా చారి | |
---|---|
జననం | రాజా జాన్ వుర్పుటూర్ చారి 1977 జూన్ 24 |
స్థితి | Active |
విద్యాసంస్థ | United States Air Force Academy (BS) Massachusetts Institute of Technology (MS) |
అంతరిక్ష జీవితం | |
NASA ఆస్ట్రోనాట్ | |
ప్రస్తుత వృత్తి | Fighter pilot |
ర్యాంకు | Colonel, USAF |
అంతరిక్షంలో గడిపిన కాలం | Currently in space |
ఎంపిక | NASA Group 22 |
మొత్తం ఇ.వి.ఎ.లు | None |
అంతరిక్ష నౌకలు | SpaceX Crew-3 (Expedition 66) |
అంతరిక్ష నౌకల చిత్రాలు |
కుటుంబ నేపథ్యం
మార్చురాజాచారి తాతముత్తాతలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు. ఆయన తాతగారి హయాంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది.హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో రాజాచారి తాత గణిత ప్రొఫెసర్‌గా పనిచేశారు.ఆయన కుమారుడు శ్రీనివాసాచారి ఓయూ నుంచి ఇంజనీరింగ్ చదివి 1970లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లారు తనకు పరిచయమైన పెగ్గీ ఎగ్బర్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. 1977 జూన్ 25న రాజాచారి జన్మించాడు.[3]
విద్యాబ్యాసం
మార్చు1995లో పట్టభద్రుడైన రాజాచారి కొఒలరాడోలోని ‘యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ’లో ‘బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆస్ట్రొనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ సైన్స్ కేంబ్రిడ్జిలోని ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2001లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఒక్లహోమాలో అండర్‌గ్రాడ్యుయేట్ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేశారు.పలు సంస్థల్లో శిక్షణ పొంది అమెరికా వాయుసేనలో చేరారు.[4]
పదవులు
మార్చుఅనంతరకాలంలో రోదసియానంపై ఆసక్తి పెంచుకున్న రాజాచారి 2017లో ‘నాసా ఆస్ట్రొనాట్ గ్రూప్ 22’ మిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.దానికి మొత్తం 18,300 దరఖాస్తులు రాగా కేవలం 12 మందిని నాసా ఎంపిక చేసింది.వారిలో రాజాచారి ఒకరు. 2017 ఆగస్టు నుంచి నాసా ఆ పన్నెండు మందికీ రోదసియానంలో రెండేళ్లపాటు శిక్షణనిచ్చింది.శిక్షణ ముగిశాక ఆయన ‘నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో జాయింట్ టెస్ట్ టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.తర్వాత ఐఎస్‌ఎస్ కు వెళ్లే ‘నాసా స్పేస్ ఎక్స్ క్రూ3 మిషన్’ కమాండర్‌గా ఎంపికయ్యారు.గత ఏడాది డిసెంబరులోనాసా రాజాచారిని ‘ఆర్టెమిస్’ బృందంలోకి ఎంపిక చేసింది.[5]
కమాండర్ గా
మార్చునలుగురు సభ్యులు ఉన్న బృందం ఆరు నెలలపాటు ఐఎస్‌ఎస్ లోనే గడపనున్నారు.అమెరికా వాయుసేనలో కల్నల్‌గా వ్యవహరించిన రాజాచారికి గతంలో రోదసిలోకి వెళ్లిన అనుభవమే లేదు.గడచిన 48 ఏళ్లలో ఇలా ఒక అనుభవం లేని వ్యక్తి నాసా మిషన్‌కు నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి.రాజాచారికి ఫైటర్ జెట్ విమానాలను నడపడంలో 2500 గంటల అనుభవం ఉంది.రాజాచారి బృందంలోని మిగతా ముగ్గురిలో జర్మనీకి చెందిన మథియాస్ మారర్ (51) రోదసిలోకి వెళ్లిన 600వ వ్యక్తిగా గుర్తింపు పొందారు.డాక్టర్ థామస్ మార్ష్‌బర్న్ (61) ఈ ట్రిప్‌లో స్పేస్‌వాక్ చేయనున్నారు. ఫ్లైట్ సర్జన్ అయిన మార్ష్‌బర్న్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి. ఇక, నాలుగో వ్యక్తి కేలా బారన్ (35) నేవీ లెఫ్టినెంట్ కమాండర్.[6]
2024లో చంద్రుడిపైకి
మార్చుఎప్పుడో అపోలోతో ఆపేసిన చంద్రయానాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు చేపట్టిన మిషనే ఈ ఆర్టెమిస్.బృందంలోని 18 మందిలో ఇద్దరు 2024లో చంద్రుడిపై అడుగుపెట్టనున్నారు. ఆర్టెమిస్ టీమ్‌లోని ఒకరికి కుజుడిపైకీ వెళ్లే అవకాశం ఉంటుంది.ఆ మిషన్లలో రాజాచారి దేనికి ఎంపికైనా అది తెలుగువారికి గర్వకారణమే.
మూలాలు
మార్చు- ↑ "రోదసిలోకి మన రాజాచారి.. కమాండర్‌గా తెలంగాణ సంతతి బిడ్డ". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-12. Retrieved 2021-11-12.
- ↑ "Raja Chari: ఆకాశం నుంచి రాజాచారి వస్తున్నాడోచ్." EENADU. Retrieved 2022-04-19.
- ↑ "Raja Chari: రోదసిలోకి మన రాజాచారి!". EENADU. Retrieved 2021-11-12.
- ↑ "raja chari".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ telugu, 10tv (2021-11-11). "Astronaut RajaChari : మహబూబ్ నగర్ To చంద్రమండలం వయా అమెరికా..అంతరిక్షంలోకి మన రాజాచారి | NASA ACE Astronaut RajaChari". 10TV (in telugu). Retrieved 2021-11-12.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Space X Crew 3 mission: తెలుగోడి అరుదైన ఘనత.. 48 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి!". andhrajyothy. Retrieved 2021-11-12.